The Kerala Story : ప్రభాస్, షారూక్ సినిమాలను వెనక్కు నెట్టిన ది కేరళ స్టోరీ
02 May 2023, 14:20 IST
- The Kerala Story : కొన్ని రోజులు సినిమా ఇండస్ట్రీలో ది కేరళ స్టోరీ చిత్రం గురించి వివాదం నడుస్తోంది. రాజకీయంగానూ ఈ సినిమాపై చర్చ ఉంది. అయితే ఈ సినిమా ప్రభాస్ ఆదిపురుష్, షారూఖ్ ఖాన్ జవాన్ సినిమాలను వెనక్కు నెట్టింది.
ది కేరళ స్టోరీ
సినిమా లవర్స్... అత్యంత ఎక్కువగా ఎదురుచూస్తున్న భారతీయ చలనచిత్రం ఏది అని మీరు సామాన్యుడిని అడిగితే జవాన్(jawan), ఆదిపురుష్(Adipurush), జైలర్ వంటి టైటిల్స్ వినే అవకాశం ఉంది. కానీ స్టార్లు లేని చిన్న సినిమా, రూ. 30 కోట్ల బడ్జెట్ సినిమా కోసం జనాలు ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమానే ది కేరళ స్టోరీ(The Kerala Story).
IMDB రాబోయే భారతీయ చిత్రాల జాబితా పేజీ వీక్షణలలో మే 1న 34.5 శాతంతో కేరళ స్టోరీ అగ్రస్థానంలో ఉంది. షారుఖ్ ఖాన్ జవాన్(shah rukh Jawan) 22.4 శాతంతో రెండో స్థానంలో ఉంది. ప్రభాస్ నటించిన ఆదిపురుష్(Prabhas Adipurush) 15.1 శాతంతో తర్వాతి స్థానంలో ఉంది. డిస్నీ+ హాట్‌స్టార్ లో రాబోయే వెబ్ సిరీస్ సాస్, బహు ఔర్ ఫ్లెమింగో 5.5 శాతంతో తర్వాతి స్థానంలో నిలిచింది.
ఐఎస్‌లో చేరి సిరియా, అఫ్గానిస్థాన్‌కు వెళ్లే విధంగా వేలాది మంది ముస్లిం మహిళలను ఏ విధంగా బ్రెయిన్‌వాష్ చేశారు? అన్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించగా.. విపుల్ అమృత్లాల్ షా నిర్మాతగా వ్యవహరించారు. ప్రముఖ నటి అదా శర్మ(adah sharma)తో పాటు యోగిత శర్మ, సిద్ధి ఇద్నాని, సోనియా బలానీలు కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమా రాజకీయంగా దుమారం రేపింది. విడుదలపై స్టే ఇవ్వాలని సుప్రీం కోర్టు(Supreme Court)లో పిటిషన్లు వేశారు. ఈ సినిమా ఆడియో, వీడియో .. విద్వేషపూరితంగా ఉన్నాయని, రిలీజ్‌ను అడ్డుకోవాలని పిటిషనర్లు ఆరోపించారు. మంగళవారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో భాగంగా.. సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్‌తో పాటు న్యాయవాది నిజామ్ పాషాలు సినిమాకు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. ఈ సినిమా ట్రైలర్‌కు 16మిలియన్ వ్యూస్ వచ్చాయని, కానీ ఇందులో విద్వేష ప్రసంగాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.
స్పందించిన సుప్రీంకోర్టు.. 'విద్వేష ప్రసంగాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్(censor certificate) వచ్చింది. బోర్డు క్లియర్ చేసింది. సినిమా రిలీజ్‌పై స్టే విధించాలని అడగడం సరికాదు. సరైన వేదికపై సర్టిఫికేషన్‌ను సవాలు చేయండి.' అని స్పష్టం చేసింది.
టాపిక్