తెలుగు న్యూస్  /  Entertainment  /  Sushant Singh Rajput's Sister Reacts To Fresh Claims Of Actor Being Murdered

Sushant Singh Rajput Case : సుశాంత్‌ది హత్యేనన్న కామెంట్స్ తర్వాత.. అతడి సోదరి రియాక్షన్ ఇది

Anand Sai HT Telugu

27 December 2022, 14:51 IST

    • Sushant Singh Rajput Death Case : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఆత్మహత్య కాదని, హత్య అని మార్చురీ సిబ్బంది చెప్పుకొచ్చారు. ఈ వాదన సంచలనం రేపింది. అయితే సుశాంత్ సోదరి ఈ విషయంపై తాజాగా స్పందించారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(Sushant Singh Rajput) మరణంపై కొత్త వాదనలు తెరపైకి వచ్చాయి. దీంతో మరోసారి సుశాంత్ మరణంపై దేశవ్యాప్తంగా చర్చమెుదలైంది. తాజాగా సుశాంత్ సింగ్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన సోదరుడి మరణంపై స్పందించారు. 2020లో ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ మృతి చెందాడు. సుశాంత్ మృతదేహాన్ని పరిశీలించిన మార్చురీలో ఉన్న వ్యక్తి ఇది ఆత్మహత్య కాదని, హత్య అని చెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు

Prasanna Vadanam Review: ప్రసన్నవదనం రివ్యూ - సుహాస్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Prasanna Vadanam Twitter Review: ప్రసన్నవదనం ట్విట్టర్ రివ్యూ- సుహాస్ ఫేస్ బ్లైండ్‌నెస్‌ సస్పెన్స్ థ్రిల్లర్ ఆకట్టుకుందా

Guppedantha Manasu Serial: దేవ‌యాని త‌ప్పుకు శైలేంద్ర‌కు శిక్ష - మ‌నుకు షాకిచ్చిన రాజీవ్ - రిషి త‌మ్ముడికి వ‌సు స‌పోర్ట్

Aa Okkati Adakku Twitter Review: ఆ ఒక్కటి అడక్కు ట్విట్టర్ రివ్యూ.. అల్లరి నరేష్ కమ్ బ్యాక్ కామెడీ మూవీ హిట్ కొట్టిందా?

సుశాంత్ సోదరి శ్వేత తన సోదరుడి మరణం గురించి తాజా వాదనలను పరిశీలించాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌(CBI)ను ఒక పోస్ట్‌లో కోరారు. 'ఈ వాదనలను నిజంగా శ్రద్ధగా పరిశీలించాలని మేం సీబీఐ(CBI)ని కోరుతున్నాం. మీరు న్యాయమైన విచారణ జరిపి, నిజానిజాలు మాకు తెలియజేస్తారని ఎప్పటినుంచో నమ్ముతున్నాం. మా హృదయాలు ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాయి.' అని సుశాంత్ సోదరి(Sushant Sister) పోస్ట్ చేశారు.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(sushant singh rajput) మరణించి రెండున్నరేళ్లు పూర్తయ్యాయి. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. మెుదట ముంబై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. తర్వాత ఒత్తిడి పెరగడంతో కేసును సీబీఐ(CBI)కి అప్పగించారు. ఇప్పటి వరకు విచారణ పూర్తి కాలేదు. దీనిపై కూడా తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతిపై హత్య ఆరోపణలు వచ్చాయి. అయితే సుశాంత్ సింగ్ పోస్టుమార్టంలో పాల్గొన్న కూపర్ హాస్పిటల్(Cooper Hospital) సిబ్బంది చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య(Sushant Singh Rajput Suicide) చేసుకోలేదని, హత్య చేశారని కూపర్ హాస్పిటల్‌లోని మార్చురీలో పనిచేసిన రూపకుమార్ షా ఆరోపించారు. 'సుశాంత్ మృతదేహం వచ్చినప్పుడు, అతని శరీరంపై గాయాలు ఉన్నాయి. అతడిని ఎవరో కొట్టారు.'అని రూపకుమార్ చెప్పారు.

'సుశాంత్ సింగ్(sushant singh rajput) మృతదేహానికి పోస్టుమార్టం జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఇది ఆత్మహత్య(Suicide) కాదని, హత్య అని డాక్టర్‌కి చెప్పాను. కానీ ఎవరూ నన్ను పట్టించుకోలేదు' అని రూపకుమార్ అన్నారు. ఈ విషయాన్ని ఇంతకాలం ఎందుకు దాచిపెట్టారనే ప్రశ్నకు కూడా సమాధానమిచ్చారు. 'పనిలో ఎవరికీ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఇంత సేపు మాట్లాడలేదు' అన్నారు. కూపర్ హాస్పిటల్ మార్చురీలో రూపకుమార్ పనిచేశాడు. నెలన్నర క్రితం పదవీ విరమణ చేశారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.