తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sai Pallavi 3 Dreams: హీరోయిన్ సాయి పల్లవి జీవితంలో ఎప్పటికీ నెరవేరని మూడు కోరికలు.. అవి ఏంటంటే?

Sai Pallavi 3 Dreams: హీరోయిన్ సాయి పల్లవి జీవితంలో ఎప్పటికీ నెరవేరని మూడు కోరికలు.. అవి ఏంటంటే?

Sanjiv Kumar HT Telugu

18 December 2024, 14:13 IST

google News
    • Never Come True Dreams Of Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమెను లేడి పవర్ స్టార్ అని కూడా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. అయితే, ఎంతో పాపులర్ హీరోయిన్ అయిన సాయి పల్లవికి జీవితంలో ఎప్పటికీ నెరవేరని మూడు కోరికలు ఉన్నాయి. అవేంటీ, ఎందుకు నెరవేరవు అనేది తెలుసుకుందాం.
హీరోయిన్ సాయి పల్లవి జీవితంలో ఎప్పటికీ నెరవేరని మూడు కోరికలు.. అవి ఏంటంటే?
హీరోయిన్ సాయి పల్లవి జీవితంలో ఎప్పటికీ నెరవేరని మూడు కోరికలు.. అవి ఏంటంటే?

హీరోయిన్ సాయి పల్లవి జీవితంలో ఎప్పటికీ నెరవేరని మూడు కోరికలు.. అవి ఏంటంటే?

Three Dreams Of Sai Pallavi: తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోయిన్స్‌లలో సాయి పల్లవి ఒకరు. తెలుగు రాష్ట్రాల్లో ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సాయి పల్లవి అభిమానులు ఆమెను లేడి పవర్ స్టార్ అని పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే.

తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. సినిమాల్లో యాక్టింగ్‌కు తప్పా గ్లామర్, ఎక్స్‌పోజింగ్‌కు ఏమాత్రం చోటివ్వను సాయి పల్లవి జీవితంలో ఎప్పటికీ నెరవేరని మూడు డ్రీమ్స్ లేదా కోరికలు ఉన్నాయట. మరి అవేంటీ?, నెరవేరకపోవడానికి గల కారణాలు ఏంటీ? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.

53 ఏళ్ల వయసులో మరణం

సాయి పల్లవికి బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్‌తో నటించాలని అనుకుందట. కానీ, ఇర్ఫాన్ ఖాన్ (Irrfan Khan) కోలన్ ఇన్ఫెక్షన్ కారణంగా 53 ఏళ్ల వయసులోనే మరణించారు. 2020 ఏప్రిల్ 29 మరణించారు. దాంతో ఇర్ఫాన్ ఖాన్‌తో నటించాలన్న సాయి పల్లవి కోరిక ఎప్పటిక నెరవేరకుండా పోయినట్లు అయింది. అంతేకాకుండా ఇర్ఫాన్ ఖాన్ మరణించినప్పుడు ఎమోషనల్‌ ట్వీట్ కూడా చేసింది సాయి పల్లవి.

కుక్కలను ట్రీట్ చేసే విధానం

సాయి పల్లవికి పాపులర్ బిజినెస్ మ్యాన్ రతన్ టాటా (Ratan Naval Tata) అంటే ఎంతో గౌరవం అట. ఆయన చేసిన ఎన్నో మంచి పనుల కారణంగా సాయి పల్లవికి రతన్ టాటాను ఒక్కసారి కలిస్తే బాగుండు అన్న కోరిక కలిగిందట. , ముఖ్యంగా కుక్కలను సైతం రతన్ టాటా ట్రీట్ చేసే విధానం చూసి ఆయనతో టైమ్ స్పెండ్ చేసే అవకాశం వస్తే బాగుండు అని సాయి పల్లవి అనుకుందట.

దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. అయితే, 2024 అక్టోబర్ 9న అనారోగ్య కారణాలతో రతన్ టాటా కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇలా మరోసారి కూడా సాయి పల్లవి కోరిక ఎప్పటికీ నెరవేరనిదిగా అయింది.

అతిథిగా వచ్చిన సూపర్ స్టార్

సాయి పల్లవి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎవరు తెలియదు. అయితే, ఓ అవార్డ్ ఫంక్షన్‌కు అతిథిగా వచ్చిన కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) సాయి పల్లవిని మెచ్చుకున్నారట. అంతేకాకుండా తనతో సినిమా చేయాలని ఉందని పునీత్ రాజ్‌కుమార్‌ చెప్పారని సాయి పల్లవి గార్గి మూవీ ప్రమోషన్స్‌లో చెప్పింది.

"ఎంతో పెద్ద స్టార్ అయిన పునీత్ రాజ్‌కుమార్ గారు అలా నాకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, అది ఆయన నిరాడంబరతకు నిదర్శనం. ఇలాంటి ప్రశంసలు కొత్తవారిని ప్రోత్సహించినట్లు అవుతుంది. ఆయన మరణం తర్వాత ఆయన్ను నేను కలవలేదని చాలా బాధపడ్డాను. ఆయన నాతో సినిమా చేస్తాను అని చెప్పడంపై ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను" అని గార్గి ప్రమోషన్స్‌లో సాయి పల్లవి తెలిపింది.

ప్రేమమ్ మూవీకి అవార్డ్

అయితే, ప్రేమమ్ సినిమాకు అవార్డ్ తీసుకున్న సందర్భంగా సాయి పల్లవితో పునీత్ రాజ్‌కుమార్ మాట్లాడినట్లు సమాచారం. 2021 అక్టోబర్ 29న పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మరణించడంతో సాయి పల్లవి మరో కోరిక కూడా నెరవేరనట్లు అయింది. ఇలా సాయి పల్లవి జీవితంలో ఎప్పటికీ నెరవేరని మూడు కోరికలు అలాగే ఉండిపోయాయని తెలుస్తోంది.

తదుపరి వ్యాసం