Prime Video Latest Releases: ప్రైమ్ వీడియోలోకి కొత్తగా వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే-prime video latest releases movies and web series chari 111 mastu shades unnayi ra inspector rishi kismat and many more ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prime Video Latest Releases: ప్రైమ్ వీడియోలోకి కొత్తగా వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

Prime Video Latest Releases: ప్రైమ్ వీడియోలోకి కొత్తగా వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

Hari Prasad S HT Telugu
Apr 05, 2024 03:24 PM IST

Prime Video Latest Releases: అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఈ మధ్యే కొత్తగా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. ఈ వీకెండ్ లో వీటిని చూడటానికి ప్లాన్ చేసేయండి.

ప్రైమ్ వీడియోలోకి కొత్తగా వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే
ప్రైమ్ వీడియోలోకి కొత్తగా వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

Prime Video Latest Releases: ప్రముఖ ఓటీటీల్లో ఒకటైన ప్రైమ్ వీడియోలోకి గత వారం, ఈ వారం కలిపి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయి. వీటిలో చాలా వరకు తెలుగు సినిమాలు, సిరీస్ ఉండటం విశేషం. మరి ఆ మూవీస్, సిరీస్ ఏవో ఇక్కడ చూడండి. వీలుంటే ఈ వీకెండ్ లో వాటిని చూడటానికి ప్లాన్ చేయండి.

ప్రైమ్ వీడియో లేటెస్ట్ రిలీజెస్

చారి 111 మూవీ

వెన్నెల కిశోర్ నటించిన చారి 111 మూవీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సడెన్ గా శుక్రవారం (ఏప్రిల్ 5) ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. స్పై యాక్ష‌న్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి టీజీ కీర్తికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మార్చి 1న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. మోస్తారు క‌లెక్ష‌న్స్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద డిజ‌పాయింట్ చేసింది.

మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా..

అభినవ్ గోమటం నటించిన మూవీ మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా. ఈ మూవీ గత శుక్రవారం (మార్చి 29) ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. కామెడీకి అంత‌ర్లీనంగా ఓ మెసేజ్‌ను జోడిస్తూ ద‌ర్శ‌కుడు తిరుప‌తిరావు మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా మూవీని తెర‌కెక్కించాడు. థియేటర్లలో సక్సెసైన ఈ సినిమాకు ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది.

తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా

బాలీవుడ్ లో ఈ ఏడాది రిలీజై రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన సినిమా తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా. షాహిద్ కపూర్, కృతి సనన్ నటించిన ఈ సినిమా శుక్రవారమే (ఏప్రిల్ 5) ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టింది. ఈ మూవీలో కృతి ఓ రోబోగా కనిపించడం విశేషం.

ఇన్‌స్పెక్టర్ రిషి

నవీన్ చంద్ర నటించిన హారర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇన్‌స్పెక్టర్ రిషి. పది ఎపిసోడ్ల ఈ సిరీస్ గత శుక్రవారం (మార్చి 29) ఓటీటీలోకి రాగా.. ప్రస్తుతం ప్రైమ్ వీడియో టాప్ ట్రెండింగ్స్ లో తొలి స్థానంలో ఉండటం విశేషం.

ఇన్‍స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ కథ కొత్తది కాకపోయినా ఎంగేజింగ్‍గా సాగుతుంది. నిడివి ఎక్కువగా ఉన్నా.. విసుగు అనిపించదు. అక్కడక్కగా కథనం నెమ్మదించినా.. మళ్లీ తొందరగానే ట్రాక్ ఎక్కుతుంది.

కిస్మత్

ఈ తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ కూడా సడెన్ గా ఈ మంగళవారం (ఏప్రిల్ 2) నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అభినవ్ గోమఠం, నరేష్ అగస్త్య, విశ్వదేవ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా కిస్మత్. రియా సుమన్ హీరోయిన్‌గా అజయ్ ఘోష్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు శ్రీనాథ్ బాదినేని దర్శకత్వం వహించారు.

ప్రైమ్ వీడియోలో ఈ తెలుగు, హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ తోపాటు మ్యూసికా, హౌ టు డేట్ బిల్లీ వాల్ష్, ఎ జెంటిల్మన్ ఇన్ మాస్కో లాంటి ఇంగ్లిష్ మూవీస్ కూడా ఈ మధ్యే రిలీజయ్యాయి.

IPL_Entry_Point