Sandeep Reddy Vanga: నా ఒక్క సినిమాతో స్టార్ అయిపోయావ్ గుర్తుంచుకో.. బాలీవుడ్ నటుడికి సందీప్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్-sandeep reddy vanga strong counter to bollywood actor adil hussain over his regret comments on kabir singh ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sandeep Reddy Vanga: నా ఒక్క సినిమాతో స్టార్ అయిపోయావ్ గుర్తుంచుకో.. బాలీవుడ్ నటుడికి సందీప్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

Sandeep Reddy Vanga: నా ఒక్క సినిమాతో స్టార్ అయిపోయావ్ గుర్తుంచుకో.. బాలీవుడ్ నటుడికి సందీప్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

Hari Prasad S HT Telugu
Apr 18, 2024 04:33 PM IST

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడు ఆదిల్ హుస్సేన్ పై తీవ్రంగా మండిపడ్డాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. తన కబీర్ సింగ్ సినిమాలో నటించినందుకు బాధపడుతున్నానని అతడు చేసిన కామెంట్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చాడు.

నా ఒక్క సినిమాతో స్టార్ అయిపోయావ్ గుర్తుంచుకో.. బాలీవుడ్ నటుడికి సందీప్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
నా ఒక్క సినిమాతో స్టార్ అయిపోయావ్ గుర్తుంచుకో.. బాలీవుడ్ నటుడికి సందీప్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి, యానిమాల్ లాంటి సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయిన సందీప్ రెడ్డి వంగా.. తన మూవీస్ ని ఎవరైనా విమర్శిస్తే అస్సలు ఊరుకోడు. అందులోనూ తన సినిమాల్లో నటించిన వ్యక్తే ఆ పని చేసినందుకు బాధపడుతున్నానని అని అంటే ఊరుకుంటాడు. కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. బాలీవుడ్ నటుడు ఆదిల్ హుస్సేన్ చేసిన కామెంట్స్ పై సందీప్ తీవ్రంగా మండిపడ్డాడు.

ఆదిల్ హుస్సేన్ కు సందీప్ కౌంటర్

బాలీవుడ్ లో కాస్త పేరున్న నటుడు ఆదిల్ హుస్సేన్. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన కబీర్ సింగ్ సినిమాలో అతడు నటించాడు. అయితే తన కెరీర్లో తాను ఎందుకు చేశానా అని బాధపడే సినిమా అదొక్కటే అని అతడు ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. తాజాగా దీనిపై సందీప్ స్పందించాడు. తన సోషల్ మీడియా ఎక్స్ ద్వారా గురువారం (ఏప్రిల్ 18) కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.

తన సినిమాతోనే పేరొచ్చిన విషయాన్ని మరచిపోవద్దని, నీ ముఖాన్ని ఏఐతో మార్చేస్తానని అనడం విశేషం. "నీ 30 ఆర్ట్ సినిమాల్లోని నీ నమ్మకానికి రాని పేరు నువ్వు బాధపడే ఆ ఒక్క బ్లాక్‌బస్టర్ సినిమాతో వచ్చింది. నిన్ను ఆ సినిమాలో తీసుకున్నందుకు నేను బాధపడుతున్నాను. నీ ప్యాషన్ కంటే నీకున్న అత్యాశ ఎక్కువని అర్థమైంది. నువ్వు ఇంకా సిగ్గు పడకుండా ఆ సినిమాలో నీ ముఖాన్ని ఏఐ సాయంతో మార్చేస్తా. ఇప్పుడైనా కాస్త మంచిగా నవ్వు" అని సందీప్ ట్వీట్ చేశాడు.

ఆదిల్ హుస్సేన్ ఏమన్నాడంటే?

ఓ యూట్యూబ్ ఛానెల్ పాడ్‌కాస్ట్ లో ఆదిల్ హుస్సేన్ మాట్లాడాడు. తనకు ఆ సినిమాలో నటించడం ఇష్టం లేక తాను భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నానని చెప్పానని, దానికీ వాళ్లు అంగీకరించడంతో తాను ఆ సినిమా చేశానని చెప్పాడు. తాను నటించిన సీన్ బాగుండటంతో సినిమా కూడా బాగానే ఉంటుందని భావించానని, కానీ తర్వాత మూవీ చూస్తే తాను 20 నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చోలేకపోయానని అన్నాడు.

"'సమాజానికి ఏమాత్రం పనికిరాని అంశాన్ని ఈ సినిమా చూపించింది. పురుషాధిక్యత సరైనదన్నట్లు చూపించారు. ఎవరినైనా హింసించవచ్చని చూపించారు. ఈ సినిమాలో నటించినందుకు చాలా సిగ్గుగా అనిపించింది. నా కెరీర్లో ఎందుకు చేశానా అని బాధపడిన సినిమా ఇదొక్కటే" అని ఆదిల్ హుస్సేన్ అన్నాడు.

ఆ వీడియో వైరల్ అవడంతో సందీప్ చాలా ఘాటుగా స్పందించాడు. తెలుగులో తాను తీసిన అర్జున్ రెడ్డి మూవీనే హిందీలో కబీర్ సింగ్ పేరుతో సందీప్ రీమేక్ చేశాడు. తెలుగులోలాగే హిందీలోనూ ఈ మూవీ హిట్ అయింది. ఇక ఈ మధ్యే వచ్చిన యానిమల్ మూవీ కూడా రూ.900 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా విషయంలోనూ సందీప్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అయితే వాటిని కూడా అతడు గట్టిగానే తిప్పికొట్టాడు. ఆ యానిమల్ మూవీకి యానిమల్ పార్క్ తో సీక్వెల్ కూడా తీయనున్నాడు.