Balakrishna: నలభై ఏళ్ల కెరీర్‌లో బాలకృష్ణ గెస్ట్ రోల్‌లో నటించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?
Balakrishna:నలభై ఏళ్ల సినీ కెరీర్‌లో బాలకృష్ణ తెలుగులో ఇప్పటివరకు కేవలం ఒకే ఒక సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు. ఆ సినిమాలో బాలకృష్ణతో పాటు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కూడా నటించారు. ఆ సినిమా ఏదంటే?

Balakrishna: ఓ స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో గెస్ట్‌గా తళుక్కున మెరిస్తే ఓ కిక్కే వేరుగా ఉంటుంది. ఓ చిన్న సినిమాలో స్టార్ హీరో గెస్ట్‌గా కనిపిస్తే ఆ మూవీ ప్రమోషన్‌కు అదే పెద్ద ఆయుధం అవుతుంది. నిమిషాల నిడివిలో కనిపించే గెస్ట్ రోల్స్ కొన్ని సార్లు సినిమాల జాతకాన్ని మారుస్తుంటాయి. ఆయా బ్లాక్‌బస్టర్స్‌గా మలుస్తుంటాయి. అందుకే ఈ గెస్ట్ రోల్ ట్రెండ్ మొదలై చాలా కాలమైన ఇప్పటికి దీనికున్న క్రేజ్ తగ్గలేదు సరికదా నానాటికి పెరుగుతూనే వస్తోంది. చిరంజీవి, రజనీకాంత్, నాగార్జున మొదలుకొని ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ వరకు అగ్ర హీరోలందరూ అడపాదడపా ఇతర హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేశారు.
చిరంజీవి పదిహేను సినిమాల్లో...
చిరంజీవి తన కెరీర్‌లో పదిహేనుకుపైగా సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేశాడు. నాగార్జున 20కిపైగా సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిశారు. వెంకటేష్ కూడా తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో గెస్ట్‌గా కనిపించి అభిమానులను అలరించారు.
త్రిమూర్తులు...
బాలకృష్ణ మాత్రం తెలుగులో ఇప్పటివరకు కేవలం ఒకే ఒక సినిమాలో మాత్రమే గెస్ట్ రోల్ చేశాడు. ఆ సినిమా త్రిమూర్తులు. వెంకటేష్, అర్జున్, రాజేంద్రప్రసాద్ హీరోలుగా నటించిన ఈ తెలుగు మూవీ 1987లో రిలీజైంది. హిందీలో విజయవంతమైన నసీబ్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు కే మురళీమోహన్‌రావు దర్శకత్వం వహించాడు.
మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై టి.సుబ్బిరామిరెడ్డి భారీ బడ్జెట్‌తో త్రిమూర్తులు సినిమాను నిర్మించారు. ఈ సినిమాలోని ఓ పాటలో టాలీవుడ్ అగ్ర హీరోలు కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున గెస్ట్‌లుగా నటించారు. వారితో పాటు విజయశాంతి, రాధ, భానుప్రియ, రాధికతో పాటు ఇండస్ట్రీలోని చాలా మందిహీరోలు, హీరోయిన్లు కనిపిస్తారు.
ఒకే ఒక సినిమా...
నలభై ఏళ్ల కెరీర్‌లో బాలకృష్ణ గెస్ట్ పాత్రలో నటించిన ఏకైక మూవీ త్రిమూర్తులు మాత్రమే. అంతే కాకుండా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున కలిసి కనిపించిన ఒకే ఒక మూవీ కూడా త్రిమూర్తులు కావడం గమనార్హం. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్‌ఖేర్ త్రిమూర్తులు మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. స్టార్ హీరోలు గెస్ట్‌రోల్స్ గా కనిపిస్తూ, టాలీవుడ్, బాలీవుడ్ నటులు కలయికలో భారీ అంచనాల నడుమ రిలీజైన త్రిమూర్తులు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది.
జైలర్‌లో గెస్ట్‌రోల్...
త్రిమూర్తులు తర్వాత గెస్ట్ రోల్స్ చేసే అవకాశాలు చాలా వచ్చిన బాలకృష్ణ వాటిని సున్నితంగా తిరస్కరించారు. ఇటీవల విడుదలైన రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ మూవీ జైలర్‌లో గెస్ట్ రోల్ కోసం బాలకృష్ణను సంప్రదించారు డైరెక్టర్ నెల్సన్. కానీ భగవంత్ కేసరితో బిజీగా ఉండటంతో జైలర్ సినిమాను బాలకృష్ణ తిరస్కరించారు.
ఎన్‌బీకే 109తో బిజీ...
గత ఏడాది భగవంత్ కేసరితో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్నాడు బాలకృష్ణ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సోషల్ మెసేజ్‌కు యాక్షన్ అంశాలను మేళవించి రూపొందిన ఈ మూవీ 110 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. భగవంత్ కేసరి సక్సెస్ తర్వాత దర్శకుడు బాబీతో బాలకృష్ణ ఓ మూవీ చేస్తోన్నాడు.
బాలకృష్ణ కెరీర్‌లో 109వ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీడియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ బాలకృష్ణ, బాబీ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది.