Tiger Shroff: జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లకు వీరాభిమానిని.. వాళ్లతో కలిసి నటించాలని ఉంది: బాలీవుడ్ నటుడు-tiger shroff says he is huge fan of jr ntr and allu arjun wants to face off with them bollywood news in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Tiger Shroff Says He Is Huge Fan Of Jr Ntr And Allu Arjun Wants To Face Off With Them Bollywood News In Telugu

Tiger Shroff: జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లకు వీరాభిమానిని.. వాళ్లతో కలిసి నటించాలని ఉంది: బాలీవుడ్ నటుడు

Hari Prasad S HT Telugu
Feb 23, 2024 05:36 PM IST

Tiger Shroff: టాలీవుడ్ స్టార్లు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లకు తాను వీరాభిమానిని అని అన్నాడు బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్. ఒక్క సినిమాలో అయినా వాళ్లతో కలిసి నటించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.

జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లకు వీరాభిమానిని అంటున్న టైగర్ ష్రాఫ్
జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లకు వీరాభిమానిని అంటున్న టైగర్ ష్రాఫ్

Tiger Shroff: బాలీవుడ్ లో తన సిక్స్ ప్యాక్ బాడీ, యాక్షన్, డ్యాన్స్ తో ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు టైగర్ ష్రాఫ్. సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడిగా సినిమాల్లోకి వచ్చినా.. యాక్షన్ హీరోగా గుర్తింపు పొందిన టైగర్.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో కలిసి నటించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.

వాళ్లిద్దరికీ వీరాభిమానిని..

సౌత్ ఇండియా ఇండస్ట్రీలో ఇప్పటికే టైగర్ ష్రాఫ్ మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తో కలిసి నటించాడు. బడే మియా చోటే మియా మూవీలో ఈ ఇద్దరూ కనిపించనున్నారు. మరి సౌత్ నుంచి ఇంకా ఎవరితో అయినా నటించాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించినప్పుడు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల పేర్లు చెప్పాడు.

"నేను అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లకు వీరాభిమానిని. ఏదో ఒక రోజు వాళ్లతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది" అని టైగర్ ష్రాఫ్ అన్నాడు. పదేళ్ల కిందట హీరోపంతి మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు టైగర్ ష్రాఫ్. అప్పటి నుంచీ అతడు పూర్తి యాక్షన్ సినిమాలే చేస్తూ వస్తున్నాడు. ఒక రకంగా తన సినిమాల్లో గన్స్ కు అతడు అతుక్కుపోయాడనే చెప్పాలి.

అందుకే యాక్షన్ సినిమాలు

తన కెరీర్లో పూర్తిగా యాక్షన్ సినిమాలే చేయడానికి కూడా ఓ ప్రత్యేక కారణం ఉన్నట్లు టైగర్ ష్రాఫ్ చెప్పాడు. "ఎంతో టాలెంట్, పోటీ ఉన్న ఇండస్ట్రీలో మనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టం. నాకు యాక్షన్ హీరో అనే ట్యాగ్ రావడం ఆడియెన్స్ నాకు ఇచ్చిన గుర్తింపుగా భావిస్తాను" అని టైగర్ ష్రాఫ్ అన్నాడు. యాక్షన్ జానర్ తన జోన్ అని స్పష్టం చేశాడు.

"యాక్షన్ హీరో ట్యాగ్ ఓ గౌరవం. నేనెప్పుడూ దీని కోసమే కలగనేవాడిని. స్క్రీన్ పై నేను చూసిన హీరోల్లాగా ఎదగాలని నేను భావించే వాడిని. మొత్తానికి నా లక్ష్యాలు నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది" అని టైగర్ స్పష్టం చేశాడు. తన నెక్ట్స్ మూవీ బడే మియా చోటే మియాలో అక్షయ్ కుమార్ తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు.

"ఇది చాలా అద్భుతమైన ప్రయాణం. ఈ సినిమా షూటింగ్ సమయాన్ని బాగా ఎంజాయ్ చేశాను. అక్షయ్ సర్ వల్లే అది జరిగింది. అతడో అద్భుతమైన కోస్టార్, మెంటార్, అన్నలాంటి వాడు" అని టైగర్ తెలిపాడు. 22 ఏళ్ల టైగర్ ష్రాఫ్ భాగీ 4 మూవీలో కనిపించనున్నాడు. ఇది కాకుండా రాంబో, సింగం అగైన్ సినిమాలూ చేస్తున్నాడు.

IPL_Entry_Point