Netflix latest movies: నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్తగా వచ్చిన సినిమాలు ఇవే.. త్వరలోనే లేటెస్ట్ తెలుగు సూపర్ హిట్-netflix latest movies article 370 amarsingh chamkila all india rank rebel moon 2 tillu square to stream from next week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Latest Movies: నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్తగా వచ్చిన సినిమాలు ఇవే.. త్వరలోనే లేటెస్ట్ తెలుగు సూపర్ హిట్

Netflix latest movies: నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్తగా వచ్చిన సినిమాలు ఇవే.. త్వరలోనే లేటెస్ట్ తెలుగు సూపర్ హిట్

Hari Prasad S HT Telugu

Netflix latest movies: ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ మధ్యే కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చాయి. వాటిలో హిందీ, ఇంగ్లిష్ భాషల మూవీసే ఉన్నాయి. అయితే త్వరలోనే లేటెస్ట్ తెలుగు సూపర్ హిట్ మూవీ రానుంది.

నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్తగా వచ్చిన సినిమాలు ఇవే.. త్వరలోనే లేటెస్ట్ తెలుగు సూపర్ హిట్

Netflix latest movies: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఈ మధ్య దూకుడుగా వెళ్తోంది. ఎన్నో సూపర్ హిట్, మోస్ట్ అవేటెడ్ సినిమాల డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే ఈ ఓటీటీలోకి ఈ మధ్యకాలంలో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చాయి. వాటిలో అమర్‌సింగ్ చమ్కీలా, ఆర్టికల్ 370, స్కూప్, రెబల్ మూన్ 2లాంటి సినిమాలు ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్ లేటెస్ట్ మూవీస్

ఆర్టికల్ 370

నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ శుక్రవారమే (ఏప్రిల్ 19) ఆర్టికల్ 370 మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. యామీ గౌతమ్, ప్రియమణి నటించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370, దాని రద్దు, కశ్మీర్ ఉగ్రవాదం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా తెరకెక్కింది.

ఆల్ ఇండియా ర్యాంక్

గతేడాది చివర్లో రిలీజైన మూవీ ఆల్ ఇండియా ర్యాంక్. థియేటర్లలో రిలీజైన చాలా రోజుల తర్వాత ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. 1990ల్లో జరిగిన కథగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఐఐటీల్లో సీటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న 17 ఏళ్ల యువకుడి చుట్టూ తిరిగే కథే ఈ ఆల్ ఇండియా ర్యాంక్ మూవీ.

ఎనీవన్ బట్ యు

గతేడాది రిలీజైన అమెరికన్ రొమాంటిక్ కామెడీ మూవీ ఎనీవన్ బట్ యు. షేక్స్పియర్ రాసిన మచ్ అడో అబౌట్ నథింగ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. గతంలో డేటింగ్ చేసి తర్వాత విడిపోయిన జంట.. సడెన్ గా ఓ పెళ్లిలో కలిసిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తారన్నది ఈ సినిమాలో చూడొచ్చు.

ఎల్విస్

అమెరికన్ మ్యూజిక్ లెజెండ్ ఎల్విస్ ప్రెస్లీ జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ ఎల్విస్. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. తాజాగా నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది.

అమర్‌సింగ్ చమ్కీలా

27 ఏళ్లకే హత్యకు గురైన సింగర్ అమర్ సింగ్ చమ్కీలా బయోపిక్ ఇది. ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దిల్జిత్ దొసాంజ్, పరిణీతి చోప్రా ఈ మూవీలో నటించారు.

ఇవే కాకుండా స్కూప్, రెబల్ మూన్ పార్ట్ 2లాంటి సినిమాలు కూడా ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ కు వచ్చాయి.

టిల్లూ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్

ఇక నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చే వారం టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ టిల్లూ స్క్వేర్ రానుంది. సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ మూవీ ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు శుక్రవారం (ఏప్రిల్ 19) నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా అనౌన్స్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర సక్సెసైన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ లో గుంటూరు కారం, యానిమల్, సలార్ లాంటి సినిమాలు కూడా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.