Mission Impossible 7 Trailer | అదిరిపోయే స్టంట్స్‌తో దుమ్మురేపిన టామ్‌ క్రూజ్‌-tom cruises mission impossible 7 trailer is out now ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mission Impossible 7 Trailer | అదిరిపోయే స్టంట్స్‌తో దుమ్మురేపిన టామ్‌ క్రూజ్‌

Mission Impossible 7 Trailer | అదిరిపోయే స్టంట్స్‌తో దుమ్మురేపిన టామ్‌ క్రూజ్‌

HT Telugu Desk HT Telugu
May 24, 2022 08:41 PM IST

మిషన్‌ ఇంపాజిబుల్‌ ఫ్రాంఛైజీకి ప్రపంచవ్యాప్తంగా ఈ రేంజ్‌లో ఫ్యాన్స్‌ ఎందుకు ఉంటారో తాజా ట్రైలర్‌ చూస్తే తెలుస్తుంది. అదిరిపోయే స్టంట్స్‌తో దుమ్ము రేపాడు ఏజెంట్‌ ఈథన్‌ హంట్‌.

మిషన్ ఇంపాజిబుల్ ట్రైలర్లో ఓ స్టంట్
మిషన్ ఇంపాజిబుల్ ట్రైలర్లో ఓ స్టంట్ (Youtube)

ఏజెంట్ ఈథన్‌ హంట్‌ (టామ్‌ క్రూజ్‌) మళ్లీ వచ్చేస్తున్నాడు. ఈసారి మిషన్‌: ఇంపాజిబుల్‌ - డెడ్‌ రెకనింగ్‌ పార్ట్‌ వన్‌తో ఈ యాక్షన్‌ ఫ్రాంచైజీ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేయడానికి వస్తోంది. ఇంపాజిబుల్‌ మిషన్స్‌ ఫోర్స్‌కు చెందిన ఈథన్‌ హంట్‌ మరో కొత్త విలన్‌ వేటలో పడ్డాడు. ఒళ్లు గగుర్పొడిచే స్టంట్‌లు, చేజింగ్‌లతో ట్రైలర్‌ మొత్తాన్నీ యాక్షన్‌ ప్యాక్డ్‌ సీన్స్‌తో నింపేశారు.

వెనిస్‌, వాటికన్‌లాంటి నగరాల్లో ఈ మూవీ షూటింగ్‌ చేశారు. ట్రైలర్‌ మొదట్లోనే యూజీన్‌ కిట్రిడ్జ్‌ క్యారెక్టర్‌ ఏజెంట్‌ హంట్‌కు హితబోధ చేసే డైలాగ్‌ ఉంటుంది. మంచి కోసం నువ్వు ఫైట్‌ చేసే రోజులు పోయాయి అంటూ చెబుతూ వెళ్తాడు. ఆ తర్వాత ఇక ట్రైలర్‌ మొత్తం యాక్షన్‌ సీన్సే ఉన్నాయి. మిషన్‌ ఇంపాజిబుల్‌ ఫ్రాంఛైజీకి మాత్రమే సాధ్యమయ్యే స్టంట్స్‌ ఫ్యాన్స్‌ను అలరిస్తాయి.

వచ్చే ఏడాది జులై 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 29 కోట్ల డాలర్ల (సుమారు రూ.2250 కోట్లు) భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. కొవిడ్‌ కారణంగా ఈ మూవీ బడ్జెట్‌ అంచనాలను మించిపోయింది.

IPL_Entry_Point

టాపిక్