Hollywood: 2022లో హాలీవుడ్‌ పెద్ద సినిమాలు ఇవే-these are the most awaited hollywood movies to be released in 2022 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hollywood: 2022లో హాలీవుడ్‌ పెద్ద సినిమాలు ఇవే

Hollywood: 2022లో హాలీవుడ్‌ పెద్ద సినిమాలు ఇవే

Hari Prasad S HT Telugu
Feb 03, 2022 02:37 PM IST

2022లో రాబోతున్న హాలివుడ్ మూవీస్‌లో చాలా వరకూ గతంలో సంచలనాలు సృష్టించిన సినిమాలకు సీక్వెల్స్‌ ఉన్నాయి. అవతార్‌, బ్లాక్‌ పాంథర్‌, జురాసిక్‌ వరల్డ్‌ వంటి గతంలో వచ్చిన హాలీవుడ్‌ సినిమాలకు 2022లో సీక్వెల్స్‌ రాబోతున్నాయి. నిజానికి ఈ మూవీస్‌లో కొన్ని గత రెండేళ్లుగా రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్నవీ ఉన్నాయి.

అవతార్ సీక్వెల్
అవతార్ సీక్వెల్

కరోనా కారణంగా 2020, 2021లలో ప్రపంచవ్యాప్తంగా పెద్ద సినిమాల రిలీజ్ అంతగా లేదు. అయితే హాలీవుడ్‌లో చాలా రోజులుగా ఎదురు చూస్తున్న కొన్ని పెద్ద సినిమాలు 2022లో రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాల రిలీజ్‌ డేట్లు కూడా వచ్చేశాయి. వీటిలో చాలా వరకూ గతంలో సంచలనాలు సృష్టించిన సినిమాలకు సీక్వెల్స్‌ ఉన్నాయి. అవతార్‌, బ్లాక్‌ పాంథర్‌, జురాసిక్‌ వరల్డ్‌ వంటి గతంలో వచ్చిన హాలీవుడ్‌ సినిమాలకు 2022లో సీక్వెల్స్‌ రాబోతున్నాయి.  మరి ఆ సినిమాలు ఏంటి? అవి ఎప్పుడు రిలీజ్‌ కాబోతున్నాయో ఒకసారి చూద్దాం.

ద బ్యాట్‌మ్యాన్‌

బ్యాట్‌ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న ఈ లేటెస్ట్‌ మూవీలో రాబర్ట్‌ పాటిన్‌సన్‌ బ్యాట్‌మ్యాన్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా 2022 మార్చి 4న రిలీజ్‌ కానుంది. మ్యాట్‌ రీవ్స్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

జాన్‌ విక్‌: చాప్టర్‌ 4

ఇక జాన్‌విక్‌ ఫ్రాంచైజీలో రాబోతున్న నాలుగో మూవీ జాన్‌ విక్‌: చాప్టర్‌ 4 మూవీ మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

జురాసిక్‌ వరల్డ్‌ : డొమినియన్‌

జురాసిక్‌ పార్క్‌ సినిమా సిరీస్‌లో ఆరో భాగంగా వస్తున్న మూవీ జురాసిక్‌ వరల్డ్‌ : డొమినియన్‌. ఈ మూవీ 2022 జూన్‌ 10న రిలీజ్‌ కాబోతోంది. చివరిసారి 2018లో వచ్చిన జురాసిక్‌ వరల్డ్‌ : ఫాలెన్‌ కింగ్‌డమ్‌కు ఇది సీక్వెల్‌.

మిషన్‌: ఇంపాజిబుల్‌ 7

హాలీవుడ్‌ స్టార్‌ హీరో టామ్‌ క్రూజ్‌ 2022లో కనిపించబోతున్న రెండో సినిమా ఇది. అతను నటించిన టాప్‌గన్‌: మ్యావెరిక్‌ మూవీ మే 27న రిలీజ్ కానుండగా.. మిషన్‌: ఇంపాజిబుల్‌ ఫ్రాంఛైజీలో రాబోతున్న ఏడో మూవీ సెప్టెంబర్‌ 30 రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

స్పైడర్‌మ్యాన్‌: ఇన్‌టు ద స్పైడర్‌-వెర్స్‌ 2

2018లో వచ్చిన స్పైడర్‌-వెర్స్‌కు ఇది సీక్వెల్‌. ఆ ఏడాది బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా ఆస్కార్‌ గెలుచుకున్న ఈ మూవీ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. 2022 అక్టోబర్‌ 7న స్పైడర్‌మ్యాన్‌: ఇన్‌టుద స్పైడర్‌-వెర్స్‌ 2 రిలీజ్‌ కానుంది.

బ్లాక్‌ పాంథర్‌ : వాకండా ఫరెవర్‌

2018లో బెస్ట్‌ పిక్చర్‌ ఆస్కార్‌ కోసం నామినేట్‌ అయిన తొలి సూపర్‌హీరో మూవీ అయిన బ్లాక్ పాంథర్‌కు ఇది సీక్వెల్‌. ఈ మూవీ నవంబర్ 11న రిలీజ్‌ కానుంది. 2022లో మార్వెల్‌ నుంచి వస్తున్న మూడో సినిమా ఇది. థోర్‌తోపాటు డాక్టర్‌ స్ట్రేంజ్‌ సీక్వెల్‌ కూడా మే 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అవతార్‌ 2

13 ఏళ్ల కిందట జేమ్స్‌ కేమరాన్‌.. అవతార్‌తో చూపించిన పండోరా ప్రపంచం అవతార్‌ 2తో మరోసారి మన ముందుకు రానుంది. ఈ మూవీ 2022 డిసెంబర్‌ 16న రిలీజ్ కానుంది. మొత్తం ఐదు భాగాలుగా అవతార్‌ రానుండగా.. మిగతావి ఒక్కోటి రెండేళ్ల గ్యాప్‌తో రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం