Ntr Devara: దేవ‌ర‌లో ఎన్టీఆర్ కొత్త లుక్ ట్రెండింగ్ - గోవాలో జాన్వీక‌పూర్‌తో డ్యూయెట్‌-devara makesr unveiled ntr new poster and shooting updates janhvi kapoor tollywood news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Devara Makesr Unveiled Ntr New Poster And Shooting Updates Janhvi Kapoor Tollywood News

Ntr Devara: దేవ‌ర‌లో ఎన్టీఆర్ కొత్త లుక్ ట్రెండింగ్ - గోవాలో జాన్వీక‌పూర్‌తో డ్యూయెట్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 22, 2024 11:58 AM IST

Ntr Devara: దేవ‌ర నుంచి కొత్త అప్‌డేట్‌ను మేక‌ర్స్ శుక్ర‌వారం ప్ర‌క‌టించారు. గోవాలో షూటింగ్ జ‌రుగ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఎన్టీఆర్ కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

ఎన్టీఆర్ దేవ‌ర మూవీ
ఎన్టీఆర్ దేవ‌ర మూవీ

Ntr Devara: దేవ‌ర మూవీ నుంచి ఎన్టీఆర్ కొత్త లుక్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు. ఎన్టీఆర్‌ ఫొటోతో పాటు అప్‌డేట్‌ను రివీల్ చేశారు. దేవ‌ర షూటింగ్ గోవాలో జ‌ర‌గ‌నున్న‌ట్లు యూనిట్ ప్ర‌క‌టించింది. ఎన్టీఆర్‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను గోవాలో చిత్రీక‌రించ‌బోతున్న‌ట్లు తెలిపింది. ఇక్క‌డే ఓ పాట‌ను కూడా షూట్ చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు ఈ సాంగ్‌ను ఎన్టీఆర్‌, జాన్వీక‌పూర్‌ల‌పై తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

మెడ‌లో రుద్రాక్ష‌....

అప్‌డేట్‌తో పాటు ఎన్టీఆర్ లుక్‌ను సోష‌ల్ మీడియాలో సినిమా యూనిట్ శుక్ర‌వారం పంచుకున్న‌ది. ఈ ఫొటోలో న‌డుముపై చేతులో వేసుకొని ఠీవీగా ఎన్టీఆర్ క‌నిపిస్తోన్నాడు. మెడ‌లో రుద్రాక్షతో ఉన్న ఎన్టీఆర్ మాస్ లుక్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో అవుతోంది. ఈ ఫొటోలో ఎన్టీఆర్‌తో పాటు డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌, కొరియోగ్రాఫ‌ర్ రాజు సుంద‌రం క‌నిపిస్తోన్నారు. గోవాలో చిత్రీక‌రించ‌నున్న పాట‌కు రాజు సుంద‌రం కొరియోగ్ర‌ఫీ అందించ‌బోతున్న‌ట్లు ఫొటో చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది.

సైఫ్ అలీఖాన్ విల‌న్‌...

దేవ‌ర మూవీలో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఎన్టీఆర్‌కు ధీటుగా దేవ‌ర‌లో సైఫ్ అలీఖాన్ క్యారెక్ట‌ర్ ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు. దేవ‌ర మూవీ రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కుతోంది. ఫ‌స్ట్ పార్ట్‌ను ఏప్రిల్ 5న రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. షూటింగ్‌లో సైఫ్ అలీఖాన్ గాయ‌ప‌డ‌టం, ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యం కావ‌డంతో రిలీజ్ వాయిదాప‌డింది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 10న దేవ‌ర మూవీని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేశారు.

తీర ప్రాంత ప్ర‌జ‌ల నాయ‌కుడిగా...

జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో దేవ‌ర మూవీ తెర‌కెక్కుతోంది. స‌ముద్ర తీర ప్రాంత ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తీర్చే నాయ‌కుడిగా ఎన్టీఆర్ ఈ మూవీలో క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్టీఆర్‌లోని హీరోయిజాన్ని ఈ మూవీలో కొర‌టాల శివ ప‌తాక స్థాయిలో ఆవిష్క‌రించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

300 కోట్ల బడ్జెట్…

దేవ‌ర పార్ట్ వ‌న్ బ‌డ్జెట్ మూడు వంద‌ల కోట్లుగా టాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. హ‌రి కోస‌రాజు, సుధాక‌ర్ మిక్కిలినేనితో క‌లిసి దేవ‌ర మూవీని హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. దేవ‌ర మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.దేవ‌ర ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తోన్న 30వ మూవీ. దేవ‌ర త‌ర్వాత కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్‌తో ఎన్టీఆర్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ మూవీ ఈ ఏడాదే సెట్స్‌పైకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

నెట్‌ఫ్లిక్స్‌...

దేవ‌ర షూటింగ్ పూర్తికాక‌ముందే ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ది. దాదాపు 80 కోట్ల‌కు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం. దేవ‌ర మూవీలో శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

దేవ‌ర‌తోనే జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. దేవ‌ర త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్‌తో ఓ సినిమా చేయ‌బోతున్న‌ది. రామ్‌చ‌ర‌ణ్‌, జాన్వీక‌పూర్ మూవీకి బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే ఈ సినిమా గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది.

WhatsApp channel