Top Mentioned Actors: నెట్టింట ఎక్కువగా చర్చించిన యాక్టర్లలో మనోళ్లే టాప్.. ఆస్కార్ ఈవెంట్ మొత్తం ఆర్ఆర్ఆర్ హవా-jr ntr topped most mentioned actors at oscars ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Top Mentioned Actors: నెట్టింట ఎక్కువగా చర్చించిన యాక్టర్లలో మనోళ్లే టాప్.. ఆస్కార్ ఈవెంట్ మొత్తం ఆర్ఆర్ఆర్ హవా

Top Mentioned Actors: నెట్టింట ఎక్కువగా చర్చించిన యాక్టర్లలో మనోళ్లే టాప్.. ఆస్కార్ ఈవెంట్ మొత్తం ఆర్ఆర్ఆర్ హవా

Maragani Govardhan HT Telugu
Mar 14, 2023 12:09 PM IST

Top Mentioned Actors: ఆస్కార్ ఈవెంట్ అంతా ఆర్ఆర్ఆర్ హవా నడించింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. గత 24 గంటల్లో నెట్టింట ఎక్కువగా చర్చించుకున్న నటుల్లో ఎన్టీఆర్ అగ్రస్థానంలో నిలిచారు.

గత 24 గంటల్లో నెట్టింట ఎక్కువగా చర్చించుకున్న యాక్టర్‌గా ఎన్టీఆర్
గత 24 గంటల్లో నెట్టింట ఎక్కువగా చర్చించుకున్న యాక్టర్‌గా ఎన్టీఆర్
  • Top Mentioned Actors: ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 95వ అకాడమీ అవార్డుల కార్యక్రమం సోమవారం ముగిసిన సంగతి తెలిసిందే. అమెరికా లాస్ ఏంజెల్స్‌లో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకపై గత 24 గంటల్లో విపరీతంగా బజ్ నడిచింది. ఆస్కార్ అవార్డుల గ్రహీతల కోసం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. గత 24 గంటల పాటు ఆస్కార్ అవార్డుల గ్రహీతలు ట్రెండింగ్‌లో నిలిచారు. అయితే ఆస్కార్ ఈవెంట్లకు సంబంధించి సోషల్ మీడియాలో, వార్తల్లో ఎక్కువగా చర్చించుకున్న నటులుగా ఆర్ఆర్ఆర్ హీరోలు అగ్రస్థానంలో నిలిచారు.

అందరికంటే ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ నెటిజన్లు చర్చించుకున్నారట. సిలికాన్ వ్యాలికాన్‌కు చెందిన ప్రముఖ ఏఐ మార్కెట్ ఇంటెలిజెన్స్ కంపెనీ నెట్ బేస్ క్వాడ్ ఈ జాబితాను విడుదల చేసింది. సోషల్ మీడియాలో అత్యధికంగా చర్చిచుకున్న యాక్టర్లలో తారక్ అగ్రస్థానంలో నిలవగా.. రామ్ చరణ్ రెండో స్థానంలో ఉన్నారు. మూడో పొజిషన్‌లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా ఆస్కార్ గెల్చుకున్న కే హుయే క్వాన్ నిలిచారు. ఆ తర్వాత బెస్ట్ యాక్టర్‌గా నిలిచిన బ్రెండన్ ఫ్రేజర్, మెక్సికన్ నటుడు పెడ్రో పాస్కల్ ఐదో స్థానంలో ఉన్నాడు.

ఈ ఇంటెలిజెన్స్ సంస్థ యాక్టర్లతో పాటు యాక్ట్రెస్ జాబితాను కూడా విడుదల చేసింది. గత 24 గంటల్లో అత్యధికంగా సోషల్ మీడియాలో చర్చించుకున్న నటి వచ్చేసి ఆస్కార్ ఉత్తమ నటిగా నిలిచిన మిషెల్ యో నిలవగా.. రెండో స్థానంలో పాప్ సింగర్ లేడీ గాగా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఏంజెల్ బాసెట్, ఎలిజెబిత్ ఓల్సెన్, జేమీ లీ కర్టిస్ నిలిచారు.

ఆస్కార్ వేడుకలో సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చించుకున్న సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఆ తర్వాత బెస్ట్ డాక్యూమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా ఆస్కార్ దక్కించుకున్న ది ఎలిఫెండ్ విస్పరర్స్ నిలిచింది. మూడో స్థానంలో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్.. ఆ తర్వాత ఆల్ క్వైట్ వెస్టర్న్ ఫ్రంట్, ఐదో స్థానంలో అర్జెంటీనా 1985 చిత్రం నిలిచింది.

Whats_app_banner