Article 370 OTT: యామీ గౌతమ్, ప్రియమణి సూపర్ హిట్ మూవీ ‘ఆర్టికల్ 370’ ఓటీటీలోకి వచ్చేది ఆరోజే!.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే..-article 370 ott release date yami gautam political action movies will steam on jiocinema platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Article 370 Ott Release Date Yami Gautam Political Action Movies Will Steam On Jiocinema Platform

Article 370 OTT: యామీ గౌతమ్, ప్రియమణి సూపర్ హిట్ మూవీ ‘ఆర్టికల్ 370’ ఓటీటీలోకి వచ్చేది ఆరోజే!.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 24, 2024 09:39 PM IST

Article 370 OTT Release date: ఆర్టికల్ 370 సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్ అయింది. ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుందో సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలు ఇవే.

Article 370 OTT: యామీ గౌతమ్, ప్రియమణి సూపర్ హిట్ మూవీ ‘ఆర్టికల్ 370’ ఓటీటీలోకి వచ్చేది ఆరోజే!.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే..
Article 370 OTT: యామీ గౌతమ్, ప్రియమణి సూపర్ హిట్ మూవీ ‘ఆర్టికల్ 370’ ఓటీటీలోకి వచ్చేది ఆరోజే!.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే..

Article 370 OTT: ఆర్టికల్ 370 సినిమా ఆరంభం నుంచి చాలా ఆసక్తిని రేపింది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని ప్రభుత్వం ఎత్తివేసిన అంశంపై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి యామీ గౌతమ్, సీనియర్ నటి ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఫిబ్రవరి 23వ తేదీన రిలీజ్ అయిన ఆర్టికల్ 370 కమర్షియల్‍గానూ సూపర్ హిట్ అయింది. అంచనాలకు మించి వసూళ్లను రాబట్టింది.

స్ట్రీమింగ్‍కు వచ్చేది అప్పుడే!

ఆర్టికల్ 370 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ‘జియోసినిమా’ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. ఈ చిత్రం ఏప్రిల్ 19వ తేదీన జియోసినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుందని సమాచారం బయటికి వచ్చింది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆదిత్య సుహాస్ జంబాలే దర్శకత్వం వహించిన ఈ చిత్రం థ్రిల్లింగ్ కథనంతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఆర్టికల్ 370 కలెక్షన్లు

ఆర్టికల్ 370 సినిమా సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కింది. ఈ చిత్రానికి ఆరంభంలో పెద్దగా వసూళ్లు రాలేదు. అయితే, ఆ తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు పెరిగాయి. లాంగ్ రన్‍లో ఈ చిత్రం ఆడుతోంది. రిలీజై నెల అయినా.. ఇంకా ఈ మూవీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సుమారు రూ.105 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. దీంతో కమర్షియల్‍గా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.

ఆర్టికల్ 370 సినిమాలో ఎన్ఐఏ ఏజెంట్‍గా యామి గౌతమ్, పీఎంవో జాయింట్ సెక్రటరీగా ప్రియమణి యాక్టింగ్ హైలైట్‍గా నిలిచింది. రాజ్ అరుణ్, శివమ్ ఖజురియా, వైభవ్ తత్వవాది, అరుణ్ గోవిల్, రాజ్ జుత్షి, దివ్య సేథ్, కిరణ్ కర్మాకర్ ఈ చిత్రంలో కీరోల్స్ చేశారు.

కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా ఆర్టికల్ 370 చిత్రాన్ని తెరకెక్కించినట్టు ఈ మూవీ టీమ్ పేర్కొంది. ఈ అంశాన్ని గ్రిప్పింగ్‍గా తెరపై చూపించడంలో దర్శకుడు ఆదిత్య సుహాస్ సక్సెస్ అయ్యారనే ప్రశంసలు వచ్చాయి. బీ62 స్టూడియోస్, జియో స్టూడియోస్ పతాకాలపై జ్యోతి దేశ్‍పాండే, ఆదిత్య ధార్, లోకేశ్ ధార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఆర్టికల్ 370 మూవీకి శాశ్వత్ సచ్‍దేవ్ సంగీతం అందించారు. సిద్ధార్థ్ దీనా వసానీ సినిమాటోగ్రఫీ చేసిన ఈ మూవీకి శివకుమార్ వీ పనికర్ ఎడిటింగ్ చేశారు. ఆదిత్య లాల్, మోహన్ థాకర్ ఈ చిత్రానికి కథ అందించారు.

అస్థిరత, ఆశాంతి, ఘర్షణలు జరుగుతున్న జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులను అదుపు చేసేందుకు వెళతారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జూనీ హక్సర్ (యామీ గౌతమ్). అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఆర్టికల్ 370ని ఎత్తేసేందుకు ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ బాధ్యతలను తన భుజాలపై వేసుకొని తీవ్రంగా పని చేస్తుంటారు ప్రధానమంత్రి కార్యాలయ సెక్రటరీ రాజేశ్వరి స్వామినాథన్ (ప్రియమణి). ఆర్టికల్ 370 రద్దుకు కొంతకాలం ముందు… ఆ తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఏం జరిగిందనే విషయాలు ఈ చిత్రంలో ప్రధానంగా ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దు ప్రక్రియను కూడా తెరక్కించారు.

IPL_Entry_Point