Horror Comedy Movie: హారర్ కామెడీ మూవీకి రూ.100 కోట్లు.. ఓటీటీలోకి ఎప్పుడు రాబోతోందంటే?-horror comedy movie munjya enters 100 crores club here is ott release date of the sharvari wagh movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Horror Comedy Movie: హారర్ కామెడీ మూవీకి రూ.100 కోట్లు.. ఓటీటీలోకి ఎప్పుడు రాబోతోందంటే?

Horror Comedy Movie: హారర్ కామెడీ మూవీకి రూ.100 కోట్లు.. ఓటీటీలోకి ఎప్పుడు రాబోతోందంటే?

Hari Prasad S HT Telugu
Jun 25, 2024 07:30 AM IST

Horror Comedy Movie: హారర్ కామెడీ జానర్ లో వచ్చిన ముంజ్యా మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లోకి ఎంటరవడం విశేషం. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు రానుందంటే?

హారర్ కామెడీ మూవీకి రూ.100 కోట్లు.. ఓటీటీలోకి ఎప్పుడు రాబోతోందంటే?
హారర్ కామెడీ మూవీకి రూ.100 కోట్లు.. ఓటీటీలోకి ఎప్పుడు రాబోతోందంటే?

Horror Comedy Movie: ఓ చిన్న సినిమాగా రిలీజైన హారర్ కామెడీ బాక్సాఫీస్ ను ఏలుతోంది. కార్తీక్ ఆర్యన్ లాంటి హీరో నటించిన చందూ ఛాంపియన్ ను కూడా వెనక్కి నెట్టి 17 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమా పేరు ముంజ్యా (munjya). మరాఠీ దర్శకుడు ఆదిత్య సర్పోదర్ తెరకెక్కించిన ఈ సినిమాలో శర్వరి వాఘ్, అభయ్ వర్మ నటించారు.

రూ.100 కోట్ల క్లబ్‌లో ముంజ్యా

హారర్ కామెడీ జానర్ సత్తా ఏంటో మరోసారి నిరూపించింది ముంజ్యా మూవీ. బాలీవుడ్ లో అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి.. సంచలన విజయం సాధించింది. ఈ మూవీ తాజాగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. అది కూడా 17 రోజుల్లోనే. ఈ విషయాన్ని ముంజ్యాను తెరకెక్కించిన మాడక్ ఫిల్మ్స్ తన ఇన్‌స్టాగ్రామ్ లో అధికారికంగా వెల్లడించింది.

"ముంజ్యా నవ్విస్తూ, భయపెడుతూ రూ.100 కోట్లు సంపాదించేసింది. చారిత్రక మూడో వీకెండ్ కోసం కృతజ్ఞతలు. మీరు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు" అని అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ ఈ పోస్ట్ చేసింది. ఈ ప్రొడక్షన్ హౌజ్ అధికారికంగా షేర్ చేసిన వివరాల ప్రకారం.. ముంజ్యా సినిమా రూ.103 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

ఇక నెట్ కలెక్షన్లు చూస్తే.. రూ.87.35 కోట్లుగా ఉన్నాయి. తొలి రోజు అనూహ్యంగా రూ.4 కోట్ల ఓపెనింగ్ తో ప్రారంభమైన ఈ సినిమా.. తొలి వారమే రూ.36.5 కోట్లతో సంచలనం రేపింది. అదే జోరు కొనసాగిస్తూ.. రెండో వారం మరో రూ.32 కోట్లు వసూలు చేసింది. బాక్సాఫీస్ బరిలో చందూ ఛాంపియన్ లాంటి సినిమా ఉన్నా కూడా మూడో వారమూ ముంజ్యానే పైచేయి సాధించింది.

ఏంటీ ముంజ్యా మూవీ?

ముంజ్యా మూవీని మరాఠీ దర్శకుడు ఆదిత్య సర్పోదర్ డైరెక్ట్ చేశాడు. ఇందులో శర్వరీ వాఘ్, అభయ్ వర్మ, మోనా సింగ్, సత్యరాజ్ లాంటి వాళ్లు నటించారు. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో జరిగిన స్టోరీగా దీనిని తెరకెక్కించారు. ముంజ్యా అనే ఓ వింత జీవి, అది బిట్టూ (అభయ్ వర్మ) జీవితంపై చూపించే ప్రభావం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

ఈ సినిమా మొత్తం పూర్తి మరాఠీ సంస్కృతి కనిపిస్తుంది. మాడక్ ఫిల్మ్స్ నుంచి ఇప్పటికే స్త్రీ, రూహి, భేడియాలాంటి హారర్ కామెడీ సినిమాలు రాగా.. ఇప్పుడు ముంజ్యా కూడా సంచలన విజయం సాధించింది. ఇక త్వరలోనే స్త్రీ 2 కూడా రాబోతోంది.

ముంజ్యా ఓటీటీ రిలీజ్ డేట్

ముంజ్యా మూవీని ఓటీటీలో చూద్దామని వేచి చూసే ప్రేక్షకులు కాస్త ఓపిక పట్టాల్సిందే. ఎందుకంటే ఒప్పందం ప్రకారం రెండు నెలల తర్వాతగానీ ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం లేదు. ఈ సినిమా డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. అయితే ఆగస్టులోగానీ ఈ మూవీని అందులో అడుగుపెట్టే సూచనలు కనిపించడం లేదు.

పైగా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ బాగానే రాబడుతోంది. ఒకవేళ థియేటర్లలో కాస్త తగ్గితే.. జులైలోనే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. అయితే ఈలోపు ఈ ముంజ్యా మూవీ డైరెక్టరే తీసిన కాకుడా (Kakuda) అనే మరో హారర్ మూవీ జీ5 ఓటీటీలోకి నేరుగా వస్తోంది. జులై 12 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఆ సినిమాను చూసేయండి.

WhatsApp channel