OTT hot and spicy movies: ఓటీటీల్లోని ఈ సినిమాలు చాలా హాట్.. ఒంటరిగానే చూడాలి.. ఎక్కడ చూడాలంటే?-hot and spicy movies on otts netflix prime video fifty shades of grey black instinct bitter moon and many more ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Hot And Spicy Movies: ఓటీటీల్లోని ఈ సినిమాలు చాలా హాట్.. ఒంటరిగానే చూడాలి.. ఎక్కడ చూడాలంటే?

OTT hot and spicy movies: ఓటీటీల్లోని ఈ సినిమాలు చాలా హాట్.. ఒంటరిగానే చూడాలి.. ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Apr 19, 2024 02:21 PM IST

OTT hot and spicy movies: ఓటీటీల్లో అన్ని జానర్ల సినిమాలు ఉన్నాయి. అందులో హాట్ అండ్ స్పైసీ సినిమాలకూ కొదవ లేదు. అయితే ఇప్పుడు చెప్పబోయే సినిమాలను ఒంటరిగానే చూడాలన్న విషయం గుర్తుంచుకోండి.

ఓటీటీల్లోని ఈ సినిమాలు చాలా హాట్.. ఒంటరిగానే చూడాలి.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీల్లోని ఈ సినిమాలు చాలా హాట్.. ఒంటరిగానే చూడాలి.. ఎక్కడ చూడాలంటే?

OTT hot and spicy movies: ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్ లకు అసలు కరవే లేకుండా పోయింది. అన్ని రకాలు సినిమాలు, షోలు ఇప్పుడు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఎవరూ లేనప్పుడు ఒంటరిగా చూడాల్సిన ఎ సర్టిఫికెట్ సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. వాటిలో బెస్ట్ మూవీస్ ఏంటో ఒకసారి చూద్దాం.

ఓటీటీల్లోని హాట్ మూవీస్ ఇవే

ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే - నెట్‌ఫ్లిక్స్

ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే మూవీ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. 2011లో ఇదే పేరుతో వచ్చిన నవల ఆధారంగా ఈ ఎరోటిక్ రొమాంటిక్ డ్రామా తెరకెక్కింది. సామ్ టేలర్-జాన్సన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో డకోటా జాన్సన్, జేమీ డార్నన్ నటించారు.

వైల్డ్ థింగ్స్ - ప్రైమ్ వీడియో

కాస్త స్పైస్‌తోపాటు క్రైమ్ థ్రిల్లర్ కూడా కావాలనుకుంటే ఈ వైల్డ్ థింగ్స్ మూవీ చూడొచ్చు. ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

బ్లాక్ ఇన్‌స్టింక్ట్ - నెట్‌ఫ్లిక్స్

బ్లాక్ ఇన్‌స్టింక్ట్ హాట్ సీన్లు ఉన్న ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. 1992లో ఈ మూవీ వచ్చింది. అయితే ఇప్పటికీ ఈ జానర్ లో మూవీకి మంచి డిమాండే ఉంది. సెక్స్ చేస్తున్న సందర్భంలో ఓ రాక్‌స్టార్ హత్యకు గురవడం, తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.

బిట్టర్ మూన్ - ప్రైమ్ వీడియో

ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగానే చూడాల్సిన సినిమా ఈ బిట్టర్ మూన్. ప్రైమ్ వీడియో ఓటీటీలో ఉంది. ఓ వీల్ చెయిర్ కే పరిమితమైన భర్త, అతని భార్య, వాళ్ల వింత స్టోరీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

అన్‌ఫేత్‌ఫుల్ - నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న ఈ సినిమా హాట్ అండ్ స్పైసీ జానర్ ప్రేక్షకులకు ఓ పండగే అని చెప్పాలి. ఓ పెళ్లయిన మహిళ కొత్త పరిచయమైన వ్యక్తిపై మోజుపడటం ఈ మూవీలో చూడొచ్చు.

రాగిని ఎంఎంఎస్ - ప్రైమ్ వీడియో

రాగిని ఎంఎంఎస్ ఓ హిందీ మూవీ. తన బాయ్‌ఫ్రెండ్ తో కలిసి ఓ ఫామ్ హౌజ్ కు వెళ్లిన యువతి అక్కడి అతీత శక్తుల బారిన పడుతుంది. మసాలా సీన్లతోపాటు హారర్ కూడా తోడై ఓ కొత్త అనుభూతిని అందించే సినిమా ఇది.

లిప్‌స్టిక్ అండర్ మై బుర్కా - ప్రైమ్ వీడియో

ఇదొక బ్లాక్ కామెడీ మూవీ. సాంప్రదాయాలు, కట్టుబాట్ల నుంచి దూరంగా స్వేచ్ఛగా జీవించాలనుకునే నలుగురు యువతుల చుట్టూ తిరిగే కథే ఈ లిప్‌స్టిక్ అండర్ మై బుర్కా. టైటిల్ తోపాటు మూవీ కూడా చాలా వివాదాస్పమైంది.

బీఏ పాస్ - నెట్‌ఫ్లిక్స్

బాలీవుడ్ లో వచ్చిన చాలా బోల్డ్ మూవీ ఇది. ఎంబీఏ చదివి తన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుద్దామని సిటీకి వచ్చిన ఓ యువకుడు.. ఓ మహిళ మోజులో ఎలా పడ్డాడన్నది ఇందులో చూడొచ్చు. ఈ సినిమాలో చాలా బోల్డ్ సీన్స్ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

IPL_Entry_Point