Spy Thriller OTT: దేవర రిలీజ్ రోజే ఓటీటీలోకి వచ్చిన జాన్వీకపూర్ బాలీవుడ్ స్పై థ్రిల్లర్ సినిమా
27 September 2024, 11:46 IST
Spy Thriller OTT: జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ స్పై థ్రిల్లర్ మూవీ ఉలజ్ శుక్రవారం ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఉలజ్ మూవీలో గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.
స్పై థ్రిల్లర్ ఓటీటీ
Spy Thriller OTT: దేవర మూవీ రిలీజ్ రోజే జాన్వీకపూర్ బాలీవుడ్ మూవీ ఉలజ్ ఓటీటీలోకి వచ్చింది. స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం హిందీ వెర్షన్‌ను మాత్రమే రిలీజ్ చేశారు.
థియేటర్లలో డిజాస్టర్...
ఉలజ్ మూవీకి సుదాన్షు సారియా దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో జాన్వీకపూర్‌తో పాటు గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ, ఆదిల్ హుస్సేన్ కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది ఆగస్ట్ 2న ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్‌కు ముందు టీజర్స్, ట్రైలర్స్‌తో బాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఉలజ్ డిజాస్టర్‌గా మిగిలింది.
సినిమా బడ్జెట్‌లో సగం కూడా రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద చతికిలాపడింది. దాదాపు 35 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 10 కోట్ల వరకు మాత్రమే వసూళ్లను దక్కించుకున్నది. నిర్మాతలకు ఇరవై ఐదు కోట్లకుపైగా నష్టాలను మిగిల్చింది.
సినిమాపై విమర్శలు...
ఉలజ్ కాన్సెప్ట్‌తో పాటు దర్శకుడు సుధాన్షు మేకింగ్‌పై దారుణంగా విమర్శలొచ్చాయి. స్పై డ్రామాను థ్రిల్లింగ్‌గా తెరపై ఆవిష్కరించడంతో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. ఏ పాత్ర ఎప్పుడొస్తుంది, ఆసలు స్క్రీన్‌పై ఏం జరుగుతుందని అన్నది అర్థం కాకుండా ఉలజ్ మూవీ ఉందంటూ క్రిటిక్స్ పేర్కొన్నారు.
ఉలజ్ కథ ఇదే...
వనరాజ్‌కు(ఆదిల్ హుస్సేన్) ఐక్యరాజ్యసమితితో పర్మినెంట్ మెంబర్‌గా నియమితుడవుతాడు. విదేశీ వ్యవహారాల్లో అతడికి ఎంతో గొప్ప పేరు ఉంటుంది. వన్‌రాజ్ కూతురు సుహానా (జాన్వీకపూర్) ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఎగ్జామ్ పాసవుతుంది. యూకేలో ఇండియన్ హై కమీషనర్‌గా జాబ్‌లో చేరుతుంది. తండ్రి రిఫరెన్స్‌తోనే సుహానాకు జాబ్ వచ్చిందని ఆమె టీమ్‌లో పనిచేసే సెబీన్ కుట్టీ (రోషన్ మాథ్యూ), జాకబ్ తమాంగ్ ఆమెను అపార్థం చేసుకుంటారు.
మారుపేరుతో మంచివాడిగా సుహానాకు దగ్గరైన నకుల్ (గుల్షన్ దేవయ్య)...దేశ రహస్యలను తనకు చేరవేయాల్సిందిగా ఓ వీడియో చూపించి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెడతాడు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? సుహానా తండ్రి పేరు ప్రతిష్టలకు భంగం కలిగే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? నకుల్‌ను ఎదురించి సుహానా ఎలా పోరాడింది అన్నదే ఈ మూవీ కథ.
దేవర మూవీ...
జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించిన తెలుగు మూవీ దేవర శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీతోనే జాన్వీకపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తంగం అనే క్యారెక్టర్‌లో జాన్వీ కనిపించింది. దేవరతో జాన్వీకపూర్ క్యారెక్టర్ లెంగ్త్ తక్కువే అయినా పాటల్లో ఎన్టీఆర్‌తో ఆమె కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంటోంది.
దేవర తర్వాత రామ్‌చరణ్‌తో ఓ మూవీ చేయనుంది జాన్వీ. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీకి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తోన్నాడు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.