Ram Charan Hollywood Movie: అవును.. హాలీవుడ్ మూవీలో నటించబోతున్నా: రామ్ చరణ్-ram charan hollywood movie confirmed by the actor himself in a recent interview ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ram Charan Hollywood Movie Confirmed By The Actor Himself In A Recent Interview

Ram Charan Hollywood Movie: అవును.. హాలీవుడ్ మూవీలో నటించబోతున్నా: రామ్ చరణ్

Hari Prasad S HT Telugu
Mar 09, 2023 06:57 PM IST

Ram Charan Hollywood Movie: అవును.. హాలీవుడ్ మూవీలో నటించబోతున్నా అని స్పష్టం చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ ప్రాజెక్ట్ విశేషాలను అతడు ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

రామ్‌చ‌ర‌ణ్
రామ్‌చ‌ర‌ణ్

Ram Charan Hollywood Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు టాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాదు. అతడో గ్లోబల్ స్టార్. ఆర్ఆర్ఆర్ మూవీతో చెర్రీ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ మూవీ రామ్ పాత్రలో ఇరగదీసిన అతడు.. పాన్ ఇండియా కాదు కదా పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడిదే మూవీ కోసం అమెరికాలో ఉన్న చరణ్ ఇంటర్వ్యూ కోసం అక్కడి ఛానెల్స్ పోటీ పడుతున్నాయి.

ఈ మధ్యే చరణ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను చేయబోతున్న హాలీవుడ్ ప్రాజెక్ట్ పై స్పందించాడు. ఓ పాడ్‌కాస్ట్ షోలో సామ్ ఫ్రాగోసోతో మాట్లాడిన రామ్ చరణ్.. తన హాలీవుడ్ ప్రాజెక్ట్ ను కన్ఫామ్ చేశాడు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నట్లు కూడా వెల్లడించాడు.

"అవును ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. కచ్చితంగా ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రస్తుతం దీనిపైనే చర్చలు కొనసాగుతున్నాయి. అవి ఎలా జరుగుతున్నాయి? నేను ఎప్పుడు సెట్స్ లో అడుగుపెట్టబోతున్నాను అనే విషయాలు వచ్చే రెండు నెలల్లో తెలుస్తాయి" అని చరణ్ చెప్పడం విశేషం.

చెర్రీయే హాలీవుడ్ ప్రాజెక్ట్ ను కన్ఫామ్ చేయడంతో అతని అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. అంతేకాదు ఇదే షోలో చెర్రీ మాట్లాడుతూ.. తనకు జూలియా రాబర్ట్స, టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ లాంటి నటీనటులతో కలిసి నటించాలని ఉందని చెప్పాడు. ఈ మధ్యే ఓ షోలో వ్యాఖ్యాత అతన్ని బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియాగా కూడా అభివర్ణించడం విశేషం.

95వ ఆస్కార్స్ లో చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్ మూవీ నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీ పడుతున్న విషయం తెలిసిందే. దీనికోసమే అతడు ఎంతో ముందుగానే అమెరికా వెళ్లాడు. ఆస్కార్స్ వేడుక వచ్చే ఆదివారం (మార్చి 12, భారత కాలమానం ప్రకారం సోమవారం (మార్చి 13) తెల్లవారుఝామున) జరగనుంది. ఈ వేడుకలోనే నాటు నాటు లైవ్ పర్ఫార్మెన్స్ ఉండనుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం