Geethanjali Malli Vachindi:శ్మ‌శాన వాటికలో టీజ‌ర్ లాంఛ్ - గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది టీమ్‌ను ట్రోల్ చేస్తోన్న నెటిజ‌న్లు-anjali horror movie geethanjali malli vachindi teaser to be launched in begumpet graveyard ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Geethanjali Malli Vachindi:శ్మ‌శాన వాటికలో టీజ‌ర్ లాంఛ్ - గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది టీమ్‌ను ట్రోల్ చేస్తోన్న నెటిజ‌న్లు

Geethanjali Malli Vachindi:శ్మ‌శాన వాటికలో టీజ‌ర్ లాంఛ్ - గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది టీమ్‌ను ట్రోల్ చేస్తోన్న నెటిజ‌న్లు

Nelki Naresh Kumar HT Telugu
Feb 22, 2024 10:42 AM IST

Geethanjali Malli Vachindi: అంజ‌లి హీరోయిన్‌గా న‌టిస్తోన్న హార‌ర్ మూవీ గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది టీజ‌ర్‌ను బేగంపేట శ్మ‌శాన వాటిక‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. హార‌ర్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు కోన వెంక‌ట్ క‌థ‌, స్క్రీన్‌ప్లే అందిస్తోన్నారు.

అంజ‌లి  గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది టీజ‌ర్‌
అంజ‌లి గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది టీజ‌ర్‌

Geethanjali Malli Vachindi: అంజ‌లి హీరోయిన్‌గా న‌టిస్తోన్న గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది టీజ‌ర్ లాంఛ్ ఈవెంట్‌ను మేక‌ర్స్ స్పెష‌ల్‌గా ప్లాన్ చేశారు. ఈ హార‌ర్ మూవీ టీజ‌ర్‌ను శ్మ‌శాన వాటిక‌లో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఫిబ్ర‌వ‌రి 24న‌ శ‌నివారం బేగంపేట‌లోని శ్మ‌శాన వాటిక‌లో రాత్రి ఏడు గంట‌ల‌కు టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మూవీ టీమ్‌ ప్ర‌క‌టించింది. ఓ వీడియో ద్వారా టీజ‌ర్ రిలీజ్ డేట్‌ను వెల్ల‌డించారు. ఇందులో బేగంపేట శ్మ‌శాన వాటిక‌ను చూపించారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

నెటిజ‌న్ల ట్రోల్స్‌...

శ్మాశ‌న వాటిక‌లో టీజ‌ర్ లాంఛ్ ఈవెంట్‌ను జ‌రుప‌నుండ‌టంపై నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. ఇదే క్రియేటివిటీ అంటూ విమ‌ర్శిస్తున్నారు. పిచ్చి పీక్స్‌కు చేర‌డం అంటే ఇదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎంత హార‌ర్ మూవీ అయితే శ్మాశ‌న వాటిక‌లో టీజ‌ర్ రిలీజ్ చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని అంటున్నారు.

గీతాంజ‌లి సీక్వెల్‌...

2014లో రిలీజైన హార‌ర్ మూవీ గీతాంజ‌లికి సీక్వెల్‌గా గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది మూవీ తెర‌కెక్కుతోంది.గీతాంజ‌లిలో అంజ‌లితో పాటు శ్రీనివాస‌రెడ్డి, స‌త్యం రాజేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. అంజ‌లి, శ్రీనివాస‌రెడ్డితో పాటు గీతాంజ‌లిలో న‌టించిన న‌టీన‌టులు చాలా వ‌ర‌కు గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చిందిలో క‌నిపించ‌బోతున్నారు. హార‌ర్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి శివ‌తుర్ల‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ద‌ర్శ‌కుడిగా అత‌డికి ఇదే ఫ‌స్ట్ మూవీ. గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది సినిమాకు కోన వెంక‌ట్ క‌థ‌, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ ప‌తాకాల‌పై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ నిర్మిస్తున్నారు.

అంజ‌లి 50వ సినిమా...

అంజ‌లి హీరోయిన్‌గా న‌టిస్తోన్న 50వ మూవీ ఇది. ఇటీవ‌లే ఈ సినిమాలో అంజ‌లి ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో పాడుబ‌డిన భ‌వంతిలో నాట్య‌కారిణి గెట‌ప్‌లో అంజ‌లి క‌నిపించింది. ఈ పోస్ట‌ర్ వైర‌ల్ అయ్యింది. వేస‌వి కానుక‌గా మార్చి లేదా ఏప్రిల్‌లో తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది సినిమాను రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తోన్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్‌...

గ‌త కొంత‌కాలంగా హీరోయిన్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటోన్న అంజ‌లి డిఫ‌రెంట్ రోల్స్ చేస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్‌సాబ్‌లో కీల‌క పాత్ర చేసింది. నితిన్ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో స్పెష‌ల్ సాంగ్‌లో ఆడిపాడింది. ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్‌తో పాటు విశ్వ‌క్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రిలో యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర‌లు చేస్తోంది అంజ‌లి.

తెలుగులో బ‌హిష్క‌ర‌ణ అనే వెబ్‌సిరీస్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. త‌మిళం, మ‌ల‌యాళంలో మంచి అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటోంది అంజ‌లి. నివీన్ పాల్, అంజ‌లి హీరోహీరోయిన్లుగా న‌టించిన య‌జు కాద‌ల్ య‌జు మ‌లై మూవీ ఇటీవ‌ల రోట‌ర్‌డామ్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో స్ట్రీనింగ్ అయ్యింది.

Whats_app_banner