Jaragandi Song: గేమ్ ఛేంజర్ నుంచి జరగండి సాంగ్ రిలీజ్ - చరణ్, కియారా క్లాస్ స్టెప్పులు అదుర్స్
Jaragandi Song: గేమ్ ఛేంజర్ మూవీ నుంచి జరగండి పాటను రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం రిలీజ్ చేశారు. రామ్‌చరణ్, కియారా క్లాసిక్ స్టెప్స్, కలర్‌ఫుల్ విజువల్స్‌తో ఈ పాటను మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది.
Game Changer Jaragandi Song: రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులకు గేమ్ ఛేంజర్ మూవీ టీమ్ స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. ఈ సినిమాలోని జరగండి సాంగ్‌ను రిలీజ్ చేసింది. జరగండి జరగండి జరగండి. జాబిలమ్మ జాకెటేసుకొచ్చేనండి అనే లిరిక్స్‌తో ఈ పాట మొదలైంది. మాస్ ట్యూన్స్, క్యాచీ లిరిక్స్‌తో జరగండి పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. జరగండి పాటకు ఆనంతశ్రీరామ్ సాహిత్యాన్ని అందించాడు.
దలేర్ మెహందీ, సునిధీ చౌహాన్ జరగండి పాటను ఆలపించారు. తమన్ మ్యూజిక్ అందించాడు. ఈ పాటలో రామ్‌చరణ్, కియారా తమ క్లాసిక్ స్టెప్పులతో అభిమానులను ఆకట్టుకుంటోన్నారు. గ్లాడియేటర్‌ను తలపిస్తూ భారీ ఖర్చుతో కలర్‌ఫుల్‌గా వేసిన సెట్స్‌లో ఈ పాటను చిత్రీకరించారు. రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పాట రిలీజైన కొద్ది నిమిషాల్లోనే యూట్యూబ్‌లో ట్రెండింగ్ లిస్ట్‌లోకి చేరిపోయింది.
శంకర్ టాలీవుడ్ ఎంట్రీ..
గేమ్ ఛేంజర్ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారతీయుడు, ఒకే ఒక్కడు వంటి డబ్బింగ్ మూవీస్‌తోనే తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు శంకర్.ఆయన చేస్తోన్న ఫస్ట్ తెలుగు మూవీ గేమ్ ఛేంజర్ కావడం గమనార్హం. గేమ్ ఛేంజర్‌లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.వినయవిధేయరామ తర్వాత రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న సినిమా ఇది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత దిల్‌రాజు గేమ్ ఛేంజర్ మూవీని మూవీని నిర్మిస్తున్నాడు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం.
ఐపీఎస్ ఆఫీసర్‌గా...
శంకర్ శైలిలోనే కమర్షియల్ అంశాలకు సోషల్ మెసేజ్‌ను జోడించి ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇందులో ఐపీఎస్ ఆఫీసర్‌గా చరణ్ కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డ్యూయల్ షేడ్‌లో చరణ్ క్యారెక్టర్ సాగుతుందని అంటున్నారు. గత రెండేళ్లుగా షూటింగ్‌ను జరుపుకుంటోన్న ఈ మూవీ ఈ ఏడాది రిలీజ్ కానుంది. సెప్టెంబర్‌లో గేమ్ ఛేంజర్‌ను పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోన్నారు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో...
షూటింగ్ పూర్తికాకుండా గేమ్ ఛేంజర్ మూవీ ఓటీటీ హక్కులు అమ్ముడుపోయాయి.ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా రూ.110 కోట్లకు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గేమ్ ఛేంజర్ తమ ఓటీటీలోనే రిలీజ్ కానున్నట్లు ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వెల్లడించిన విషయం తెలిసిందే. గేమ్ ఛేంజర్ మూవీలో అంజలి, నవీన్‌చంద్ర, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
గేమ్ ఛేంజర్ తర్వాత ఉప్పెన్ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా మూవీ చేయబోతున్నట్లు రామ్‌చరణ్. ఇటీవలే ఈ మూవీ లాంఛనంగా మొదలైంది. ఈ భారీ బడ్జెట్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇండియన్ 2 కూడా...
గేమ్ ఛేంజర్‌తో పాటు కోలీవుడ్‌లో ఇండియన్ 2 మూవీని తెరకెక్కిస్తోన్నాడు శంకర్. 1996లో రిలీజైన ఇండియన్‌కు సీక్వెల్‌గా ఇండియన్ 2 మూవీ తెరకెక్కుతోంది. కమల్‌హాసన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.