తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Horror: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన 850 కోట్ల హారర్ కామెడీ మూవీ.. స్పెషల్ సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు.. ఎక్కడంటే?

OTT Horror: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన 850 కోట్ల హారర్ కామెడీ మూవీ.. స్పెషల్ సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు.. ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu

26 September 2024, 14:53 IST

google News
  • Horror Comedy Movie Stree 2 OTT Streaming Now: బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హారర్ కామెడీ మూవీ స్త్రీ 2 సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. సుమారు రూ. 851 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టిన స్త్రీ 2 రూమర్ డేట్ కంటే ఒకరోజు ముందే అంటే ఇవాళ్టి (సెప్టెంబర్ 26) నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. 

ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన 850 కోట్ల హారర్ కామెడీ మూవీ.. స్పెషల్ సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు.. ఎక్కడంటే?
ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన 850 కోట్ల హారర్ కామెడీ మూవీ.. స్పెషల్ సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు.. ఎక్కడంటే?

ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన 850 కోట్ల హారర్ కామెడీ మూవీ.. స్పెషల్ సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు.. ఎక్కడంటే?

Stree 2 OTT Release Today: హారర్ సినిమాలు, కామెడీ చిత్రాలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ రెండు కలిపి హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కించిన సినిమాలపై మంచి క్యూరియాసిటీ చూపిస్తారు ఆడియెన్స్. అయితే, ఇలాంటి చిత్రాలను కరెక్ట్ టేకింగ్, గ్రిప్పింగ్ సీన్స్‌తో తెరకెక్కిస్తే బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతాయి.

బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఓపెనింగ్స్

అలా, ఇటీవల బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హారర్ కామెడీ సినిమా స్త్రీ 2. 2018లో వచ్చిన స్త్రీ సినిమాకు సీక్వెల్‌గా 'స్త్రీ 2: సర్కటే కా ఆటంక్' అనే టైటిల్‌తో ఆగస్ట్ 15న థియేటర్లలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కించుకుంది.

బడ్జెట్ అండ్ కలెక్షన్స్

సుమారు రూ. 120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన స్త్రీ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ. 851.03 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దాంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసింది. స్త్రీ 2 మహిళా ప్రధాన పాత్రతో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఓపెనింగ్స్ అందించి చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలో శ్రద్దా కపూర్, రాజ్ కుమార్ రావు హీరో హీరోయిన్లుగా నటించారు.

తమన్నా స్పెషల్ సాంగ్

సూపర్ నేచురల్ హారర్-కామెడీ థ్రిల్లర్ స్త్రీ 2 సినిమాలో వీరిద్దరితోపాటు పాపులర్ యాక్టర్స్ పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్‌శక్తి ఖురానా ఇతర కీలక పాత్రల్లో నటించారు. అంతేకాకుండా మిల్కీ బ్యూటి తమన్నా భాటియా చేసిన స్పెషల్ సాంగ్ ఆడియెన్స్‌ను మరింత అట్రాక్ట్ చేసింది. అలాగే, ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అతిథి పాత్రలో మెరిసి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చాడు.

భయపెడుతూ కామెడీ

ఇలా స్పెషల్ సర్‌ప్రైజ్‌లు, ఊహించని ట్విస్టులతో స్త్రీ 2 చిత్రాన్ని డైరెక్టర్ అమర్ కౌశిక్ తెరకెక్కించారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఎక్కడా బోర్ కొట్టకుండా స్త్రీ 2 సినిమాలో ఆద్యంతం లోనయ్యేలా చిత్రీకరించి ప్రశంసలు అందుకున్నారు. ఓవైపు భయపెడతూనే మరోవైపు కామెడీ పండించి రెండింటిన చక్కగా బ్యాలెన్స్ చేశారని క్రిటిక్స్ సైతం రివ్యూలు ఇచ్చారు.

అనుకున్నదానికంటే ముందే

ఇంతటి క్రేజ్ తెచ్చుకున్న స్త్రీ 2 సినిమా తాజాగా సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే, సెప్టెంబర్ 27 నుంచి స్త్రీ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని జోరుగా రూమర్స్ వినిపించాయి. కానీ, ఎలాంటి అధికారిక ప్రకటనే లేకుండానే అనుకున్న తేది కంటే ఒకరోజు ముందే ఇవాళ (సెప్టెంబర్ 26) స్త్రీ 2 ఓటీటీ రిలీజ్‌కు వచ్చేసింది.

చిన్న ట్విస్ట్

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్త్రీ 2 డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. స్త్రీ 2 సినిమాను చూడాలంటే రూ. 349 చెల్లించి అద్దె ప్రాతిపదికన చూడాల్సిందే. అలాగే, స్త్రీ 2 ప్రస్తుతం కేవలం హిందీ భాషలో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. అయితే, స్త్రీ 2 మూవీ అటు ఫ్రీగా, ఇటు తెలుగులోనూ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

తదుపరి వ్యాసం