ICC Test Team of The Year 2023: ఐసీసీ ‘టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్’ ఇదే.. భారత్ నుంచి ఇద్దరే
ICC Test Team of The Year 2023: ‘టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్’ను ఐసీసీ వెల్లడించింది. ఈ జట్టులో ఇద్దరు భారత ప్లేయర్లు ఉన్నారు. అయితే, స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఈ టీమ్‍లో చోటు దక్కలేదు.
ICC Test Team of The Year: ప్రతీ సంవత్సరం జనవరిలో అంతకు ముందు ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో వివిధ ఫార్మాట్లలో బెస్ట్ ‘టీమ్ ఆఫ్ ది ఇయర్’ను ఐసీసీ ప్రకటిస్తుంటుంది. ఈసారి కూడా అదే ఫాలో అయింది. 2023కు గాను ‘టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్’ను ప్రకటించింది. 2023 సంవత్సరంలో టెస్టు ఫార్మాట్‍లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వివిధ దేశాల ఆటగాళ్లతో ఈ జట్టును ఎంపిక చేసింది. ఈ టీమ్‍లో భారత్ నుంచి ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. అయితే, స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ టీమ్‍లో లేరు.
‘టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్’లో టీమిండియా నుంచి స్టార్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్‍ల్లో అశ్విన్ టాప్‍లో ఉన్నాడు. గతేడాది ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‍లో 25 వికెట్లతో అదరగొట్టాడు అశ్విన్. మరోవైపు, వెస్టిండీస్‍తో టెస్టు సిరీస్ సహా డబ్ల్యూటీసీ ఫైనల్‍లో జడేజా రాణించాడు. దీంతో ఐసీసీ వీరిద్దరినీ పరిగణనలోకి తీసుకుంది.
‘టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్’కు కెప్టెన్‍గా ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్‌ను ఐసీసీ తీసుకుంది. 2023 వరల్డ్ టెస్ట్ చాంపియన్‍షిప్ టైటిల్‍ను కమిన్స్ సారథ్యంలోని ఆసీస్ దక్కించుకుంది. దీంతో అతడిని కెప్టెన్ చేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్‍లో సెంచరీ చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా ఈ టీమ్‍లో ఉన్నాడు. ఆసీస్ నుంచి ఉస్మాన్ ఖవాజా, వికెట్ కీపర్ అలెక్స్ కెరీ, పేసర్ మిచెల్ స్టార్క్ ఈ జట్టులో ఉన్నారు. దీంతో మొత్తంగా ‘టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్’లో ఏకంగా నలుగురు ఆస్ట్రేలియా ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు.
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ కూడా ఈ టీమ్‍లో ఉన్నారు. శ్రీలంక ప్లేయర్ దిముత్ కరుణ్ రత్నే కూడా ఉన్నాడు. ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ బ్రాడ్ కూడా ఈ టీమ్‍లో చోటు దక్కించుకున్నాడు.
ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023: ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా), దిముత్ కరుణ్ రత్నె (శ్రీలంక), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), జో రూట్ (ఇంగ్లండ్), ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా), రవీంద్ర జడేజా (ఇండియా), అలెక్స్ కెేరీ (ఆస్ట్రేలియా), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్, ఆస్ట్రేలియా), అశ్విన్ (ఇండియా), మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్)
వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023: రోహిత్ శర్మ (ఇండియా, కెప్టెన్), శుభ్‍మన్ గిల్ (ఇండియా), ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా), విరాట్ కోహ్లీ (ఇండియా), డారిల్ మిచెల్ (న్యూజిలాండ్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్, సౌతాఫ్రికా), మార్కో జాన్సెన్ (సౌతాఫ్రికా), ఆడం జంపా (ఆస్ట్రేలియా), మహమ్మద్ సిరాజ్ (ఇండియా), కుల్దీప్ యాదవ్ (ఇండియా), మహమ్మద్ షమీ (ఇండియా)
టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023: సూర్యకుమార్ యాదవ్ (ఇండియా, కెప్టెన్), యశస్వి జైస్వాల్ (ఇండియా), ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్), నికోలస్ పూరన్ (వెస్టిండీస్), మార్క్ చాంప్‍మన్ (న్యూజిలాండ్), సికిందర్ రజా (జింబాబ్వే), అల్పేశ్ రాంజానీ (ఉగాండ), మార్క్ అడైర్ (ఐర్లాండ్), రవి బిష్ణోయ్ (ఇండియా), రిచర్డ్ గవారా (జింబాబ్వే), అర్షదీప్ సింగ్ (ఇండియా)
సంబంధిత కథనం