Family Star OTT: ఓటీటీలోకి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్.. 2 భాషల్లో స్ట్రీమింగ్.. కానీ, అదొక్కటే సమస్య?
19 April 2024, 12:59 IST
Family Star OTT Streaming: విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ పెట్ల కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా ఫ్యామిలీ స్టార్. ఏప్రిల్ 5న బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేయనుంది. ఫ్యామిలీ స్టార్ ఓటీటీ పూర్తి వివరాలు చూస్తే..
ఓటీటీలోకి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్.. 2 భాషల్లో స్ట్రీమింగ్.. కానీ, అదొక్కటే సమస్య?
Family Star OTT Release: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్‌గా థియేటర్స్‌లో విడుదలైంది. ఈ సినిమాకు సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చిందని నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ పరశురామ్ పెట్ల చెప్పుకొచ్చారు. అయితే సినిమా విడుదలైన మొదటి షో నుంచే ఫ్యామిలీ స్టార్‌పై మిశ్రమ స్పందన వచ్చింది.
టిల్లుగాడి వైపే
ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫ్యామిలీ స్టార్ సినిమాకు నెగెటివ్ ట్వీట్స్, కామెంట్స్ దర్శనం ఇచ్చాయి. ఇక బాక్సాఫీస్ వద్ద కూడా పెద్దగా రాణించలేకపోయింది ఫ్యామిలీ స్టార్. సిద్ధు జొన్నలగడ్డ సినిమా టిల్లు స్క్వేర్ అప్పటికే థియేటర్లలో సందడి చేస్తుండటంతో ప్రేక్షకులు టిల్లుగాడివైపే మొగ్గు చూపారు.
తొలి ప్లాప్
మొదటి రెండు రోజులు ఫ్యామిలీ స్టార్ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చినప్పటికీ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు సినిమా నచ్చొచ్చేమో కానీ, మాస్ ప్రేక్షకులకు మాత్రం మింగుడు పడదు అని రివ్యూల్లో చెప్పారు. అంతేకాకుండా హిట్ ట్రాక్‌లో ఉన్న మృణాల్ ఠాకూర్‌కు విజయ్ దేవరకొండ తన సినిమాతో తెలుగులో తొలి ప్లాప్ అందించాడని నెట్టింట్లో సెటైర్లు కూడా వేశారు.
నెల రోజుల తర్వాతే
ఇలా ఎన్నో విమర్శలు మధ్య రన్ అవుతోన్న ఫ్యామిలీ స్టార్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేయనుంది. అయితే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు నెల తర్వాతే ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఫ్యామిలీ స్టార్ ఓటీటీ హక్కులను భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిందని సమాచారం.
మేలో 2 తేదీలు
అమెజాన్ ప్రైమ్‌లో ఫ్యామిలీ స్టార్ సినిమాను మే 6 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు టాక్. మే 3 నుంచే స్ట్రీమింగ్ చేయనున్నారని మరో టాక్ కూడా వినిపిస్తోంది. అది కూడా తెలుగు అండ్ తమిళ భాషల్లో ఓటీటీలోకి వదలనున్నారట. అయితే, ఈ సినిమాను ముందు రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ చేయనున్నారని ట్విటర్ వేదికగా పోస్టులు వెలువడుతున్నాయి.
100 చెల్లించి
దాదాపుగా రూ. 100 లేదా రూ. 120 చెల్లించి అమెజాన్ ప్రైమ్‌లో ఫ్యామిలీ స్టార్‌ను వీక్షించేలా ఓటీటీ సంస్థ అందుబాటులోకి తీసుకురానుందట. థియేటర్లలో చూసేందుకు ఇష్టపడని ఓటీటీ లవర్స్‌కు ఫ్యామిలీ స్టార్ రెంటల్ విధానం పెద్ద సమస్యే అని చెప్పుకోవచ్చు. ఇలా రెంట్ విధానంలో సినిమాను స్ట్రీమింగ్ చేస్తే తెలుగు ప్రేక్షకులు చూసేందుకు ఇష్టపడకపోవచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఫ్రీ స్ట్రీమింగ్?
అయితే, ఫ్యామిలీ స్టార్ రెంటల్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఇప్పటికీ అయితే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి నిజంగానే రెంటల్ విధానంలో రిలీజ్ చేస్తారో లేదా ఫ్రీగానే ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తారో చూడాలి. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్ ఓటీటీకి సంబంధించిన వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్
గీత గోవిందం సినిమా తర్వాత విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ సైతం నటించారు. వారిలో యూట్యూబ్ సిరీసులతో పాపులర్ అయిన వర్ష డిసౌజ ఒకరు. ఇక సీతారామం, హాయ్ నాన్న సినిమాల తర్వాత మృణాల్ ఠాకూర్ చేసిన మూడో సినిమా ఇది.
టాపిక్