Vijay 69 Movie: స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో విజయ్ 69 - డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజవుతోన్న బాలీవుడ్ మూవీ
01 March 2024, 11:36 IST
Vijay 69 Movie: స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న బాలీవుడ్ మూవీ విజయ్ 69 నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ
బాలీవుడ్ మూవీ విజయ్ 69
69 ఏళ్ల వయసులో కఠినమైన ట్రయథ్లాన్ గేమ్స్‌లో పాల్గొని విజయం సాధించిన విజయ్ అనే వ్యక్తి కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. విజయ్ 69 మూవీకి బాలీవుడ్ డైరెక్టర్ మనీష్ శర్మ నిర్మిస్తున్నారు. అక్షయ్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ విజయ్ 69 మూవీని నిర్మిస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఫస్ట్ ఓటీటీ మూవీ ఇదే కావడం గమనార్హం.
నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్...
విజయ్ 69 మూవీ థియేటర్లను కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. తపన, పట్టుదల ఉంటే ఆటలోనే కాదు జీవితంలో గెలవవచ్చునని నిరూపించే 69 ఏళ్ల వృద్ధుడి కథతో విజయ్ 69 మూవీ సాగుతుంది. ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా ప్రతి ఒక్కరిని అలరిస్తుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. మార్చి నెలాఖరున విజయ్ 69 మూవీ ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో విజయ్ 69 మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.
టాప్ టెన్‌లో ఒకటి....
విజయ్ 69 మూవీలో ట్రయథ్లాన్ అథ్లెట్‌గా ఛాలెంజింగ్ రోల్‌లో అనుపమ్ ఖేర్ కనిపించబోతున్నాడు. ఈ సినిమా గురించి అనుపమ్ ఖేర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నటుడిగా తాను ఇప్పటివరకు 540కిపైగా సినిమాలు చేశాననని, వాటిలో టాప్ టెన్ బెస్ట్ సినిమాల్లో ఒకటిగా తప్పకుండా విజయ్ 69 మూవీ ఉంటుందని అన్నాడు. ఈ సినిమా కోసమే సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి క్రీడల్లో అనుపమ్ ఖేర్ శిక్షణ తీసుకున్నాడు. విజయ్ 69 మూవీలో చుంకీ పాండే ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
కార్తికేయతో తెలుగులోకి ఎంట్రీ...
బాలీవుడ్‌లో బిజీగా ఉన్న అనుపమ్ ఖేర్ సౌత్‌పై ఫోకస్ పెడుతోన్నాడు. నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 మూవీతో తెలుగులోకి అరంగేట్రం చేశాడు. డివోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రవితేజ టైగర్ నాగేశ్వరరావులో అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషించాడు. నిఖిల్ హీరోగా రామ్‌చరణ్ ప్రొడ్యూస్ చేస్తోన్న ది ఇండియా హౌజ్‌లో ఫ్రీడమ్ ఫైటర్ శ్యామ్ జీ కృష్ణ వర్మ పాత్రలో అనుపమ్ ఖేర్ కనిపించబోతున్నాడు.
బాలీవుడ్‌లో నాలుగు సినిమాలు చేస్తున్నాడు అనుపమ్ ఖేర్. కాగజ్, బడే మియా ఛోటే మియాతో పాటు మరో రెండు సినిమాల్లో భారీ బడ్జెట్ సినిమాల్లో డిఫరెంట్స్ రోల్స్‌లో కనిపించబోతున్నాడు. కన్నడంలో శివరాజ్‌కుమార్‌తో ఘోస్ట్ సినిమా చేశాడు అనుపమ్ ఖేర్.