Naga Chaitanya Wedding: శోభిత మెడలో నాగ చైతన్య మూడు ముళ్లు.. విజిల్ వేసిన అఖిల్ అక్కినేని.. వీడియో వైరల్
Naga Chaitanya Wedding: నాగ చైతన్య, శోభిత పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఆమె మెడలో చైతూ మూడు ముళ్లు వేసే సమయంలో పక్కనే ఉన్న అఖిల్ అక్కినేని విజిల్ వేయడం ఇందులో చూడొచ్చు.
Naga Chaitanya Wedding: నాగ చైతన్య మరోసారి పెళ్లి చేసుకున్న విషయం తెలుసు కదా. ఓవైపు టాలీవుడ్ లో పుష్ప 2 రిలీజ్ తోపాటు అతని పెళ్లి కూడా హాట్ టాపిక్ గా నిలుస్తోంది. శోభితా ధూళిపాళ్ల మెడలో అతడు మూడు ముళ్లు వేశాడు. వీళ్ల పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఇప్పటికే ఎన్నో బయటకు రాగా.. తాజాగా ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది.
చైతూ మూడు ముళ్లు.. అఖిల్ విజిల్
నాగ చైతన్య, శోభిత పెళ్లికి సంబంధించిన ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగా ఉంది. ఆ వీడియోలో శోభిత మెడలో చైతూ మూడు ముళ్లు వేస్తుంటాడు. వేద పురోహితులు మంత్రాలు చదువుతుండగా.. ఆ పక్కనే ఉన్న అఖిల్ అక్కినేని గట్టిగా విజిల్ వేయడం కూడా ఆ వీడియోలో కనిపిస్తుంది. అతన్ని చూసి మిగిలిన వాళ్లు కూడా కొందరు విజిల్స్ వేయడంతోపాటు గట్టిగా అరవడం వినిపిస్తుంది. పెళ్లి మండపం పైన ఎవరో తీసిన వీడియో ఇది.
ఈ వీడియోను నాగ చైతన్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నా, వదినా.. వాళ్ల ముఖాల్లో ఎంతో ఆనందం కనిపిస్తోందంటూ ఈ వీడియోను ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అప్పటి నుంచీ ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. చైతూ తాళి కడుతున్న సమయంలో ఆ వెనుక అతని తండ్రి నాగార్జున, వెంకటేశ్ కూడా ఉన్నారు. ఇటు శోభిత కుటుంబ సభ్యులు కూడా ఈ క్షణాన్ని బాగా ఎంజాయ్ చేసినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది.
నాగ చైతన్య, శోభిత పెళ్లి
రెండేళ్లుగా డేటింగ్ లో ఉన్న నాగ చైతన్య, శోభిత మొత్తానికి పెళ్లితో ఒక్కటయ్యారు. వీళ్ల పెళ్లి బుధవారం (డిసెంబర్ 4) హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి కోసం శోభిత పట్టు చీరలో ఎంతో అందంగా ముస్తాబైంది. అటు చైతూ కూడా తెలుగు సాంప్రదాయంలో పట్టు వస్త్రాల్లో కనిపించాడు. వీళ్ల పెళ్లి ఫొటోలను మొదట నాగార్జున తన ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేశాడు.
"శోభిత, చై తమ అందమైన అధ్యాయాన్ని ప్రారంభించడం చూస్తుంటే నాకు చాలా ప్రత్యేకంగా, ఎమోషనల్ గా కూడా ఉంది. కంగ్రాచులేషన్స్ మై డియర్ చై. మా కుటుంబంలోకి శోభితకు స్వాగతం. నువ్వు ఇప్పటికే మా జీవితాల్లోకి ఎన్నో సంతోషాలు తీసుకొచ్చావు. ఏఎన్ఆర్ గారి విగ్రహం సమక్షంలో ఈ పెళ్లి జరగడం మరింత మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది" అని నాగార్జున అన్నాడు. అతని ఇంట్లోనే త్వరలోనే అఖిల్ పెళ్లి కూడా జరగనుంది. ఈ మధ్యే అతనికి కూడా నిశ్చితార్థం జరిగింది.
చై, శోభిత పెళ్లికి టాలీవుడ్ నుంచి చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి వాళ్లతోపాటు మొత్తం అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల వాళ్లు వచ్చారు. నాగ చైతన్య గతంలో 2017లో సమంతను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంట 2021లో విడిపోయింది.