Puneeth Gandhada Gudi in OTT: ఓటీటీలోకి వచ్చేసిన పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం.. ఎందులో అంటే?-puneeth rajkumar last film gandhada gudi streams on prime video from today
Telugu News  /  Entertainment  /  Puneeth Rajkumar Last Film Gandhada Gudi Streams On Prime Video From Today
పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా గంధడ గుడి
పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా గంధడ గుడి (MINT_PRINT)

Puneeth Gandhada Gudi in OTT: ఓటీటీలోకి వచ్చేసిన పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం.. ఎందులో అంటే?

17 March 2023, 20:40 ISTMaragani Govardhan
17 March 2023, 20:40 IST

Puneeth Gandhada Gudi in OTT: కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను స్వయాన పునీత్ రాజ్‌కుమారే నిర్మించారు.

Puneeth Gandhada Gudi in OTT: కన్నడ స్టార్ దివంగత పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం గంధడ గుడి. డాక్యూమెంటరీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ ఈ చిత్రానికి 10కి 9.3 రేటింగ్ ఇచ్చింది. అంతలా సినిమా ఆకర్షించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. పునీత్ జయంతి సందర్భంగా మార్చి 7 శుక్రవారం నుంచి ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో పునీత్ నటించిన గంధడ గుడి స్ట్రీమింగ్ అవుతోంది. పునీత్ మరణానికి ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కర్ణాటక రాష్ట్ర అడవులు, ప్రకృతి వనరులు, జీవ వైవిధ్యంలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ డాక్యూమెంటరీ రూపంలో ఈ సినిమా తెరక్కికంచారు. పునీత్ ఈ డాక్యూమెంటరీ ఫిల్మ్‌లో నటిస్తూనే స్వయంగా నిర్మించారు.

స్టార్ హీరోగా వరుస పెట్టి హిట్లు అందుకుంటున్న పునీత్.. కమర్షియాలిటీని పక్కన పెట్టి ప్రకృతిపై తనకున్న ప్రేమను చాటుకుంటూ ఈ సినిమాను నిర్మించారు. ఈ డాక్యూమెంటరీ పూర్తయిన తర్వాత విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలోనే ఆయన మరణించారు. ఆయన వర్థంతికి ఒక రోజు ముందు గతేడాది అక్టోబరు 28న ఈ డాక్యూమెంటరీ పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదల చేశారు. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు అందాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందించారు.

పీఆర్‌కే ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ డాక్యూమెంటరీని అమోఘవర్ష జేఎస్ దర్శకత్వం వహించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూర్చారు. ప్రతీక్ శెట్టి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయగా. అంకిత్,అక్షయ్ పాయ్ ఎడిటర్లుగా వ్యవహరించారు. మార్చి 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా గంధడ గుడి స్ట్రీమింగ్ అవుతోంది.

సంబంధిత కథనం

టాపిక్