Animal: అలా చేస్తే యానిమల్ మూవీలా అవుతుంది.. తెలుగు డైరెక్టర్ కామెంట్స్-geethanjali malli vachindi director shiva turlapati comments on animal movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Animal: అలా చేస్తే యానిమల్ మూవీలా అవుతుంది.. తెలుగు డైరెక్టర్ కామెంట్స్

Animal: అలా చేస్తే యానిమల్ మూవీలా అవుతుంది.. తెలుగు డైరెక్టర్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Apr 14, 2024 12:54 PM IST

Geethanjali Malli Vachindi Director About Animal: యానిమల్ మూవీపై గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా డైరెక్టర్ శివ తుర్లపాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జీఎమ్‌వీ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అలా చేస్తే యానిమల్ మూవీలా అవుతుంది.. తెలుగు డైరెక్టర్ కామెంట్స్
అలా చేస్తే యానిమల్ మూవీలా అవుతుంది.. తెలుగు డైరెక్టర్ కామెంట్స్

Director Shiva Turlapati About Animal Movie: హీరోయిన్ అంజలి 50వ సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. శివ తుర్లపాటి దర్శక‌త్వంలో MVV సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ నిర్మించారు. హారర్‌ కామెడీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రం ఏప్రిల్ 11న విడుదలైంది. ఈ సినిమాకు వ‌స్తున్న స్పంద‌న గురించి, త‌న గురించి, గీతాంజ‌లి 3 గురించి శివ తుర్ల‌పాటి మీడియాతో ముచ్చటించారు.

చెప్పాలనుకున్నది అది కాదు

"సినిమాకు వ‌స్తున్న స్పంద‌న గురించి చెప్పండి అని అడగ్గా".. "రెస్పాన్స్ జెన్యూన్‌గా బాగుంది. రివ్యూలను కూడా చూశాను. రివ్యూల్లో చెప్పే విష‌యాల‌ను నేనెప్పుడూ పాజిటివ్‌గా తీసుకుంటాను. సినిమాలో చాలా వాటికి ఆన్స‌ర్ చేయ‌కుండా వ‌దిలేశార‌ని కొంద‌రు రాశారు. అయితే, ఆ లాజిక్కుల‌న్నిటికీ స‌మాధానం చెబుతూ పోతే, యానిమల్ సినిమా లాగా మూడు గంట‌ల నిడివి వ‌స్తుంది. నేను చెప్ప‌ద‌ల‌చుకున్న‌ది అది కాదు" అని డైరెక్టర్ శివ తుర్లపాటి అన్నారు.

మంచి రెస్పాన్స్ వస్తోంది

"ఇది ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ సినిమా. కంజూరింగ్ టైప్ హార‌ర్ ఇందులో చేయాల‌నే థాట్ మాకు లేదు. ఎంట‌ర్‌టైనింగ్ సినిమాగానే చేశాం. కోన గారి మార్క్ రైటింగ్‌ని ఆస్వాదించేవారికి చాలా బాగా న‌చ్చుతోంది. సినిమా చూసిన వారు నాకు మెసేజ్‌లు పెడుతున్నారు. వీకెండ్ కాబ‌ట్టి, యుఎస్‌లో ఇప్పుడు అంద‌రూ సినిమా చూస్తున్నారు. అక్కడి నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది" అని శివ తుర్లపాటి చెప్పారు.

డిస్కస్ చేశాను

"సునీల్, స‌త్య కామెడీ సెకండాఫ్‌లో పేలింది. క్లైమాక్స్‌ని కొంద‌రు ఎక్స్‌ట్రార్డిన‌రీ అని మెచ్చుకుంటున్నారు. కొంద‌రు స‌డెన్‌గా పూర్త‌యింది అని అన్నారు. మ‌రికొంద‌రు అదేంట‌ని అన్నారు. ఇలాంటి అనుమానాలు అన్నిటికీ థ‌ర్డ్ పార్ట్‌లో స‌మాధానం ఉంటుంది. ఈ విష‌యాల‌న్నిటినీ నేను కోన‌ గారితోనూ డిస్క‌స్ చేశాను" అని డైరెక్టర్ చెప్పుకొచ్చారు.

డైర‌క్ట‌ర్‌గా శాటిస్‌ఫై అయ్యారా?

శాటిస్‌ఫై అయ్యానండీ. ఇంకా బాగా చేసి ఉండొచ్చేమో అనే త‌ప‌న ఎప్పుడూ ఉంటుంది. కాక‌పోతే ఈ సినిమా నాకు చాలా చాలా నేర్పింది. నెక్స్ట్ సినిమాకు ఇంకా బాగా చేస్తానేమో.

మోస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ కాంప్లిమెంట్ ఎవ‌రి నుంచి?

అంద‌రూ నా మంచిని కోరుకునేవారే. 20-25 ఏళ్ల నుంచి ఇండ‌స్ట్రీలో ఉన్నా. నా క‌ష్టాల‌ను ఎవ‌రూ చూడ‌లేదు. ఇప్పుడు చూస్తున్న శివ‌, ఆ శివ వేరు. అందుకే నేను స‌క్సెస్ కావాల‌ని అంద‌రూ కోరుకున్నారు.

కోన‌గారి కోస‌మే సినిమా చేశారా? లేకుంటే డైర‌క్ష‌న్ చేయాల‌ని ముందే అనుకున్నారా?

డైర‌క్ష‌న్ చేయాల‌న్న‌ది నా క‌ల‌. అందుకోస‌మే కోన‌ గారికి కొన్ని స్క్రిప్టులు చెప్పా. ఈ సినిమాకు ముందు కూడా ఓ క‌థ చెప్పా. ఆయ‌న బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్నారు. మ‌ధ్య‌లో ర‌మ్మంటే నాకు కుద‌ర‌లేదు. కాక‌పోతే ఈ సినిమా డైర‌క్ష‌న్ నాకు ఇస్తార‌ని నేను ఊహించ‌లేదు. ఈ సినిమా చేస్తే లాంచ్ బాగుంటుందని నాకు చెప్పారు. స‌రేన‌ని చేశాను.

సీక్వెల్ అన‌గానే భ‌యం ఉంటుంది క‌దా?

నిజ‌మేనండీ. ఫ‌స్ట్ పార్ట్ కూడా డైర‌క్ట‌ర్ బ్ల‌డ్ పెట్టి చేశారు. చాలా పెద్ద స‌క్సెస్ అయింది. అందుకే ఆ ప్రెజ‌ర్‌ని నేను తీసుకోలేదు. అలాగే అంజ‌లి గారికి 50వ సినిమా అని కూడా నాకు తెలియ‌దు. సినిమాను సినిమాగా చేశాం.

IPL_Entry_Point