Suhas: జూనియర్ ఆర్టిస్ట్‌గా వంద రూపాయలు - హీరోగా మూడు కోట్లు - రెమ్యునరేషన్‌పై సుహాస్ కామెంట్స్
07 March 2024, 15:14 IST
Suhas: బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో హీరోగా సుహాస్ తన రెమ్యునరేషన్‌ను పెంచినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ రెమ్యునరేషన్ పెంపుపై సుహాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
సుహాస్
Suhas: డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ హీరోగా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌ను అందుకుంటున్నాడు సుహాస్. కలర్ ఫోటో మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుహాస్ తొలి సినిమాలోనే నాచురల్ యాక్టింగ్‌తో మెప్పించాడు. బెస్ట్ తెలుగు మూవీగా కలర్ ఫొటో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నది.
గత ఏడాది రిలీజైన రైటర్ పద్మభూషన్‌తో తెలుగు ప్రేక్షకుల్ని నవ్వించాడు. ఇటీవల అంబాజీపేట మ్యారేజీ బ్యాండుతో హీరోగా వైవిధ్యతను చాటుకున్నాడు. కామెడీ పాత్రలే కాకుండా సీరియస్ రోల్స్ కు న్యాయం చేయగలడని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో కుల వివక్ష కారణంగా అన్యాయానికి గురైన యువకుడి పాత్రలో సహాన్ నటనకు ప్రశంసలు దక్కాయి. థియేటర్లతో పాటు ఓటీటీలో ఈ మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నది.
ప్రసన్నవదనం టీజర్ లాంఛ్...
హ్యాట్రిక్ హిట్స్‌తో సుహాస్ తన రెమ్యునరేషన్‌ను పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. రెమ్యునరేషన్ వార్తలపై ప్రసన్నవదనం టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో సుహాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రెమ్యునరేషన్ పెంచింది నిజమేనని సుహాస్ అన్నాడు.
రోజుకు వంద రూపాయలు...
జూనియర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ మొదలైందని సుహాస్ తెలిపాడు.జూనియర్ ఆర్టిస్ట్‌గా రోజుకు వంద రూపాయలు రెమ్యునరేషన్ అందుకున్నాను. నేను బతకాలంటే రెమ్యునరేషన్ పెంచాలిగా అంటూ తెలిపాడు. తన రెమ్యునరేషన్ వెయ్యి రూపాయల నుంచి మూడు కోట్ల వరకు పెరిగింది అంటూ సుహాస్ తెలిపాడు. ఆ తర్వాత మూడు కోట్లు అన్నది ఓ నంబర్ మాత్రమేనంటూ మాట మార్చేశాడు. రెమ్యునరేషన్‌పై సుహాస్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
ఫస్ట్ టైమ్ లిప్‌లాక్...
ఇప్పటివరకు ఏ సినిమాలో చేయనది ప్రసన్నవదనం సినిమాలో చేశానని సుహాస్ అన్నాడు. లిప్‌లాక్ సీన్‌లో నటించానని చెప్పాడు. లిప్‌లాక్ సీన్స్ ఎప్పటికీ చేయకూడదని అనుకున్నాను. కానీ కథ డిమాండ్ మేరకు ఈ సినిమాలో లిప్‌లాక్ సీన్ చేయాల్సివచ్చిందని సుహాస్ చెప్పాడు. లిప్‌లాక్ గురించి చెప్పడానికే సిగ్గేస్తుందని సుహాస్ పేర్కొన్నాడు.
ఐదు సినిమాల్లో...
ప్రస్తుతం సుహాస్ ఐదు సినిమాల్లో హీరోగా నటిస్తోన్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రిలీజ్‌లు కావడం కరెక్ట్ కాదని, ఈ ఏడాది చివరి నుంచి సినిమాల వేగాన్ని తగ్గించుకోవాలని అనుకుంటున్నట్లు సుహాస్ చెప్పాడు. ఇక నుంచి ఏడాదికి మూడు సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు చెప్పాడు.
ఆనందరావు అడ్వెంచర్స్…
ప్రస్తుతం ప్రసన్నవదనంతో పాటు కేబుల్ రెడ్డి, ఆనందరావు అడ్వెంచర్స్, శ్రీరంగనీతులు సినిమాల్లో సుహాస్ హీరోగా కనిపించబోతున్నాడు. గొర్రెపురాణం సినిమాలో అతిథి పాత్ర చేశాడు. ఈ సినిమాలన్నీ ఈ ఏడాదిలోనే రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పడి పడి లేచే మనసు…
కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సుహాస్ కెరీర్ మొదలైంది. పడి పడి లేచే మనసు సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన సుహాస్ మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండగే, రంగ్‌దే సినిమాల్లో కామెడీ రోల్స్ చేశాడు. అడివి శేష్ హీరోగా నటించిన హిట్ 2లో సైకో కిల్లర్‌గా విలన్ రోల్ చేశాడు.