Renu Desai on Indian 2: ఇలాంటి చెత్త సినిమాలు ఫ్లాప్ కావడమే మంచిది - ఇండియన్2పై రేణుదేశాయ్ కామెంట్స్ వైరల్
07 September 2024, 10:45 IST
Renu Desai on Indian 2: ఇండియన్ 2 మూవీ ఫ్లాప్ కావడం ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి. ఇండియన్ 2 డైలాగ్ రైటర్స్‌ను ఇడియట్స్ అంటూ రేణుదేశాయ్ పేర్కొన్నడం రేణుదేశాయ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రేణు దేశాయ్
Renu Desai on Indian 2: కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీపై రేణుదేశాయ్ చేసిన కామెంట్స్ సినీ వర్గాలతో మెగా ఫ్యాన్స్‌లో ఆసక్తికరంగా మారాయి. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీ ఎత్తున రిలీజైన ఈ యాక్షన్ మూవీ కథ, కథనాలు, విజువల్స్ ఎఫెక్ట్స్‌తో పాటు ప్రధాన పాత్రధారుల యాక్టింగ్ విషయంలో దారుణంగా విమర్శలొచ్చాయి.
డైరెక్టర్‌గా శంకర్ ఔట్‌డేటెడ్ అయ్యాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఇండియన్ 2 మూవీ వంద కోట్లలోపే కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాతలకు దారుణంగా నష్టాలను తెచ్చిపెట్టింది.
వీధి కుక్కలపై డైలాగ్స్...
కాగా ఇండియన్ 2 వీధి కుక్కలను ఉద్దేశించి శంకర్ అండ్ టీమ్ రాసిన డైలాగ్స్‌పై యానిమల్ లవర్స్ ఏకిపడేస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని చోట్ల విలన్స్‌ను కుక్కలతో పోలిస్తూ కమల్‌హాసన్ డైలాగ్స్ చెబుతాడు. నీతి జాతిలేని కుక్క, డర్టీ స్ట్రీట్ డాగ్ అంటూ కమల్ చెప్పే డైలాగ్స్‌పై సోషల్ మీడియాలో పెట్ లవర్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శకుల బ్యాచ్‌లో రేణుదేశాయ్ చేరింది.
సినిమా ఫ్లాప్ కావడం ఆనందంగా ఉంది...
ఇండియన్ 2 సినిమా పోస్టర్‌ను పోస్ట్ చేస్తూ...ఇలాంటి చెత్త సినిమా ఫ్లాప్ అయినందుకు సంతోషంగా ఉందని రేణు దేశాయ్ అన్నది. వీధి కుక్కలు డర్టీ కాదంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కామెంట్ పెట్టింది. వీధి కుక్కులపై ప్రేమను చూపించాలి తప్పితే ద్వేషాన్ని కాదని అన్నది.
ఇలాంటి డైలాగ్స్ ఎలా రాస్తారూ అంటూ రేణు దేశాయ్ ఫైర్ అయ్యింది. డైలాగ్ రాసిన రైటర్స్‌ను ఇడియట్స్ అంటూ రేణుదేశాయ్ తన పోస్ట్‌లో పేర్కొనడం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లెజెండరీ డైరెక్టర్ మూవీపై...కొందరు రేణుదేశాయ్‌ని సపోర్ట్ చేస్తుంటే...మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. లెజెండరీ యాక్టర్, డైరెక్టర్ చేసిన మూవీపై రేణుదేశాయ్ ఇలాంటి కామెంట్స్ చేయడం బాగాలేదంటూ చెబుతోన్నారు.
గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్...
ఇండియన్ 2 తర్వాత రామ్‌చరణ్‌తో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తోన్నాడు శంకర్. ఇండియన్ 2 డిజాస్టర్‌గా నిలవడంతో గేమ్ ఛేంజర్ రిజల్ట్‌పై మెగా అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోయింది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను శనివారం (నేడు) అనౌన్స్‌చేయబోతున్నారు.
డిసెంబర్ 20న గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అంజలి, సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
దాదాపు 170 కోట్ల బడ్జెట్‌తో దిల్‌రాజు గేమ్ ఛేంజర్ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. గేమ్ ఛేంజర్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీమ్ బిజీగా ఉన్నట్లు తెలిసింది.