Prabhas and Hrithik Movie: ప్రభాస్-హృతిక్ కాంబో దాదాపు కన్ఫార్మ్ అయినట్లే.. బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా-prabhas and hrithik roshan combo almost confirmed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas And Hrithik Movie: ప్రభాస్-హృతిక్ కాంబో దాదాపు కన్ఫార్మ్ అయినట్లే.. బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా

Prabhas and Hrithik Movie: ప్రభాస్-హృతిక్ కాంబో దాదాపు కన్ఫార్మ్ అయినట్లే.. బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా

Maragani Govardhan HT Telugu
Jan 24, 2023 01:19 PM IST

Prabhas and Hrithik Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని సమాచారం.

హృతిక్-ప్రభాస్
హృతిక్-ప్రభాస్

Prabhas and Hrithik Movie: టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ ఇటీవలే సంక్రాంతికి రెండు పెద్ద విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణతో వీరసింహారెడ్డి లాంటి సూపర్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌పై కూడా ఫోకస్ పెట్టింది. ప్రముఖ హిందీ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తోంది.

తాజాగా ఈ కాంబోపై మరో ఆసక్తికర అప్డేట్ వినిపిస్తోంది. ప్రభాస్-సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో రాబోతున్న సినిమాలో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించేందుకు బాలీవుడ్ గ్రీక్ గాడ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సిద్ధార్థ్ ఆనంద్.. ప్రభాస్‌తో మూవీలో హృతిక్తో ఈ పాత్ర గురించి మాట్లాడాడని, మన డార్లింగ్ కూడా బాలీవుడ్ హీరో పాత్రపై ఎక్సైట్ అయ్యాడని సమచారం. ఈ హ్యాండ్సమ్ హీరోలిద్దరూ కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే అభిమానులకు కన్నుల పండుగల వలే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ నటించిన పఠాన్ సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. నాలుగేళ్ల తర్వాత షారుఖ్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆత్రుతగా చూస్తున్నారు. రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇందులో షారుఖ్ సరసన దీపికా పదుకొణె నటిస్తోంది. జాన్ అబ్రహం కీలక పాత్రలో మెరిశాడు. ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్ ఆనంద్.. హృతిక్ రోషన్‌తో ఫైటర్ అనే సినిమా తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే అతడితో బ్యాంగ్ బ్యాంగ్, వార్ అనే యాక్షన్ థ్రిల్లర్‌లను తీశాడు.

WhatsApp channel

సంబంధిత కథనం