Natu Natu on Oscars: ఆస్కార్స్ వేదికపై తారక్, చరణ్ నాటు నాటు డ్యాన్స్ అందుకే చేయలేదు.. ప్రొడ్యూసర్ చెప్పిన కారణమిదే-natu natu on oscars not performed by jr ntr and ram charan and the reason is this ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Natu Natu On Oscars: ఆస్కార్స్ వేదికపై తారక్, చరణ్ నాటు నాటు డ్యాన్స్ అందుకే చేయలేదు.. ప్రొడ్యూసర్ చెప్పిన కారణమిదే

Natu Natu on Oscars: ఆస్కార్స్ వేదికపై తారక్, చరణ్ నాటు నాటు డ్యాన్స్ అందుకే చేయలేదు.. ప్రొడ్యూసర్ చెప్పిన కారణమిదే

Hari Prasad S HT Telugu
Mar 15, 2023 03:13 PM IST

Natu Natu on Oscars: ఆస్కార్స్ వేదికపై తారక్, చరణ్ నాటు నాటు డ్యాన్స్ చేయకపోవడం వెనుక కారణం చెప్పాడు అకాడెమీ అవార్డుల ప్రొడ్యూసర్ రాజ్ కపూర్. వాళ్ల డ్యాన్స్ కోసం ఎదురు చూసిన అభిమానులు తీవ్రంగా నిరాశ చెందిన విషయం తెలిసిందే.

నాటు నాటు సాంగ్ పై చరణ్, తారక్ స్టెప్పులు
నాటు నాటు సాంగ్ పై చరణ్, తారక్ స్టెప్పులు

Natu Natu on Oscars: నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చినందుకు ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి భారతీయుడు గర్వంతో ఉప్పొంగాడు. కానీ వాళ్లలో ఓ వెలితి మాత్రం అలాగే ఉండిపోయింది. ఈ పాటకు ఆస్కార్ వేదికపై జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి డ్యాన్స్ చేస్తారని ఆశ పడిన అభిమానులకు నిరాశే ఎదురైంది.

ఈ పాటను కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ కలిసి వేదికపై పాడగా.. బాలీవుడ్ నటి లారెన్ గాట్లీబ్, ఇతర అమెరికన్ డ్యాన్సర్లు స్టెప్పులేశారు. నిజానికి ఆ ఆర్ఆర్ఆర్ హీరోలు కలిసి డ్యాన్స్ చేసి ఉంటే బాగుండేదని చాలా మంది భావించారు. అయితే వాళ్లు అలా చేయకపోవడం వెనుక ఉన్న కారణాన్ని ఆస్కార్స్ ప్రొడ్యూసర్ రాజ్ కపూర్ వివరించాడు.

వాళ్లకు రిహార్సల్స్ కు సరిపడా సమయం లేకే చేయలేకపోయారని చెప్పాడు. "నిజానికి, సింగర్స్ తో కలిసి ఆ ఇద్దరు ఒరిజినల్ హీరోలే డ్యాన్స్ చేయాల్సి ఉంది. వాళ్ల టీమ్ కు కావాల్సిన వీసాలు ఏర్పాటు చేయడానికి కూడా అకాడెమీ సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి చివర్లో మాకో సమాచారం అందింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్స్ వేడుకకు వస్తున్నారు కానీ.. స్టేజ్ పై డ్యాన్స్ చేయడానికి మాత్రం సిద్ధంగా లేరని చెప్పారు. వాళ్లు ప్రొఫెషనల్ గా బిజీగా ఉండటంతో రిహార్సల్స్ చేసే సమయం వాళ్లకు దక్కలేదు" అని రాజ్ కపూర్ వెల్లడించాడు.

రామ్ చరణ్ రెండు వారాల ముందే అమెరికాకు వెళ్లినా.. తారక్ మాత్రం అవార్డుల సెర్మనీకి కాస్త ముందే వెళ్లాడు. తన నెక్ట్స్ మూవీ పనుల్లో బిజీగా ఉండటంతో తారక్ ముందుగా వెళ్లడం కుదరలేదు. ఇక సినిమాలో నాటు నాటు పాట గురించి కూడా ఈ సందర్భంగా రాజ్ కపూర్ చెప్పుకొచ్చాడు.

"సినిమాలో అసలు పాటను రెండు నెలల పాటు రిహార్సల్స్ చేసి మరీ 15 రోజుల పాటు షూట్ చేశారు. ఇక ఆస్కార్స్ వేదికపై డ్యాన్స్ చేసిన డ్యాన్సర్లు కూడా 18 గంటల పాటు రిహార్స్ చేశారు" అని వివరించాడు. నిజానికి చరణ్, తారక్ కలిసి డ్యాన్స్ చేసి ఉంటే మాత్రం అభిమానులకు నిజమైన పండగలా ఉండేది.

IPL_Entry_Point

సంబంధిత కథనం