Tom Cruise stunt leaked video: ప్రాణాలకు తెగించి టామ్‌ క్రూజ్‌ స్టంట్‌.. లీకైన వీడియో-tom cruise leaked video from mission impossible 7 going viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tom Cruise Stunt Leaked Video: ప్రాణాలకు తెగించి టామ్‌ క్రూజ్‌ స్టంట్‌.. లీకైన వీడియో

Tom Cruise stunt leaked video: ప్రాణాలకు తెగించి టామ్‌ క్రూజ్‌ స్టంట్‌.. లీకైన వీడియో

Hari Prasad S HT Telugu
Sep 06, 2022 05:50 PM IST

Tom Cruise stunt leaked video: ప్రాణాలకు తెగించి టామ్‌ క్రూజ్‌ చేసిన ఓ స్టంట్‌ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మిషన్‌ ఇంపాజిబుల్‌ 7 కోసం అతడు చేసి స్టంట్‌ వీడియో లీకైంది.

విమానంపై టామ్ క్రూజ్ స్టంట్
విమానంపై టామ్ క్రూజ్ స్టంట్ (Video Grab)

Tom Cruise stunt leaked video: హాలీవుడ్‌ స్టార్‌ హీరో టామ్ క్రూజ్‌ ప్రస్తుతం మిషన్‌ ఇంపాజిబుల్‌ 7 డెడ్‌ రెకనింగ్‌ పార్ట్‌ 1 మూవీలో నటిస్తున్నాడు. ఈ మిషన్‌ ఇంపాజిబుల్‌ సిరీస్‌తో అతడు ఎంత బజ్‌ క్రియేట్‌ చేశాడో మనకు తెలిసిందే. ఈ సినిమాల కోసం ఎన్నో యాక్షన్‌ స్టంట్స్ చేశాడు. అయితే తాజాగా అతడు చేసిన మిడ్‌ ఎయిర్‌ స్టంట్‌ మాత్రం హైలైట్‌ అని చెప్పాలి.

గాల్లో ఎగురుతున్న విమానంలో నుంచి లేచి నిలబడి అతడు మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో లీకైంది. ప్రాణాలకు తెగించి అతడు చేసి ఈ స్టంట్‌ వీడియో వైరల్‌ అవుతోంది. స్పై థ్రిల్లర్‌ అయిన మిషన్‌ ఇంపాజిబుల్‌ 7 మూవీని క్రిస్టొఫర్ మెక్‌క్వారీ డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ మధ్యే టాప్‌ గన్‌ మావెరిక్‌ మూవీతో పెద్ద హిట్‌ అందుకున్న టామ్‌ క్రూజ్‌.. ఇప్పుడీ ఎంఐ7లో నటిస్తున్నాడు.

షూటింగ్‌ లొకేషన్‌ నుంచి లీకైన ఈ వీడియోలో టామ్‌ క్రూజ్‌ ఎలాంటి సేఫ్టీ లేకుండా ఎంతో ఎత్తులో కదులుతున్న విమానంపై ఇలా నిల్చోవడం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేసింది. వీడియో చివర్లో మరో విమానం కూడా దాని పక్కనే వచ్చి ఎగురుతుంటుంది. ఆ తర్వాత రెండు విమానాలు చాలా వేగంగా టర్న్‌ తీసుకొని వెళ్తాయి. ఆ సమయంలోనూ టామ్‌ క్రూజ్ విమానంపై అలాగే నిల్చొని కనిపిస్తాడు.

మిషన్‌ ఇంపాజిబుల్‌ 7 ఓ స్పై థ్రిల్లర్‌ కావడంతో ఇందులో ఇలాంటి స్టంట్స్‌ ఎన్నో టామ్‌ క్రూజ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. సీక్రెట్‌ ఏజెంట్‌ ఎథాన్‌ హంట్‌ క్యారెక్టర్‌లో టామ్‌ కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్‌ యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కూడా కనిపించనున్నాడన్న వార్తలు వచ్చినా.. డైరెక్టర్‌ వాటిని ఖండించాడు. ఈ సినిమాను టామ్‌ క్రూజ్‌ నిర్మిస్తుండగా.. వచ్చే ఏడాది జులై 14న రిలీజ్‌ కానుంది. దీని సీక్వెల్‌ కూడా రానుండగా.. అది 2024లో రిలీజయ్యే ఛాన్స్‌ ఉంది.

IPL_Entry_Point

టాపిక్