True Lover Movie:ఈగల్‌కు పోటీగా డైరెక్టర్ మారుతి మూవీ రిలీజ్ - బేబీ లాంటి కల్ట్ లవ్ స్టోరీ అంటోన్న నెటిజన్లు
True Lover Release Date:ఫిబ్రవరి 9 రేసులోకి మరో మూవీ వచ్చింది. డైరెక్టర్ మారుతి, బేబీ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ కలిసి రిలీజ్ చేస్తోన్న ట్రూ లవర్ మూవీ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
True Lover Release Date: రవితేజ ఈగల్‌కు పోటీగా ఫిబ్రవరి 9న మరో మూవీ రేసులోకి వచ్చింది. ట్రూ లవర్ మూవీ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ తమిళ డబ్బింగ్ మూవీని డైరెక్టర్ మారుతి, బేబీ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ కలిసి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మణికందన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీలో మ్యాడ్ ఫేమ్ శ్రీగౌరిప్రియ హీరోయిన్‌గా నటిస్తోంది. ట్రూ లవర్ సినిమా టీజర్‌ను సోమవారం రిలీజ్ చేశారు. యూత్‌ఫుల్ రొమాంటిక్ అంశాలతో టీజర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది.
ఓ యువ జంట మధ్య ఈగోలు, అపార్థాలు, అపోహలతో ఈ సినిమా తెరకెక్కింది.ఎస్‌కేఎన్ ప్రొడ్యూస్ చేసిన బేబీ మూవీ లాగే ట్రూ లవర్ కూడా కల్ట్ లవ్ స్టోరీ అయ్యే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తోన్నాయిన తెలుగు టీజర్‌పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ట్రూ లవర్ మూవీకి ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈగల్‌తో పోటీ తప్పలేదు....
సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈగల్‌ను ఫిబ్రవరి 9కి వాయిదావేసిన సంగతి తెలిసిందే. ఈగల్‌కు సోలో రిలీజ్ డేట్ ఇప్పిస్తామనే ప్రొడ్యూసర్స్, గిల్డ్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ మాత్రం అమలు అయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఫిబ్రవరి 8న వైఎస్ జగన్ బయోపిక్ యాత్ర 2 రిలీజ్ అవుతోంది. అలాగే ఫిబ్రవరి 9న రజనీకాంత్ లాల్ సలాం కూడా ప్రేక్షకుల ముందుకొస్తుంది. వీటితో పాటు తాజాగా ట్రూ లవర్ కూడా ఫిబ్రవరి 9 రేసులోకి రావడం ఆసక్తికరంగా మారింది.
అయితే ఈ పోటీపై ట్రూ లవర్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో మారుతి, ఎస్‌కేఎన్ ఆసక్తికర సమాధానం చెప్పారు. ఈ లవ్ స్టోరీ మూవీ వాలెంటైన్స్ వీక్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే మంచిదనే ఆలోచనతో తమిళ మేకర్స్ ఫిబ్రవరి 9ని రిలీజ్ డేట్‌గా ఫిక్స్ చేశారని ఎస్‌కేఎన్ అన్నాడు. . తమిళంలో రిలీజ్ డేట్ మార్చితేనే తెలుగులో మారే అవకాశం ఉందని ఎస్‌కేఎన్ చెప్పాడు. అందుకే మాకు ఛాయిస్, అప్షన్ రెండు లేకపోవడంతోనే ట్రూ లవర్‌ను ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు మారుతి తెలిపాడు.
బేబీ లాంటి మూవీ...
మారుతి జర్నీ డబ్బింగ్ సినిమాలతోనే మొదలైందని ఎస్‌కేఎన్ అన్నాడు. ప్రేమిస్తే మూవీతో ఫస్ట్ హిట్‌ను అందుకొని ఆ తర్వాత స్ట్రెయిట్ సినిమాలు చేశాడని ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో చెప్పాడు. బేబీ సినిమా చూస్తున్నప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యానో అంతే ఎగ్జైట్‌మెంట్ నాకు ట్రూ లవర్ కలిగించిందని ఎస్‌కేఎన్ చెప్పాడు. కాంటేంపరరీ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీ బేబీ లాగే పెద్ద హిట్టవుతుందనే నమ్మకముందని తెలిపాడు.
గుడ్‌నైట్ తర్వాత...
గుడ్‌నైట్ సినిమాతో హీరోగా గత ఏడాది తమిళంలో పెద్ద బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు మణికందన్. గుడ్‌నైట్ తర్వాత మణికందన్ హీరోగా నటిస్తోన్న మూవీ ఇది. మ్యాడ్‌తో తొలి అడుగులోనే శ్రీగౌరిప్రియ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది. ట్రూ లవర్ సినిమాలో కన్నరవి, శరవణన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు మారుతి ప్రభాస్‌తో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. సూపర్ నాచురల్ హారర్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.