తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mad Square: టిల్లూ స్క్వేర్ పోయి మ్యాడ్ స్క్వేర్ వచ్చె.. మరో సీక్వెల్ వచ్చేస్తోంది

Mad Square: టిల్లూ స్క్వేర్ పోయి మ్యాడ్ స్క్వేర్ వచ్చె.. మరో సీక్వెల్ వచ్చేస్తోంది

Hari Prasad S HT Telugu

19 April 2024, 20:56 IST

google News
    • Mad Square: టిల్లూ స్క్వేర్ బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ ఇంకా తగ్గనే లేదు.. అప్పుడే మరో స్క్వేర్ వచ్చేస్తోంది. ఈసారి మ్యాడ్ సీక్వెల్ ను మ్యాడ్ స్క్వేర్ గా తీసుకొస్తున్నారు.
టిల్లూ స్క్వేర్ పోయి మ్యాడ్ స్క్వేర్ వచ్చె.. మరో సీక్వెల్ వచ్చేస్తోంది
టిల్లూ స్క్వేర్ పోయి మ్యాడ్ స్క్వేర్ వచ్చె.. మరో సీక్వెల్ వచ్చేస్తోంది

టిల్లూ స్క్వేర్ పోయి మ్యాడ్ స్క్వేర్ వచ్చె.. మరో సీక్వెల్ వచ్చేస్తోంది

Mad Square: డీజే టిల్లూ మూవీకి సీక్వెల్ గా టిల్లూ స్కేర్ అంటూ వచ్చి రెట్టింపు నవ్వులను అందించాడు సిద్దూ జొన్నలగడ్డ. ఇప్పుడీ మూవీ మేకర్సే తమ మరో హిట్ సినిమా మ్యాడ్ సీక్వెల్ తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు మ్యాడ్ స్క్వేర్ అనే టైటిల్ పెట్టడం విశేషం. గతేడాది రిలీజైన మ్యాడ్ మూవీకి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

మ్యాడ్ స్క్వేర్ మూవీ

టిల్లూ స్క్వేర్ మూవీ అందించిన సక్సెస్ తో ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఈ మూవీ మేకర్స్ సితార ఎంటర్‌టైన్మెంట్స్. ఇప్పుడదే ఊపులో మరో సినిమా సీక్వెల్ అనౌన్స్ చేశారు. టైటిల్ కలిసి రావడంతో ఈ కొత్త సీక్వెల్ కు కూడా మ్యాడ్ స్క్వేర్ అనే పేరు పెట్టారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. గతేడాది అక్టోబర్ లో రిలీజైన మ్యాడ్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

టిల్లూ స్క్వేర్ లాగే మ్యాడ్ స్క్వేర్ కూడా మ్యాజిక్ చేస్తుందన్న ఆశతో మేకర్స్ ఉన్నారు. నిజానికి డీజే టిల్లూ రిలీజైన రెండేళ్లకు టిల్లూ స్క్వేర్ వచ్చింది. గతేడాది సెప్టెంబర్ నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా సక్సెస్ అవుతుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే టిల్లూ గాడు ఈసారి కూడా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి రూ.130 కోట్ల వరకూ వసూలు చేశాడు.

సిద్దూ జొన్నలగడ్డ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇదే మ్యాడ్ మూవీకి సీక్వెల్ తీసుకురావాలన్న ఆలోచనను మేకర్స్ కు కలిగించింది. ఈ సినిమా థియేటర్లతోపాటు తర్వాత ఓటీటీలోనూ సక్సెసైంది. ఈ మూవీలో నార్నె నితిన్, సంగీత్ శోభన్ నటించారు.

ఏంటీ మ్యాడ్ మూవీ?

గతేడాది అక్టోబర్ లో ఈ మ్యాడ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మ్యాడ్ ద్వారా కొత్త క‌థ చెప్పాల‌నో, సందేశం ఇవ్వాల‌నో ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ శంక‌ర్ అనుకోలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు న‌వ్వించ‌డ‌మే ధ్యేయంగా పెట్టుకొని ఈ సినిమాను తెర‌కెక్కించారు. శుభం కార్డు వ‌ర‌కు న‌వ్వుల డోసు త‌గ్గ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డాడు. లాజిక్స్‌ అస‌లే ఫాలో కాకూడ‌ద‌ని ఫిక్స్ అయ్యాడు.

లాజిక్స్ విష‌యంలో నెగెటివ్ కామెంట్స్ వ‌స్తాయ‌ని ముందు జాగ్ర‌త్త‌గానే ఊహించి లాజిక్స్ గురించి సినిమాలో డైలాగ్ కూడా పెట్టాడు. సినిమాటిక్ రూల్స్ తో సంబంధం లేకుండా కామెడీ కోస‌మే క్రియేట్ చేసిన చాలా క్యారెక్ట‌ర్స్ సినిమాలో చాలా క‌నిపిస్తాయి.

మ్యాడ్ రెండు గంట‌ల పాటు క‌డుపుబ్బా న‌వ్వించే కామెడీ మూవీ. యూత్ ఆడియెన్స్ టార్గెట్ చేస్తూ తీసిన సినిమా ఇది. కొన్ని డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్ ఇబ్బంది పెడ‌తాయి. థియేటర్లలో రిలీజైన నెల రోజులకు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. అందులోనూ టాప్ ట్రెండింగ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.

డీజే టిల్లు, టిల్లూ స్క్వేర్ రెండూ యువతను లక్ష్యంగా చేసుకొని తీసిన సినిమాలే. రెండూ హిట్ అయ్యాయి. మ్యాడ్ విషయంలోనూ అదే రిపీటైంది. మరి సీక్వెల్ కూడా మేకర్స్ ఆశిస్తున్నట్లుగా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.

తదుపరి వ్యాసం