Indra Re Release Collections: రీ రిలీజ్ సినిమాల్లో ఇంద్ర ఆల్‌టైమ్ రికార్డ్ - బాక్సాఫీస్ వద్ద కుమ్మేసిన మెగాస్టార్
Indra Re Release Collections: ఇంద్ర మూవీ రీ రిలీజ్ సినిమాల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. మహేష్‌బాబు, ఎన్టీఆర్ రికార్డులను తిరగరాసింది. అమెరికాతో పాటు కర్ణాటకలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తెలుగు రీ రిలీజ్ మూవీగా ఇంద్ర నిలిచింది.
Indra Re Release Collections: మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర మూవీ రీ రిలీజ్ సినిమాల్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. తొలిరోజు ఈ మూవీ ఇండియా వైడ్‌గా రెండు కోట్ల యాభై లక్షల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్‌సీస్‌లో యాభై లక్షలకుపైగా వసూళ్లను దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. మొత్తంగా ఫస్ట్ డే మూడు కోట్ల ఐదు లక్షలకుపైగా ఇంద్ర మూవీకి కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇంద్ర సినిమా ఒక్క నైజాంలోనే గురువారం రోజు కోటి వరకు వసూళ్లను సాధించింది. నైజాం ఏరియాలో 252 వరకు ఇంద్ర స్పెషల్ షోస్‌ను స్క్రీనింగ్ చేశారు.
సీడెడ్…ఐదో స్థానం…
సీడెడ్‌లో 28 లక్షల వరకు ఇంద్ర వసూళ్లను దక్కించుకున్నది. సీడెడ్‌లో 30 లక్షల వరకు ఇంద్ర వసూళ్లను దక్కించుకున్నది. సీడెడ్‌లో రీ రిలీజ్ సినిమాల్లో 76 లక్షలతో సింహాద్రి టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఖుషి, జల్సా ఉన్నాయి. ఇంద్ర ఐదో ప్లేస్‌లో నిలిచింది.
కర్ణాటకలో ఆల్‌టైమ్ రికార్డ్...
ఇంద్ర మూవీ కర్ణాటకలో ఆల్‌టైమ్ రికార్డును నెలకొల్పింది. గురువారం రోజు కర్ణాటకలో ఈ మూవీ 30 లక్షల వరకు వసూళ్లను సొంతం చేసుకున్నది. రీ రిలీజ్ సినిమాల్లో కర్ణాటకలో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాగా ఇంద్ర రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంద్ర కంటే ముందు మహేష్ బాబు బిజినెస్‌మెన్ 27 లక్షలతో టాప్ ప్లేస్‌లో ఉండేది. మహేష్‌బాబు రికార్డును చిరంజీవి మూవీ దాటేసింది.
ఓవర్‌సీస్‌లో దుమ్మురేపిన ఇంద్ర...
అమెరికాలో ఇంద్ర మూవీ వసూళ్లను వర్షాన్ని కురిపించింది. అమెరికాలో ఫస్ట్ డే ఇంద్ర మూవీ అరవై వేలడాలర్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది. యూఎస్‌లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన రీ రిలీజ్ సినిమాగా ఇంద్ర నిలిచింది. ఇంద్ర కంటే ముందు ఎన్టీఆర్ సింహాద్రి 58 వేల డాలర్లలో ఫస్ట్‌లో ఉంది. సింహాద్రి రికార్డును కూడా ఇంద్ర తిరగరాయడం గమనార్హం.శుక్రవారం రోజు కూడా ఇంద్ర మూవీ వరల్డ్ వైడ్‌గా కోటికిపైనే వసూళ్లను సాధించే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
హయ్యెస్ట్ గ్రాసింగ్ తెలుగు మూవీ...
ఇంద్ర మూవీకి బి గోపాల్ దర్శకత్వం వహించాడు. 2002లో రిలీజైన ఈ మాస్ యాక్షన్ మూవీ అప్పట్లో ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాసింగ్ తెలుగు మూవీగా రికార్డులు నెలకొల్పింది. అంతే కాకుండా దక్షిణాది సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాగా సరికొత్త చరిత్రను సృష్టించింది. దాదాపు 10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఇంద్ర మూవీ 55 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది.
ఇంద్రసేనారెడ్డి...
ఇంద్రలో ఇంద్రసేనారెడ్డిగా చిరంజీవి పవర్‌ఫుల్ యాక్టింగ్, డైలాగ్స్, డ్యాన్సులు అభిమానులను మెప్పించాయి. ఇంద్ర మూవీలో ఆర్తి అగర్వాల్, సోనాలీ బింద్రే హీరోయిన్లుగా నటించారు. తనికెళ్లభరణి, శివాజీ కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమా విజయంలో కీలక భూమిక పోషించింది.
ఇంద్ర మూవీ రీ రిలీజ్ సినిమాల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. మహేష్‌బాబు, ఎన్టీఆర్ రికార్డులను తిరగరాసింది. అమెరికాతో పాటు కర్ణాటకలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తెలుగు రీ రిలీజ్ మూవీగా ఇంద్ర నిలిచింది.