Yuvraj Singh: వ‌ద్ద‌న్నా విన‌కుండా న‌న్నే ఫాలో అయ్యింది - బాలీవుడ్ హీరోయిన్‌తో డేటింగ్‌పై యువ‌రాజ్ సింగ్ కామెంట్స్‌-i was dating an actress but i wont reveal her name yuvraj singh interesting comments on his past love story ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Yuvraj Singh: వ‌ద్ద‌న్నా విన‌కుండా న‌న్నే ఫాలో అయ్యింది - బాలీవుడ్ హీరోయిన్‌తో డేటింగ్‌పై యువ‌రాజ్ సింగ్ కామెంట్స్‌

Yuvraj Singh: వ‌ద్ద‌న్నా విన‌కుండా న‌న్నే ఫాలో అయ్యింది - బాలీవుడ్ హీరోయిన్‌తో డేటింగ్‌పై యువ‌రాజ్ సింగ్ కామెంట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Sep 26, 2024 02:07 PM IST

Yuvraj Singh: ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో కొన్నాళ్లు తాను డేటింగ్‌లో ఉన్న‌ట్లు యువ‌రాజ్ సింగ్ చెప్పాడు. తాను ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గా షూటింగ్ నిమిత్తం అక్క‌డ‌కు వ‌చ్చిన ఆ హీరోయిన్ త‌న‌ను క‌లిసిన‌ట్లు యువ‌రాజ్ సింగ్ తెలిపింది. ఆమెతో ఒక రోజంతా గ‌డ‌పాల్సివ‌చ్చింద‌ని యువ‌రాజ్‌సింగ్ అన్నాడు.

యువ‌రాజ్ సింగ్
యువ‌రాజ్ సింగ్

Yuvraj Singh: గ‌తంలో ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో డేటింగ్‌పై టీమిండియా మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. ఆ డేటింగ్ గురించి అప్ప‌టి టీమ్‌మేట్స్‌కు కూడా తెలుసున‌ని, వారంతా త‌న‌ను ఓ సంద‌ర్భంలో ఆట‌ప‌ట్టించార‌ని యువ‌రాజ్ సింగ్ అన్నాడు. టీమిండియాలో దిగ్గ‌జ ఆల్‌రౌండ‌ర్ల‌లో ఒక‌రిగా పేరుతెచ్చుకున్నాడు యువ‌రాజ్ సింగ్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌తో టీమిండియాకు ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాల్ని అందించాడు.

భార‌త జ‌ట్టు కెప్టెన్సీ రేసులోకి వ‌చ్చాడు. అయితే క్యాన్స‌ర్ అత‌డి కెరీర్‌ను దెబ్బ‌తీసింది. క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి జ‌యించి తిరిగి టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చినా మునుప‌టి స్థాయిలో రాణించ‌లేక‌పోయాడు. జ‌ట్టులో నుంచి ఉద్వాస‌న‌కు గుర‌య్యాడు. అనూహ్యంగా క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు.

బాలీవుడ్ హీరోయిన్‌తో డేటింగ్‌...

త‌న కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడు జ‌రిగిన‌ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని గురించి ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు యువ‌రాజ్‌. ఓ బాలీవుడ్ న‌టితో డేటింగ్ గురించి అత‌డు చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి. ఆ హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది మాత్రం త‌న ఇంటర్వ్యూలో యువ‌రాజ్ సింగ్ రివీల్ చేయ‌లేదు. 2007-08 టైమ్‌లో నేను ఆస్ట్రేలియా సిరీస్‌తో బిజీగా ఉన్నాన‌ని, అప్పుడే త‌న‌తో డేటింగ్‌లో ఉన్న హీరోయిన్ ఓ షూటింగ్ నిమిత్తం ఆస్త్రేలియాకు వ‌చ్చింద‌ని యువ‌రాజ్ సింగ్ ఈ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు.

