తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Cricket Theme Movies On Ott: ఓటీటీలోని టాప్ 10 క్రికెట్ థీమ్ మూవీస్ ఇవే.. వీటిని అస్సలు మిస్ కావద్దు

Cricket Theme Movies on OTT: ఓటీటీలోని టాప్ 10 క్రికెట్ థీమ్ మూవీస్ ఇవే.. వీటిని అస్సలు మిస్ కావద్దు

Hari Prasad S HT Telugu

16 December 2024, 15:18 IST

google News
    • Cricket Theme Movies on OTT: ఓటీటీలో క్రికెట్ థీమ్ తో ఉన్న టాప్ సినిమాలు కొన్ని ఉన్నాయి. తెలుగుతోపాటు హిందీ, తమిళం భాషల్లో ఉన్న ఈ సినిమాలను నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడొచ్చు.
ఓటీటీలోని టాప్ 10 క్రికెట్ థీమ్ మూవీస్ ఇవే.. వీటిని అస్సలు మిస్ కావద్దు
ఓటీటీలోని టాప్ 10 క్రికెట్ థీమ్ మూవీస్ ఇవే.. వీటిని అస్సలు మిస్ కావద్దు

ఓటీటీలోని టాప్ 10 క్రికెట్ థీమ్ మూవీస్ ఇవే.. వీటిని అస్సలు మిస్ కావద్దు

Cricket Theme Movies on OTT: క్రికెట్, సినిమాలు.. ఇండియాలో ఈ రెండింటికి ఉన్నంత క్రేజ్ మరే ఎంటర్టైన్మెంట్ కు ఉండదు. అలాంటిది క్రికెట్ థీమ్ తోనే వచ్చిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకూ హిందీ, తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ క్రికెట్ నేపథ్యంలో వచ్చిన మూవీస్ ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులో ఉన్న ఆ మూవీస్ ఏంటో ఒకసారి చూద్దాం.

క్రికెట్ థీమ్ మూవీస్

క్రికెట్ నేపథ్యంలో వచ్చిన చాలా వరకు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయ్యాయి. ఓటీటీలోనూ వీటికి మంచి డిమాండే ఉంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఉన్న ఆ సినిమాలేంటో చూడండి.

జెర్సీ - ప్రైమ్ వీడియో

నాని నటించిన జెర్సీ మూవీ ఓ బాక్సాఫీస్ హిట్. 2019లో వచ్చిన ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులో ఉంది. అర్జున్ అనే ఓ క్రికెటర్ పాత్రలో నాని నటించాడు. యువకుడిగా ఉన్నప్పుడు ఎంత టాలెంట్ ఉన్నా.. ఓ ఫెయిల్యూర్ గా మిగిలిపోయిన అతడు.. 30ల వయసు దాటిన తర్వాత ఇండియన్ టీమ్ కు ఆడాలన్న కలతో మళ్లీ క్రికెట్ లోకి అడుగుపెడతాడు.

మజిలీ - హాట్‌స్టార్

నాగ చైతన్య, సమంత నటించిన మజిలీ మూవీ కూడా క్రికెట్ నేపథ్యంలో సాగే మూవీయే. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఉంది. ఈ మూవీ కూడా 2019లోనే వచ్చింది. ఓ మంచి క్రికెటర్ గా ఎదగాలనుకునే పూర్ణ అనే యువకుడు అమ్మాయి ప్రేమలో విఫలమై ఎలా కెరీర్ నాశనం చేసుకుంటాడు? తనకు ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేసుకున్నాడన్నదే ఈ మూవీ స్టోరీ.

ధోనీ - హాట్‌స్టార్

ధోనీ 2012లో వచ్చిన ఓ తెలుగు మూవీ. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ స్ఫూర్తిగా ఇండియన్ క్రికెట్ టీమ్ కు ఆడాలని కలలు కనే ఓ 14 ఏళ్ల కుర్రాడి చుట్టూ తిరిగే కథ ఇది. అతని తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ నటించాడు. ఈ సినిమా హాట్‌స్టార్ లో ఉంది.

83 - ప్రైమ్ వీడియో

83 మూవీ ప్రైమ్ వీడియోలో ఉంది. 1983 క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీమ్ నేపథ్యంలో సాగే మూవీ ఇది. ఇందులో కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటించాడు. మూవీ తెలుగులోనూ అందుబాటులో ఉంది.

లగాన్ - నెట్‌ఫ్లిక్స్

లగాన్ 2001లో వచ్చిన హిందీ మూవీ. ఆమిర్ ఖాన్ నటించిన ఈ సినిమా బ్రిటీష్ కాలంలో భూమిపై విధించే పన్ను, క్రికెట్ ఆట నేపథ్యంలో చాలా ఆసక్తికరంగా సాగే సినిమా. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోల్లో ఉంది.

ఎమ్మెస్ ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ - హాట్‌స్టార్

టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ బయెపిక్ ఈ మూవీ. హాట్‌స్టార్ లో చూడొచ్చు. 2016లో రిలీజైన ఈ మూవీలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. ధోనీ పాత్రలో నటించాడు. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక్బాల్ - జీ5, ప్రైమ్ వీడియో

ఇక్బాల్ మూవీ 2005లో వచ్చింది. ఇండియన్ క్రికెట్ టీమ్ కు ఆడాలని కలలు కనే ఓ చెవిటి, మూగ అయిన కుర్రాడి చుట్టూ తిరిగే స్టోరీ ఇది. జీ5, ప్రైమ్ వీడియోల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

లబ్బర్ పండు - హాట్‌స్టార్

ఈ ఏడాది తమిళంలో రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన మూవీ లబ్బర్ పండు. గ్రామీణ స్థాయిలో క్రికెట్ ఆడే ఇద్దరు క్రికెటర్లు, వాళ్లు ఈగో చుట్టూ తిరిగే స్టోరీతో లబ్బర్ పండు మూవీ ఆకట్టుకుంది. ఈ సినిమా హాట్‌స్టార్ లో ఉంది.

శభాష్ మిథూ - నెట్‌ఫ్లిక్స్

ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ ఈ శభాష్ మిథూ. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు. ఇందులో మిథాలీ పాత్రను తాప్సీ పన్ను పోషించింది.

800 - ప్రైమ్ వీడియో

గతేడాది రిలీజైన మూవీ 800. శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

తదుపరి వ్యాసం