HCA Clarifies NTR Issue: అట్లుంటది ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌తోని.. దిగొచ్చిన హాలీవుడ్ అవార్డు సంస్థ
HCA Clarifies NTR Issue: ఇటీవల జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసొసియేషన్ అవార్డుల కార్యక్రమానికి ఎన్‌టీఆర్ గైర్హాజరైన సంగతి తెలిసిందే. రామ్ చరణ్‌ను ఆహ్వానించి తారక్‌ను రాకపోవడంపై ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ నెట్టింట విరుచుకుపడ్డారు. తాజాగా ఈ అంశంపై హెచ్‌సీఏ స్పష్టతనిచ్చింది.
HCA Clarifies NTR Issue: దర్శక ధీరుడు రాజౌమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపించడమే కాకుండా ప్రేక్షకులను విపరీతంగా అలరిచింది. ముఖ్యంగా వెస్టర్న్ ఆడియెన్స్‌ను రెస్పాన్స్ బాగా వచ్చింది. దీంతో సినిమాకు పలు అంతర్జాతీయ అవార్డులు కూడా వస్తున్నాయి. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్..ఆస్కార్ నామినేషన్‌లోనూ ఉంది. అయితే ఇటీవల హాలీవుడ్ క్రిటిక్స్ అసొసియేషన్(HCA) అవార్డులలో ఏకంగా నాలుగు విభాగాల్లో పురస్కారాలను సొంతం చేసుకుంది ఆర్ఆర్ఆర్. దీంతో సర్వత్రా చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ కార్యక్రమానికి రాజమౌళి సహా హీరో రామ్ చరణ్, సంగీత దర్శకుడు కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా హాజరయ్యారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఈ వేడుకలో మిస్ అయ్యారు. ఈ మొత్తం కార్యక్రమంలో చరణ్ హాజరై హైలెట్‌గా నిలవడంతో అభిమానుల నుంచే పలువురు ఇండస్ట్రీ వ్యక్తులు రామ్ చరణ్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇప్పుడిదే ఫ్యాన్ వార్‌కు దారితీసింది.
దీంతో తారక్‌ను పక్కనపెట్టేశారని భావించిన ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభిమాన హీరోను పక్కనపెట్టడమేంటి? అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా అవార్డులను కొనుగొలు చేశారా? అంటూ కూడా విరుచుకుపడ్డారు. దీంతో హాలీవుడ్ క్రిటిక్స్ అసొసియేషన్ స్పందించింది. తాము తారక్‌కు కూడా ఆహ్వానం అందించామని, కానీ ఆయన ఓ సినిమా షూటింగ్‌లో ఉండటం, ఆ తర్వాత ఆయన సోదరుడు తారకరత్న చనిపోవడం కారణంగా షూటింగ్ కూడా నిలిపివేశారని తెలిపారు. తారక్ వ్యక్తిగత కారణాల వల్ల ఈవెంట్‌కు హాజరు కాలేదని హెచ్‌సీఏ బదులిచ్చింది.
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా నాటు నాటు పాట 95వ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా నామినేటైంది. మార్చి 12న లాస్ ఏంజెల్స్ వేదికగా ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.