Athamma Kitchen: ఫుడ్ బిజినెస్‌లోకి ఉపాసన.. అత్తమ్మ కిచెన్ పేరుతో చిరంజీవి భార్య వంటకాలు-upasana konidela launch athamma kitchen with surekha konidela on her birthday upasana food business ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Athamma Kitchen: ఫుడ్ బిజినెస్‌లోకి ఉపాసన.. అత్తమ్మ కిచెన్ పేరుతో చిరంజీవి భార్య వంటకాలు

Athamma Kitchen: ఫుడ్ బిజినెస్‌లోకి ఉపాసన.. అత్తమ్మ కిచెన్ పేరుతో చిరంజీవి భార్య వంటకాలు

Sanjiv Kumar HT Telugu
Feb 19, 2024 06:02 AM IST

Upasana Konidela Launch Athamma Kitchen: మెగా కోడలు ఉపాసన కొణిదెల కొత్త ఫుడ్ బిజినెస్‌లోకి దిగారు. అత్తమ్మ కిచెన్ పేరుతో మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల వంటకాలను మార్కెట్‌లోకి దించనున్నారు. దీంతో మెగా కోడళ్లు ఇద్దరూ వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు అయింది.

ఫుడ్ బిజినెస్‌లోకి ఉపాసన.. అత్తమ్మ కిచెన్ పేరుతో చిరంజీవి భార్య వంటకాలు
ఫుడ్ బిజినెస్‌లోకి ఉపాసన.. అత్తమ్మ కిచెన్ పేరుతో చిరంజీవి భార్య వంటకాలు

Athamma Kitchen Surekha Konidela: అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన కొణిదెల సరికొత్తగా నిర్వచిస్తున్నారు. అత్తమ్మ వంటకాలను రుచిని అందరికీ తెలిసేలా ఉపాసన చేస్తున్నారు. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించారు ఉపాసన. సురేఖ కొణిదెల పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 18న వీటిని ప్రారంభించి అసలు సిసలైన అత్తా కోడళ్ల బంధాన్ని చాటి చెప్పారు.

అత్తాకోడళ్ల మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవం, సహకారానికి సరైన నిర్వచనం ఇస్తున్నారు ఈ మెగా కోడళ్లు. మెగాస్టార్ చిరంజీవి తనుకున్న బిజీ షెడ్యూల్స్‌‌లోనూ రుచికరమైన భోజనం తినేలా ఎన్నో రకాల వంటకాలను సురేఖ కొణిదెల గారు సిద్ధం చేస్తుండేవారు. కొణిదెల వంటకాలను "అత్తమ్మ కిచెన్" ద్వారా అందరితో పంచుకోవాలని ఉపాసన లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఇంటి నుంచి దూరంగా ఉన్న వ్యక్తులకు ఇంటి భోజనం మిస్ అవుతున్న ఫీలింగ్ రానివ్వకుండా ఈ ‘అత్తమ్మ కిచెన్’ ప్రొడక్ట్స్‌లు వారి కడుపులను నింపనుంది.

ఉపాసన కొణిదెల తన వ్యవస్థాపక నైపుణ్యాలను ఉపయోగించుకుని ఈ అత్తమ్మ కిచెన్ వెంచర్‌ను రూపొందించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ వినూత్న వ్యాపార విధానంతో అత్తగారితో ఉపాసనకున్న అనుబంధం, ఆమెతో పంచుకునే లోతైన బంధం, గౌరవాలను కూడా ప్రకటించేలా ఉంది. సంప్రదాయం, ప్రేమకు చిహ్నంగా "అత్తమ్మ కిచెన్"ని నిలబెట్టాలని ఉపాసన కాంక్షిస్తున్నారు. వ్యవస్థాపక ప్రపంచంలో కుటుంబ బంధాలు, సంప్రదాయాలను కాపాడేందుకు ఉపాసన, సురేఖ కొణిదెల చేస్తున్న ప్రయత్నాలను ప్రతీకగా "అత్తమ్మ కిచెన్" నిలుస్తుంది.

సురేఖ కొణిదెల పుట్టినరోజున వారు ఈ అత్తమ్మ కిచెన్ వెంచర్‌ను ప్రారంభించారు. ఇంట్లో వండిన ఈ భోజనాన్ని, ఒక్కో వంటకం రుచిని అనుభవించమని అందరినీ ఆహ్వానిస్తున్నారు. కాగా ఉపాసన కొణిదెల నేతృత్వంలోని "అత్తమ్మ కిచెన్" ప్రొడక్ట్స్‌లో, కొణిదెల ఇంటి సంప్రదాయ వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ వెంచర్ వారి ప్రత్యేకమైన వంటకాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇంట్లో వండిన ఆహారాన్ని తినాలనుకునే వారికి ప్రియమైన పేరుగా మారాలనే లక్ష్యంతో ఉంది.

ఇదిలా ఉంటే సురేఖ కొణిదెల వంటకాలంటే మెగా కుటుంబంలో అందరికీ స్పెషల్‌గా ఇష్టముంటుంది. చిరంజీవి విదేశాలకు వెళ్లినప్పుడు కూడా సురేఖ చేసిన ఆహారాన్ని వెంట తీసుకుని వెళ్తానని ఇప్పటికీ పలు మార్లు మెగాస్టార్ బయటపెట్టారు. ఇంటి నుంచి దూరంగా ఉన్నా కూడా హోమ్ ఫుడ్ అనేది వారిని దగ్గరగా ఉన్నట్లు అనుభూతి చెందేలా చేస్తుందన్నదే సురేఖ ఫార్ములా. తన వంటకాలలో ఒక ట్రెడిషన్ ఉంటుందని కూడా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంటుంటారు.

ఇప్పటికే అత్తమ్మ కిచెన్ గురించి రామ్ చరణ్ హింట్ ఇచ్చారు. తాజాగా సురేఖ కొణిదెల బర్త్ డే సందర్భంగా అత్తమ్మ కిచెన్ లాంచ్ అయింది. కొణిదెల ఇంట్లో చేసే ఎన్నో వంటకాలను అత్తమ్మ కిచెన్ పేరుతో పులిహోర, రసం, ఉప్మా లాంటివి ఇన్‌స్టంట్‌గా చేసుకోడానికి ఉపయోగపడే ప్రొడక్ట్స్ మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నాయి. కాగా తన భార్య సురేఖ పుట్టినరోజుకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలియజేశారు.

సురేఖకు అందమైన కవిత చెబుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. "నా జీవన రేఖ.. నా సౌభాగ్య రేఖ.. నా భాగస్వామి సురేఖ! నా లైఫ్ లైన్‌ (జీవన రేఖ), నా బలానికి అతిగొప్ప పునాది సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు" అని చిరంజీవి పోస్ట్ చేశారు.

Whats_app_banner