తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kota Srinivasa Rao Denies Rumours: డబ్బుల కోసం మనుషుల ప్రాణాలతో ఆడుకోవ‌ద్దు - పుకార్ల‌ను ఖండించిన‌ కోట శ్రీనివాస‌రావు

Kota Srinivasa Rao Denies Rumours: డబ్బుల కోసం మనుషుల ప్రాణాలతో ఆడుకోవ‌ద్దు - పుకార్ల‌ను ఖండించిన‌ కోట శ్రీనివాస‌రావు

21 March 2023, 11:30 IST

  • Kota Srinivasa Rao Denies Rumours: టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు కోట శ్రీనివాస‌రావు చ‌నిపోయాడంటూ మంగ‌ళ‌వారం సోష‌ల్ మీడియాలో పుకార్లు వినిపించాయి. ఈ అస‌త్య వార్త‌ల‌ను కోట శ్రీనివాస‌రావు స్వ‌యంగా ఖండించారు. ఓ వీడియోను రిలీజ్ చేశారు.

కోట శ్రీనివాస‌రావు
కోట శ్రీనివాస‌రావు

కోట శ్రీనివాస‌రావు

Kota Srinivasa Rao Denies Rumours: తాను క్షేమంగా ఉన్నాన‌ని, సోష‌ల్ మీడియాలో వ‌స్తోన్న‌ వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు కోట శ్రీనివాస‌రావు పేర్కొన్నాడు. కోటి శ్రీనివాస‌రావు చ‌నిపోయాడంటూ మంగ‌ళ‌వారం సోష‌ల్ మీడియాలో వార్త‌లొచ్చాయి. ఈ పుకార్ల‌ను ఆయ‌న స్వ‌యంగా ఖండించారు. ఓ వీడియోను రిలీజ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

Aa Okkati Adakku Collections: బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్కటి అడక్కు మూవీ జోరు.. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా..

Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఎక్కడ చూడొచ్చంటే..

Gam Gam Ganesha: ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే మంచి క్రైమ్ కామెడీ మూవీ: డైరెక్టర్

జీవితంలో డ‌బ్బు సంపాదించాడ‌ని ఎన్నో మార్గాలు ఉన్నాయ‌ని మ‌నిషుల ప్రాణాల‌తో ఆడుకుంటూ సొమ్ము చేసుకోవాల‌ని అనుకోవ‌డం స‌రికాద‌ని కోట శ్రీనివాస‌రావు పేర్కొన్నాడు. ఉగాది పండుగ ఏర్పాట్ల‌లో ఉండ‌గా త‌న క్షేమ స‌మాచారాలు క‌నుక్కోవ‌డం కోసం యాభైకిపై ఫోన్స్ వ‌చ్చాయ‌ని అప్పుడే సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోన్న ఈ దుష్ప్ర‌చారం గురించి త‌న‌కు తెలిసింద‌ని కోట శ్రీనివాస‌రావు అన్నారు.

సెక్యూరిటీ కోసం ప‌ది మంది పోలీసులు త‌న ఇంటికి వ‌చ్చార‌ని తెలిపాడు. ఇలాంటి పుకార్ల‌ను అరిక‌ట్టాల్సిన బాధ్య‌త ప్ర‌జ‌ల‌తో పాటు పోలీసుల‌పై ఉంద‌ని కోట శ్రీనివాస‌రావు అన్నారు. సోష‌ల్ మీడియాలో వినిపిస్తోన్న పుకార్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని, తాను క్షేమంగానే ఉన్న‌ట్లు తెలిపాడు.

తెలుగులో వెర్స‌టైల్ యాక్ట‌ర్‌గా పేరుతెచ్చుకున్నారు కోట శ్రీనివాస‌రావు. విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాలు చేశారు. ప్ర‌స్తుతం వృద్ధాప్యం కార‌ణంగా సినిమాల సంఖ్య‌ను త‌గ్గించారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.