The Kerala story ban : ‘ది కేరళ స్టోరీ’ విడుదలపై స్టే ఇవ్వము- సుప్రీంకోర్టు
The Kerala story : ది కేరళ స్టోరీ విడుదలపై స్టే ఇవ్వమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి విషయాలను సర్నోన్నత్త న్యాయస్థానం ముందుకు తీసుకురావద్దని హెచ్చరించింది!
The Kerala story Supreme court : వివాదాస్పదంగా మారిన 'ది కేరళ స్టోరీ' సినిమా రిలీజ్‌ను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫలితంగా ఈ సినిమా మే 5న యథావిథిగా విడుదలకానుంది.!
కేరళ స్టోరీ చుట్టూ వివాదం..
ఐఎస్‌లో చేరి సిరియా, అఫ్గానిస్థాన్‌కు వెళ్లే విధంగా వేలాది మంది ముస్లిం మహిళలను ఏ విధంగా బ్రెయిన్‌వాష్ చేశారు? అన్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించగా.. విపుల్ అమృత్లాల్ షా నిర్మాతగా వ్యవహరించారు. ప్రముఖ నటి అదా శర్మతో పాటు యోగిత శర్మ, సిద్ధి ఇద్నాని, సోనియా బలానీలు కీలక పాత్రలు పోషించారు.
The Kerala story release date : ఈ సినిమా ఆడియో, వీడియో .. విద్వేషపూరితంగా ఉన్నాయని, రిలీజ్‌ను అడ్డుకోవాలని పిటిషనర్లు ఆరోపించారు. ఇక మంగళవారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో భాగంగా.. సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్‌తో పాటు న్యాయవాది నిజామ్ పాషాలు సినిమాకు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. ఈ సినిమా ట్రైలర్‌కు 16మిలియన్ వ్యూస్ వచ్చాయని, కానీ ఇందులో విద్వేష ప్రసంగాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఇందుకు స్పందించిన సుప్రీంకోర్టు.. "విద్వేష ప్రసంగాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది. బోర్డు క్లియర్ చేసింది. సినిమా రిలీజ్‌పై స్టే విధించాలని అడగడం సరికాదు. సరైన వేదికపై సర్టిఫికేషన్‌ను సవాలు చేయండి," అని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై రిట్ పిటిషన్ దాఖలు చేయాలని జస్టిస్ జోసెఫ్ సూచించగా.. ముందు హైకోర్టుకు వెళ్లాలని జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు.
The Kerala story latest news : అయితే.. సినిమా రిలీజ్ డేట్ సమిపిస్తోందని, హైకోర్టుకు వెళ్లే టైమ్ లేదని న్యాయావాది పాషా వాదించారు. ఈ వాదనను ధర్మాసనం తిరస్కరించింది. సినిమాపై స్టే విధించేందుకు ఈ వాదన సరైనది కాదని పేర్కొంది. ఇలాంటివి తీసుకుని సుప్రీంకోర్టుకు ఎవరూ రావద్దని ధర్మాసనం హెచ్చరించింది.
సినిమాపై రాజకీయ దుమారం..
ఈ సినిమాపై కేరళలోని అధికార ఎల్డీఎఫ్, విపక్షాలు యూడీఎఫ్- కాంగ్రెస్‌లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. సినీ బృందం.. సంఘ్ పరివార్ చేసే ప్రచారాలను ప్రోత్సహిస్తూ, కేరళలో మత తీవ్రవాదాన్ని పెంచుతోందని విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలో మతసామరస్యాన్ని నాశనం చేసి, సమాజంలో విషాన్ని చిమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు సీఎం పినరయి విజయన్.
The Kerala Story ban : సీఎం, కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. వివాదాస్పద చిత్ర ది కేరళ స్టోరీకి మద్దతిచ్చింది.
ది కేరళ స్టోరీ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. "ఈ సినిమాను నిషేధించాలని నేను చెప్పను. భావప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగించినంత మాత్రాన అది విలువలేకుండా పోదు. కానీ ఈ సినిమా వాస్తవానికి చాలా దూరంలో ఉందని మాట్లాడే హక్కు ప్రతి కేరళవాసికి ఉంది," అని వ్యాఖ్యానించారు.
సంబంధిత కథనం