Rc 16 Casting: రామ్‌చరణ్, బుచ్చిబాబు మూవీలో మలయాళం హీరో - యాక్షన్ ధమాకా పక్కా!
Rc 16 Casting: రామ్‌చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూవీలో మలయాళ హీరో ఆంటోనీ వర్గీస్ కీలక పాత్ర పోషిస్తోన్నట్లు సమాచారం. ఆంటోనీ వర్గీస్ హీరోగా నటించిన మలయాళ మూవీ ఆర్‌డీఎక్స్ గత ఏడాది బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
Rc 16 Casting: రామ్‌చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కలయికలో తెరకెక్కతోన్న కొత్త సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. స్పోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో రా అండ్ రిస్ఠిక్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో కన్నడ, తమిళ భాషలకు చెందిన స్టార్ హీరోలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆంటోనీ వర్గీస్...
తాజాగా ఓ మలయాళ నటుడు ఈ సినిమాలో భాగమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్‌డీఎక్స్ ఫేమ్ ఆంటోనీ వర్గీస్ ఆర్‌సీ 16లో ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది రిలీజైన ఆర్‌డీఎక్స్ మూవీలో మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్న యువకుడిగా ఆంటోనీ వర్గీస్ యాక్టింగ్, అతడిపై తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఎనిమిది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఆర్‌డీఎస్ మూవీ 80 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. గత ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
అంగమలై డైరీస్...
ఆంగమలై డైరీస్ ద్వారా మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆంటోనీ వర్గీస్. స్వాతంత్య్రం అర్థరాత్రియాల్, జల్లికట్లుతో పాటు పలు సినిమాల్లో హీరోగా, యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలు చేశాడు.
ఆర్‌సీ 16లో ఆంటోనీ వర్గీస్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన యాక్షన్ ఒరియెంటెడ్ రోల్‌లోనే ఆంటోనీ వర్గీస్ కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్‌సీ 16లో కన్నడ అగ్ర హీరో శివరాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అతడితో పాటు తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ చేయనున్నట్లు సమాచారం. పర్‌ఫెక్ట్ పాన్ ఇండియన్ మూవీగా ఆర్‌సీ 16ను తెరకెక్కించేందుకు డైరెక్టర్ బుచ్చిబాబు సానా ప్రయత్నాలు చేస్తోన్నారు.
జాన్వీకపూర్ హీరోయిన్...
రామ్‌చరణ్, బుచ్చిబాబు మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. దేవర తర్వాత తెలుగులో ఆమె హీరోయిన్‌గా నటిస్తోన్న సెకండ్ మూవీ ఇది. ఆర్‌సీ 16 పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. ప్రారంభోత్సవ వేడుకకు చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రజెంట్స్‌లో దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో వెంకట సతీష్ కిలారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. రామ్‌చరణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా ఆర్‌సీ 16 రూపుదిద్దుకోనున్నట్లు చెబుతున్నారు.
ఉప్పెనతో నేషనల్ అవార్డ్...
బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఉప్పెనతోనే దర్శకుడిగా బుచ్చిబాబు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. జాతీయ అవార్డుల్లో బెస్ట్ తెలుగు మూవీగా ఉప్పెన నిలిచింది. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు సానా చేస్తోన్న సినిమా కావడంతో ఆర్‌సీ 16పై మెగా అభిమానులతో పాటు టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
గేమ్ ఛేంజర్ మూవీ...
ప్రస్తుతం అగ్ర దర్శకుడు శంకర్‌తో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తోన్నాడు రామ్‌చరణ్. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ సినిమా డిసెంబర్‌లో రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్ పూర్తికాకముందే గేమ్ ఛేంజర్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నది. ఓటీటీ హక్కుల వంద కోట్లకుపైనే అమ్ముడుపోయినట్లు తెలిసింది. గేమ్ ఛేంజర్‌లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. 200 కోట్ల బడ్జెట్‌తో దిల్‌రాజు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.