Marais Erasmus: ఇకపై ఈ లెజెండరీ అంపైర్ కనిపించడు - రిటైర్‌మెంట్ ప్రకటించిన మరైస్ ఎరాస్మస్
Marais Erasmus: లెజెండరీ అంపైర్ మరైస్ ఎరాస్మస్ తన కెరీర్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరుగనున్న ఫస్ట్ టెస్ట్‌తో తన చివరి టెస్ట్ మ్యాచ్ అని ఎరాస్మస్ ప్రకటించాడు.
Marais Erasmus: సుదీర్ఘ అంపైరింగ్ కెరీర్‌కు మరైస్ ఎరాస్మస్ గుడ్‌బై చెప్పాడు. వెల్లింగ్‌టన్ వేదికగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరుగనున్న తొలి టెస్ట్‌తో ఇంటర్‌నేషనల్ క్రికెట్‌కు ఈ లెజెండరీ అంపైర్ గుడ్‌బై చెప్పబోతున్నాడు. ఐసీసీ అంపైర్స్ ఎలైట్ ప్యానల్ కేటగిరీలో 12 మంది అంపైర్స్ మాత్రమే చోటు దక్కించుకున్నారు. వారిలో ఎరాస్మస్ ఒకరు.
2006 సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఎరాస్మస్ అంపైరింగ్ కెరీర్ ప్రారంభమైంది. 2007లో కెన్యా, కెనడా మధ్య జరిగిన మ్యాచ్ ద్వారా అంపైర్‌గా వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 80 టెస్టులు, 124 వన్డేలతో పాటు 43 టీ20 మ్యాచ్‌లకు అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు ఎరాస్మస్. 18 ఉమెన్స్ టీ20 మ్యాచ్‌లకు అంపైర్‌గా కొనసాగాడు.తన రిటైర్ మెంట్ గురించి గత ఏడాది అక్టోబర్‌లోనే ఎరాస్మస్ ప్రకటించాడు.
రిటైర్‌మెంట్ తర్వాత కొత్తగా అంపైరింగ్ బాధ్యతల్ని చేపట్టే వారికి ఓ మెంటర్‌గా ఎరాస్మస్ పనిచేయబోతున్నట్లు సమాచారం. అంతే కాకుండా సౌతాఫ్రికా డొమెస్టిక్ క్రికెట్‌కు అంపైరింగ్ బాధ్యతల్ని అందించబోతున్నట్లు సమాచారం.
మూడు సార్లు ఐసీసీ అంపైర్ అవార్డు...
2016తో పాటు 2017 లలో వరుసగా రెండేళ్లు ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు మరైస్ ఎరాస్మస్. 2021లో మరోసారి ఈ అవార్డును దక్కించుకొని రికార్డ్ క్రియేట్ చేశాడు. 2023 నుంచి వరల్డ్ కప్‌లో పలు మ్యాచ్‌లకు ఎరాస్మస్ అంపైరింగ్ చేశాడు.
తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో వివాదాస్పద నిర్ణయాలతో పలుమార్లు వార్తల్లో నిలిచాడు ఎరాస్మస్. 2023 వరల్డ్ కప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ప్లేయర్ ఎంజలో మాథ్యూస్‌ను టైమ్‌డ్ అవుట్‌గా ఎరాస్మస్ ప్రకటించాడు. టైమ్‌డ్ ఔట్ విధానంలో ఔటైన ఫస్ట్ క్రికెటర్‌గా మాథ్యూస్ నిలిచాడు. ఎరాస్మస్ నిర్ణయంపై శ్రీలంక క్రికెట్ ఫ్యాన్స్ విమర్శలు గుప్పించారు. యాషెస్ సిరీస్‌లో బెయిర్‌స్టో రనౌట్ నిర్ణయం కూడ ఎరాస్మస్ పై ట్రోలింగ్‌కు కారణమైంది. ఎరాస్మస్ అంపైరింగ్‌కు పనికిరాడంటూ అప్పట్లో ఇంగ్లండ్ క్రికెట్ ఫ్యాన్స్ అతడిని దారుణంగా ట్రోల్ చేశారు.
ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌గా...
సౌతాఫ్రికాలో పుట్టిన ఎరాస్మస్ అంపైర్ కాకముందు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా రాణించాడు. 53 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఎరాస్మస్ 29 యావరేజ్‌తో 1913 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఏడో స్థానంలో బ్యాటింగ్ దిగి సెంచరీ చేశాడు. బౌలర్‌గా ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 131 వికెట్లు తీసుకున్నాడు.