Tamannah Horror Movie: తమన్నా నటిస్తున్న హారర్ మూవీ టీజర్ వచ్చేసింది.. భయపెడుతున్న స్త్రీ 2-tamannah horror movie stree 2 teaser out rajkumar rao shraddha kapoor ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tamannah Horror Movie: తమన్నా నటిస్తున్న హారర్ మూవీ టీజర్ వచ్చేసింది.. భయపెడుతున్న స్త్రీ 2

Tamannah Horror Movie: తమన్నా నటిస్తున్న హారర్ మూవీ టీజర్ వచ్చేసింది.. భయపెడుతున్న స్త్రీ 2

Hari Prasad S HT Telugu
Jun 25, 2024 03:14 PM IST

Tamannah Horror Movie: తమన్నా నటిస్తున్న హారర్ మూవీ టీజర్ వచ్చేసింది. ఆరేళ్ల కిందట వచ్చిన స్త్రీ మూవీకి సీక్వెల్ అయిన ఇందులో ఆమె ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించింది.

తమన్నా నటిస్తున్న హారర్ మూవీ టీజర్ వచ్చేసింది.. భయపెడుతున్న స్త్రీ 2
తమన్నా నటిస్తున్న హారర్ మూవీ టీజర్ వచ్చేసింది.. భయపెడుతున్న స్త్రీ 2

Tamannah Horror Movie: టాలీవుడ్ నటి తమన్నా భాటియా.. ఇప్పుడు మరో బాలీవుడ్ మూవీలో మెరవబోతోంది. ఇది హారర్ కామెడీ జానర్ మూవీ కావడం విశేషం. 2018లో వచ్చి సూపర్ హిట్ అయిన స్త్రీ మూవీకి సీక్వెల్ గా స్త్రీ 2 రాబోతోంది. అమర్ కౌశిక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్ మంగళవారం (జూన్ 25) రిలీజైంది.

స్త్రీ 2 టీజర్ రిలీజ్

హారర్ కామెడీ జానర్లో వస్తున్న సినిమాలకు ఇప్పుడు చాలా ఆదరణ లభిస్తోంది. అయితే ఆ జానర్లో ఆరేళ్ల కిందటే వచ్చి మంచి హిట్ కొట్టిన సినిమా స్త్రీ. బాలీవుడ్ నటీనటులు రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ నటించారు. ఆ సినిమా క్లైమ్యాక్స్ ను ఉత్కంఠ రేపేలా ముగించగా.. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత సీక్వెల్ తీసుకొస్తున్నారు. ఇప్పటికే స్త్రీ, రూహి, భేడియాలాంటి హారర్ జానర్ సినిమాలు తీసిన మాడక్ సూపర్ నేచురల్ యూనివర్స్ నుంచే ఈ సినిమా కూడా వస్తోంది.

స్త్రీ 2 టీజర్ కొన్ని రోజుల కింద ఆన్ లైన్లో లీక్ కాగా.. ఇప్పుడు మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేశారు. అప్పుడే ఈ సినిమాలో రాజ్ కుమార్ రావ్, శ్రద్ధాతోపాటు తమన్నా కూడా నటిస్తోందని తేలిపోయింది. ఇప్పుడు అధికారిక ట్రైలర్ లోనూ ఆమె కనిపించింది. ఓ స్పెషల్ ఐటెమ్ సాంగ్ లో తమన్నా స్టెప్పులేయడం ఈ టీజర్లో చూడొచ్చు. మొదటి భాగంలో నటించిన అపరశక్తి ఖురానా, పంకజ్ త్రిపాఠీ, అభిషేక్ బెనర్జీలాంటి వాళ్లు ఇందులో కూడా ఉన్నారు.

తమన్నా సర్‌ప్రైజ్

స్త్రీ 2 టీజర్లో తమన్నాను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఓ సాంగ్ లో డ్యాన్స్ చేసినట్లు ఓ చోట.. మరో దగ్గర షాక్ తిన్నట్లుగా ఆమె కనిపించింది. ఈ మధ్యే ఆమె అరణ్మనై అనే మరో హారర్ మూవీతోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఓ చిన్న ఊరు, అక్కడి దెయ్యంతో వాళ్లు పడే సరదా కష్టాలను నవ్విస్తూ, భయపెడుతూ స్త్రీ మూవీ సాగిపోయింది. ఇప్పుడు సీక్వెల్ తోనూ అంతే భయపెట్టేలా టీజర్ చూస్తే తెలుస్తోంది.

ఈ టీజర్ చూసి సినిమా ఎప్పుడు వస్తుందా అన్న ఆసక్తిని ఫ్యాన్స్ వ్యక్తం చేశారు. ఓ స్త్రీ త్వరగా రా అంటూ ఓ అభిమాని కామెంట్ చేయడం విశేషం. దెయ్యాలు ఎంత ఎంటర్టైనింగా ఉంటాయో స్త్రీ మూవీ చూసిన తర్వాతే తెలిసిందని, ఈ సీక్వెల్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న మరో ఫ్యాన్ అన్నారు. స్త్రీ 2 మూవీ ఆగస్ట్ 15న థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఆరోజే పాన్ ఇండియా మూవీ పుష్ప 2 రిలీజ్ కావాల్సిన ఉన్నా అది వాయిదా పడింది. అదే రోజు సింగం అగైన్, డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమాలు రాబోతున్నాయి. మరి ఆ భారీ బడ్జెట్ సినిమాలతో ఈ హారర్ కామెడీ ఎలా పోటీ పడబోతోందో చూడాలి.

WhatsApp channel