"నేను కాన్‌బెర్రాలో ఉండ‌గా ఆమె అడిలైడ్‌లో ఉంది. ఆ టైమ్‌లో ఆమె నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తే గేమ్‌పై ఫోక‌స్ పెట్ట‌లేన‌నిపించింది. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ అంటే ఆషామాషీ కాద‌ని నా వ‌ద్ద‌ర‌కు రావ‌ద్ద‌ని ఆమెకు చెప్పా. కానీ నా మాట‌లు ప‌ట్టించుకోకుండా మా బ‌స్‌ను ఫాలో అవుతూ కాన్‌బెర్రాకు వ‌చ్చింది.

నీతో టైమ్ స్పెండ్ చేయ‌డానికే కాన్‌బెర్రాకు వ‌చ్చాన‌ని చెప్పింది. ఆరోజు రాత్రి ఆమెతోనే ఉండిపోయాను. ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. ఆ రాత్రి చాలా అందంగా గ‌డిచిపోయింది. ఆ త‌ర్వాత సినీ కెరీర్‌పై దృష్టిపెట్ట‌మ‌ని ఆమెకు స‌ల‌హా ఇచ్చాన‌ని యువ‌రాజ్ సింగ్" అన్నాడు.

పింక్ స్లిప్ప‌ర్స్‌...

“అంత‌కుముందు జ‌రిగిన రెండు టెస్ట్‌లో నేను ఎక్కువ‌గా ప‌రుగులు చేయ‌లేక‌పోవ‌డంతో నా ఆటపై దృష్టిపెట్టాల‌నుకుంటున్న విష‌యాన్ని ఆమెతో చెప్పా. తాను అందుకు ఒప్పుకుంది. ఆ త‌ర్వాత నా ల‌గేజీ ప్యాక్ చేసింది. షూస్ కూడా సూట్‌కేస్‌లోనే పెట్ట‌డంతో ఆమె పింక్ ప్లిప్ప‌ర్స్ వేసుకొని టీమ్ ఇండియా బ‌స్ ఎక్కాన‌ని"యువ‌రాజ్ సింగ్” చెప్పాడు.

బ్యాగ్ అడ్డుపెట్టుకున్నా కానీ...

“నా స్లిప్స‌ర్స్ టీమ్‌మేట్స్ ఎవ‌రికి క‌నిపించ‌కుండా బ్యాగ్‌ అడ్డం పెట్టుకున్నా. కానీ కొంద‌రు టీమ్‌మేట్స్ నేను వేసుకున్న స్లిప్స‌ర్స్ చూసి ఆట‌ప‌ట్టించారు. ఎయిర్‌పోర్ట్ వ‌ర‌కు ఆ హీరోయిన్ పింక్ స్లిప్స‌ర్స్‌తోనే ప్ర‌యాణించాం. ఆ త‌ర్వాత కొత్త‌వి కొనుక్కున్నాను” అని యువ‌రాజ్ సింగ్ తెలిపాడు.

ఆ హీరోయిన్ ఎవ‌రంటే...

ఆ హీరోయిన్ పేరు మాత్రం ఇంట‌ర్వ్యూలో యువ‌రాజ్ సింగ్ రివీల్ చేయ‌లేదు. ఆమె పేరు చెప్ప‌డం నాకు ఇష్టం లేదంటూ కామెంట్స్ చేశాడు. ఆ హీరోయిన్ ఇప్పుడు టాప్ స్టార్‌గా ఉంద‌ని, బాలీవుడ్‌లో సీనియ‌ర్ క‌థానాయిక‌గా కొన‌సాగుతుంద‌ని చెప్పాడు. కొంద‌రు నెటిజ‌న్లు మాత్రం యువ‌రాజ్ సింగ్ డేటింగ్ చేసిన హీరోయిన్ దీపికా ప‌దుకోణ్ అంటూ కామెంట్స్ చేస్తోన్నారు. గ‌తంలో యువ‌రాసింగ్‌, దీపికా డేటింగ్ చేసిన‌ట్లు పుకార్లు షికారు చేశాయి.

టాపిక్