Gandhada Gudi OTT Release Date: పునీత్ రాజ్‌కుమార్ జ‌యంతి రోజున చివ‌రి సినిమా ఓటీటీలో రిలీజ్‌-puneeth rajkumar gandhada gudi to stream on amazon prime on this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Puneeth Rajkumar Gandhada Gudi To Stream On Amazon Prime On This Date

Gandhada Gudi OTT Release Date: పునీత్ రాజ్‌కుమార్ జ‌యంతి రోజున చివ‌రి సినిమా ఓటీటీలో రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 15, 2023 06:35 AM IST

Gandhada Gudi OTT Release Date: పునీత్ రాజ్‌కుమార్ న‌టించిన చివ‌రి సినిమా గంధ‌ద గుడి ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఏ రోజు స్ట్రీమింగ్ కానుందంటే...

పునీత్ రాజ్‌కుమార్
పునీత్ రాజ్‌కుమార్

Gandhada Gudi OTT Release Date: క‌న్న‌డ దివంగ‌త అగ్ర హీరో పునీత్ రాజ్‌కుమార్(Puneeth Rajkumar) న‌టించిన చివ‌రి డాక్యుమెంట‌రీ మూవీ గంధ‌ద గుడి ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. మార్చి 17 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. పునీత్ రాజ్ కుమార్‌ జ‌యంతి రోజున ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతుండ‌టం గ‌మ‌నార్హం.

పునీత్ మ‌ర‌ణానికి ముందే గంధ‌ద గుడి షూటింగ్ పూర్త‌యింది. క‌ర్ణాట‌క రాష్ట్ర అడ‌వులు, ప్ర‌కృతి వ‌న‌రులు, జీవ వైవిధ్య‌త‌లోని గొప్ప‌త‌నాన్ని ఆవిష్క‌రిస్తూ డాక్యుమెంట‌రీగా గంధ‌ద‌గుడి రూపొందింది. ఈ డాక్యుమెంట‌రీ ఫిల్మ్‌లో న‌టిస్తూనే స్వ‌యంగా దీనిని నిర్మించారు పునీత్ రాజ్‌కుమార్‌. క‌మ‌ర్షియాలిటీ. డ‌బ్బు కోసం ఆలోచించ‌కుండా ప్ర‌కృతి ప‌ట్ల త‌న‌కున్న ప్రేమ‌ను చాటుకుంటూ పునీత్ రాజ్‌కుమార్ ఈ డాక్యుమెంట‌రీని నిర్మించ‌డం గ‌మ‌నార్హం.

ఈ డాక్యుమెంట‌రీ రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోన్న త‌రుణంలోనే పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణించారు. పునీత్‌కు నివాళిగా ఆయ‌న‌ వ‌ర్ధంతికి ఒక‌రోజు ముందు గ‌త ఏడాది అక్టోబ‌ర్ 28న ఈ డాక్యుమెంట‌రీని థియేట‌ర్ల‌లో పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు. ఈ డాక్యుమెంట‌రీకి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు ప‌లువురు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు పునీత్ ప్ర‌య‌త్నంపై అభినంద‌న‌లు కురిపించారు. ఈ డాక్యుమెంట‌రీకి నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ ఆమోఘ వ‌ర్ష ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

IPL_Entry_Point