Mad Movie Review: మ్యాడ్ మూవీ రివ్యూ - ఎన్టీఆర్ బావమరిది ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టాడా?
Mad Movie Review: ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించిన మ్యాడ్ మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాడు.
Mad Movie Review: ఈ మధ్యకాలంలో తెలుగు ఆడియెన్స్ దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన చిన్న సినిమాల్లో మ్యాడ్ ఒకటి. ఈ సినిమాతో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి డైరెక్టర్ త్రివిక్రమ్ సతీమణి సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మించారు.
సంగీత్‌శోభన్, రామ్‌నితిన్ మరో హీరోలుగా నటించిన ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాడు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈసినిమా ఈ శుక్రవారం (అక్టోబర్ 6న) థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా ఎలా ఉందంటే...
మ్యాడ్ బ్యాచ్
అశోక్ (నార్నే నితిన్), మనోజ్ (రామ్ నితిన్) దామోదర్ అలియాస్ డీడీ (సంగీత్‌శోభన్) ఆర్ఐఈ అనే ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారు. ఒక్కొక్కరిది ఒక్కో మనస్తత్వం. అమ్మాయిల విషయంలో ముగ్గురు డిఫరెంట్‌గా ఆలోచిస్తుంటారు. వారి జీవితంలోకి శృతి (శ్రీగౌరిప్రియారెడ్డి), జెన్నీ(అనంతిక), రాధ (గోపిక ఉద్యాన్) వస్తారు.
ఈ ముగ్గురి అమ్మాయిల వల్ల అశోక్, మనోజ్, దామోదర్ జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ కు మ్యాడ్ అనే పేరు ఎందుకు వచ్చింది? సీనియర్స్‌తో పాటు మరో కాలేజీతో ఈ ముగ్గురికి ఎలాంటి గొడవలు వచ్చాయి? అన్నదే మ్యాడ్ మూవీ కథ.
హ్యాపీడేస్, కేరింత...
ఇంజినీరింగ్ కాలేజీ లవ్ స్టోరీస్,స్టూడెంట్స్ గొడవలు, ఫన్ కాన్సెప్ట్‌తో తెలుగు హ్యాపీడేస్, కేరింతతో పాటు చాలా సినిమాలొచ్చాయి. ఇలాంటి సినిమాల్లో కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది. కానీ ఫన్, ఎమోషన్స్‌ను పండించడంలో వేరియేషన్ చూపిస్తేనే ఈ సినిమాలు యూత్ ఆడియెన్స్‌ను మెప్పిస్తుంటాయి.
మ్యాడ్ ఆ కోవకు చెందిన సినిమానే. ముగ్గురు స్నేహితుల జీవితాలు, వారి లవ్ స్టోరీస్‌ను పూర్తిగా వినోదాత్మక కోణంలో చూపిస్తూ దర్శకుడు కళ్యాణ్ శంకర్ మ్యాడ్ సినిమాను తెరకెక్కించారు.
ఫన్ మాత్రమే టార్గెట్...
మ్యాడ్ ద్వారా కొత్త కథ చెప్పాలనో, సందేశం ఇవ్వాలనో దర్శకుడు కళ్యాణ్ శంకర్ అనుకోలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. శుభం కార్డు వరకు నవ్వుల డోసు తగ్గకుండా జాగ్రత్తపడ్డాడు. లాజిక్స్ అసలే ఫాలో కాకూడదని ఫిక్స్ అయ్యాడు.
లాజిక్స్ విషయంలో నెగెటివ్ కామెంట్స్ వస్తాయని ముందు జాగ్రత్తగానే ఊహించి లాజిక్స్ గురించి సినిమాలో డైలాగ్ కూడా పెట్టాడు. సినిమాటిక్ రూల్స్ తో సంబంధం లేకుండా కామెడీ కోసమే క్రియేట్ చేసిన చాలా క్యారెక్టర్స్ సినిమాలో చాలా కనిపిస్తాయి.
ఫ్యామిలీ ఆడియెన్స్...
యూత్ ఆడియెన్స్ టార్గెట్ చేస్తూ తీసిన సినిమా ఇది. ఫ్యామిలీ ప్రేక్షకుల్ని మెప్పించడం కష్టమే. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇబ్బంది పెడతాయి.
ఎన్టీఆర్ బావమరిది...
ఈ సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్. తన వయసుకు తగ్గ పాత్ర కావడంతో ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. యాక్టింగ్‌లో ఇంప్రూవ్ కావాలి. డ్యాన్సులు పరంగా మెప్పించాడు.
సంగీత్‌శోభన్ కామెడీ టైమింగ్ బాగుంది. రామ్‌నితిన్ మెప్పించాడు. టాక్సావాలీ విష్ణు, మురళీధర్ గౌడ్ క్యారెక్టర్ హిలేరియస్‌గా నవ్విస్తాయి. హీరోయిన్లు శ్రీ గౌరిప్రియారెడ్డి, అనంతిక, గోపిక కూడా పర్వాలేదనిపించారు. అతిథి పాత్రలో జాతి రత్నాలు దర్శకుడు మెరిశాడు.
త్రివిక్రమ్...
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో దర్శకుడు త్రివిక్రమ్ నిర్మించిన సినిమా కావడంతో చిన్న సినిమా అనే ఫీలింగ్ ఎక్కడ కలగదు. భారీ బడ్జెట్ మూవీ స్థాయిలోనే విజువల్స్, మ్యూజిక్ ఉన్నాయి.
ఫుల్ టైమ్‌పాస్...
మ్యాడ్ రెండు గంటల పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ. కథ, కథనాలు, లాజిక్స్ గురించి ఆలోచించకుండా చూస్తే ఫుల్ టైమ్‌పాస్ అవుతుంది.
బలాలు
కామెడీ
ముగ్గురు హీరోల యాక్టింగ్
ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్
బలహీనతలు
రొటన్ స్టోరీ
లాజిక్స్ లేకపోవడం