తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Venky 75 : వెంకీ మామ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్.. 75వ సినిమాపై బిగ్ అప్డేట్

Venky 75 : వెంకీ మామ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్.. 75వ సినిమాపై బిగ్ అప్డేట్

Anand Sai HT Telugu

23 January 2023, 12:07 IST

    • Venkatesh 75th Movie Update : విక్టరీ వెంకటేశ్ తదుపరి సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 75వ సినిమా కావడంతో వెంకటేశ్ సైతం రాబోయే చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు. అయితే తాజాగా వెంకీ 75వ సినిమా గురించి బిగ్ అప్ డేట్ వచ్చింది. ఇంతకీ దర్శకుడు ఎవరంటే..
విక్టరీ వెంకటేశ్ 75వ సినిమా
విక్టరీ వెంకటేశ్ 75వ సినిమా (twitter)

విక్టరీ వెంకటేశ్ 75వ సినిమా

వెంకటేశ్ ఫ్యాన్స్(Venkatesh Fans) ఎప్పటి నుంచో తమ అభిమాన హీరో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. 75వ సినిమా కావడంతో భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి. ఎఫ్‌ 3(F3) సినిమా తర్వాత వెంకటేశ్ లీడ్ రోల్‌లో చేయబోయే ప్రాజెక్టు గురించి చర్చ నడుస్తోంది. దీనిపై తాజాగా అప్డేడ్ వచ్చింది. వెంకటేశ్ హీరోగా రానున్న తర్వాతి చిత్రం శైలేశ్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వం వహించనున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Kareena Kapoor Toxic: యశ్ టాక్సిక్ నుంచి తప్పుకున్న కరీనా కపూర్.. కారణం అదేనా?

Bharti Singh Hospitalised: హాస్పిటల్లో చేరిన ప్రముఖ కమెడియన్.. కంటతడి పెడుతూ వీడియో

Salaar TRP: ప్రభాస్ సలార్ మూవీకి టీవీలో దారుణమైన టీఆర్పీ.. ఆ రెండు సినిమాల కంటే తక్కువే.. కారణం ఇదేనా?

Kamal Haasan Linguswamy: కమల్ హాసన్ మోసం చేశాడు: నిర్మాతల మండలికి డైరెక్టర్ ఫిర్యాదు

నిహారిక ఎంటర్టైన్ మెంట్(Niharika Entertainment)పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వెంకటేశ్ తో చెయబోయే.. ప్రొడక్షన్ నెంబర్ 2 ప్రతిష్ఠాత్మకమైనదని నిహారిక ఎంటర్టైన్ మెంట్ ప్రకటించింది. జనవరి 25న ఈ సినిమాకు సంబంధించి.. మరో ప్రకటన రానుంది. దీనికోసం ఫ్యాన్స్ చూస్తున్నారు.

కిందడి ఏడాది విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా(ori devuda) చిత్రంలో వెంకటేశ్ కీలకపాత్రలో కనిపించాడు. ఎఫ్ 3 సినిమా తర్వాత వెంకీ లీడ్ రోల్ లో చేయబోయే సినిమా శైలేశ్ కొలనుతో చేస్తున్నాడు. ఇప్పటికే ఫిలింనగర్లో ఈ సినిమా గురించి చర్చ నడుస్తోంది. వెంకటేశ్ 75వ సినిమా(Venkatesh 75h Movie) కావడంతో అన్ని సెట్ చేసుకుని హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఓ వైపు ఫ్యామిలీ ఆడియేన్స్ కూడా వెంకీమామ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

శ్యామ్‌ సింగరాయ్‌ తర్వాత ప్రొడక్షన్‌ నంబర్‌ 2గా వెంకటేశ్ తో రాబోతున్న కొత్త సినిమాను నిహారిక ఎంటర్టైన్ మెంట్ నిర్మిస్తోంది. ఈ మేరకు అఫీషియల్ ఖాతాలో ట్వీట్ కూడా చేసింది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వివరాలను తర్వాత ప్రకటిస్తామని ఇటీవలే ప్రకటించింది. అయితే తాజాగా దర్శకుడి పేరుతోపాటుగా అసలు అనౌన్స్ మెంట్ జనవరి 25న అని తెలిపింది.

హిట్‌ సినిమా డైరెక్టర్‌ శైలేశ్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కేజీఎఫ్‌ ఫేం శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్‌గా మెరవబోతుందని టాక్ నడుస్తోంది. వెంకటేశ్ ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌ సినిమాలో కీ రోల్‌ ను చేస్తున్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.