తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tom Cruise On Naatu Naatu: టామ్ క్రూజ్‌కు నాటు నాటు, ఆర్ఆర్ఆర్ చాలా నచ్చాయి: చంద్రబోస్

Tom Cruise on Naatu Naatu: టామ్ క్రూజ్‌కు నాటు నాటు, ఆర్ఆర్ఆర్ చాలా నచ్చాయి: చంద్రబోస్

Hari Prasad S HT Telugu

15 March 2023, 19:23 IST

    • Tom Cruise on Naatu Naatu: టామ్ క్రూజ్‌కు నాటు నాటు, ఆర్ఆర్ఆర్ చాలా నచ్చాయని అన్నాడు లిరిసిస్ట్ చంద్రబోస్. ఈ విషయాన్ని ఆ హాలీవుడ్ హీరోనే తనతో చెప్పినట్లు కూడా అతడు వెల్లడించడం విశేషం.
టామ్ క్రూజ్.. చంద్రబోస్
టామ్ క్రూజ్.. చంద్రబోస్

టామ్ క్రూజ్.. చంద్రబోస్

Tom Cruise on Naatu Naatu: ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలుచుకున్న విషయం తెలుసు కదా. ఈ పాటను కంపోజ్ చేసిన కీరవాణితోపాటు పాట రాసిన చంద్రబోస్ కూడా అవార్డు అందుకున్నాడు. అయితే తన నాటు నాటు పాటతోపాటు సినిమా కూడా హాలీవుడ్ టాప్ హీరో టామ్ క్రూజ్‌కు బాగా నచ్చినట్లు చంద్రబోస్ వెల్లడించాడు.

ట్రెండింగ్ వార్తలు

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

Kannappa Prabhas: కన్నప్ప షూటింగ్‌లో ప్రభాస్.. ఆ మూడు రోజుల్లోనే పూర్తి చేయాలంటూ..

Koratala Siva on Devara: నాకు, అభిమానులకు స్పెషల్ సినిమా: దేవరపై దర్శకుడు కొరటాల శివ.. అప్‍డేట్లపై కామెంట్

అంతటి యాక్టర్ తాను రాసిన పాటను మెచ్చుకోవడంతో తన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయని చంద్రబోస్ అన్నాడు. సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఈ విషయాన్ని చెప్పాడు. "నేను టామ్ క్రూజ్ ను చూసినప్పుడు అతని దగ్గరికి వెళ్లి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. అప్పుడే అతడు వావ్.. నాకు ఆర్ఆర్ఆర్ నచ్చింది.. నాటు నాటు నచ్చింది. టామ్ క్రూజ్ లాంటి నటుడి నోటి నుంచి నాటు అనే పదం వినిపించడం చాలా సంతోషంగా ఉంది" అని చంద్రబోస్ అన్నాడు.

అంతేకాదు లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ కూడా సినిమాపై ప్రశంసలు కురిపించాడని చెప్పాడు. తన భార్య రెండుసార్లు ఈ సినిమా చూసినట్లు స్పీల్‌బర్గ్ తనతో చెప్పినట్లు కూడా చంద్రబోస్ వెల్లడించాడు. నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సాంగ్, మూవీగా నిలవడం విశేషం.

అంతేకాదు ఆస్కార్ వేదికపై కూడా ఈ నాటు నాటు లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ పాట పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాట పాడగా.. అమెరికన్ డ్యాన్సర్లు స్టెప్పులేశారు. అప్పటికే ఈ పాట గోల్డెన్ గ్లోబ్స్ తో పాటు హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు కూడా గెలుచుకుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.