తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Deverakonda Returns His Remuneration After Liger Movie Flop

Vijay Devarakonda: లైగర్ నష్టాలను పూడ్చే పనిలో విజయ్ – రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేశాడా?

HT Telugu Desk HT Telugu

05 September 2022, 10:36 IST

  • Vijay Devarakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన లైగ‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. నిర్మాత‌ల‌కు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు భారీగా న‌ష్టాల‌ను మిగిల్చింది. త‌న సినిమాతో న‌ష్ట‌పోయిన డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు విజ‌య్ అండ‌గా నిలిచిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. రెమ్యునరేషన్ లో  కొంత మొత్తాన్ని వెన‌క్కి తిరిగి ఇచ్చిన‌ట్లు చెబుతున్నారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ
విజ‌య్ దేవ‌ర‌కొండ (Twitter)

విజ‌య్ దేవ‌ర‌కొండ

Vijay Devarakonda: లైగ‌ర్ రిజ‌ల్ట్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు గ‌ట్టిగానే షాక్ ఇచ్చింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్‌లో భారీ అంచ‌నాల‌తో గ‌త నెల 25న విడుద‌లైన ఈ చిత్రం డిజాస్ట‌ర్‌గా నిలిచింది. మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో పూరి జ‌గ‌న్నాథ్ రాసిన క‌థ‌, విజ‌య్ క్యారెక్ట‌రైజేష‌న్‌తో పాటు సినిమాను తెర‌కెక్కించిన తీరుపై విమ‌ర్శ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Bharti Singh Hospitalised: హాస్పిటల్లో చేరిన ప్రముఖ కమెడియన్.. కంటతడి పెడుతూ వీడియో

Salaar TRP: ప్రభాస్ సలార్ మూవీకి టీవీలో దారుణమైన టీఆర్పీ.. ఆ రెండు సినిమాల కంటే తక్కువే.. కారణం ఇదేనా?

Kamal Haasan Linguswamy: కమల్ హాసన్ మోసం చేశాడు: నిర్మాతల మండలికి డైరెక్టర్ ఫిర్యాదు

Prasanth Varma PVCU: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బంపర్ ఆఫర్.. జై హనుమాన్‌లో నటించే అవకాశం!

పూర్తిగా అవుట్ డేటెడ్ పాయింట్ తో తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో తొలిరోజు నుంచే నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. విజ‌య్ క్రేజ్ కార‌ణంగా దాదాపు 90 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా అందులో స‌గం కూడా వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌లేక‌పోయింది. నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు భారీగా న‌ష్టాల‌ను మిగిల్చింది. త‌న కార‌ణంగా న‌ష్ట‌పోయిన డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు విజ‌య్ అండ‌గా నిల‌వ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా కోసం తాను తీసుకున్న పారితోషికంలో దాదాపు ఆరు కోట్లు వెన‌క్కి తిరిగి ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా కోసం విజ‌య్ దాదాపు 35 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్లు స‌మాచారం. అత‌డి కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ రెమ్యున‌రేష‌న్ అందుకున్న చిత్ర‌మిది. కానీ ఊహించ‌ని రీతిలో సినిమా ఫ్లాప్ కావ‌డంతో ఆరు కోట్లు వెన‌క్కి ఇచ్చిన‌ట్లు చెబుతున్నారు.

అంతేకాకుండా పూరి జ‌గ‌న్నాథ్ కూడా సినిమాపై వ‌చ్చిన న‌ష్టంలో ముప్పై శాతం భ‌రించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌లే ఏపీ, తెలంగాణ డిస్ట్రిబ్యూట‌ర్లు సినిమా న‌ష్టాల విష‌య‌మై పూరి జ‌గ‌న్నాథ్‌ను క‌లిసి చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. నష్ట పోయిన మొత్తంలో కొంత తిరిగి ఇవ్వడానికి పూరి అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లైగ‌ర్ సినిమాలో అన‌న్యా పాండే హీరోయిన్‌గా న‌టించింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.