Tamannah in Horror movie: ఆ హారర్ మూవీ సీక్వెల్‌లో తమన్నా.. లీకైన టీజర్‌లో కనిపించిన మిల్కీ బ్యూటీ-tamannah bhatia in stree 2 movies leaked teaser confirms her presence rajkumar rao shraddha kapoor ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tamannah In Horror Movie: ఆ హారర్ మూవీ సీక్వెల్‌లో తమన్నా.. లీకైన టీజర్‌లో కనిపించిన మిల్కీ బ్యూటీ

Tamannah in Horror movie: ఆ హారర్ మూవీ సీక్వెల్‌లో తమన్నా.. లీకైన టీజర్‌లో కనిపించిన మిల్కీ బ్యూటీ

Hari Prasad S HT Telugu

Tamannah in Horror movie: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరో హారర్ మూవీలో నటిస్తోంది. బాలీవుడ్ లో వస్తున్న స్త్రీ 2 సినిమాలో ఆమె నటించినట్లు లీకైన టీజర్ చూస్తే తెలుస్తోంది.

ఆ హారర్ మూవీ సీక్వెల్‌లో తమన్నా.. లీకైన టీజర్‌లో కనిపించిన మిల్కీ బ్యూటీ

Tamannah in Horror movie: తమన్నా భాటియా ఇప్పుడో హారర్ మూవీ సీక్వెల్లో నటించినట్లు లీకైన టీజర్ చెబుతోంది. హిందీలో రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ మూవీకి ఇప్పుడు సీక్వెల్ వస్తున్న విషయం తెలుసు కదా. స్త్రీ 2 (Stree 2) మూవీ నుంచి శుక్రవారం (జూన్ 14) టీజర్ లో కొంత భాగం లీకవగా.. అందులో ఒక ఫ్రేమ్ లో తమన్నా కనిపించింది.

స్త్రీ 2 మూవీలో తమన్నా

రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ మూవీ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కామెడీ హారర్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను శుక్రవారం (జూన్ 14) థియేటర్లలో ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోలో కొంత భాగం సోషల్ మీడియాలో లీకైంది. అయితే అందులో ఒక చోట తమన్నా కనిపించడం విశేషం.

స్త్రీ తొలి భాగంలాగే సీక్వెల్ కూడా కామెడీతోపాటు భయపెట్టడం ఖాయమని ఈ చిన్న టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. నిజానికి ఈ గ్లింప్స్ ను మేకర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేయలేదు. కేవలం థియేటర్లలోనే ప్రదర్శించగా.. కొందరు మొబైల్స్ లో వీడియో తీసి పోస్ట్ చేశారు. దీంతో అది కాస్తా వైరల్ అవుతోంది. ఈ గ్లింప్స్ చివర్లో ఓచోట తమన్నా ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం కనిపించింది.

స్త్రీ 2 ఫస్ట్ గ్లింప్స్

రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ 2 మూవీ ఫస్ట్ గ్లింప్స్ లో తొలి భాగంలో కనిపించిన పంజక్ త్రిపాఠీ, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీలాంటి వాళ్లు మళ్లీ కనిపించారు. పోయిన దెయ్యం అదే ఊరికి తిరిగి రావడం ఇందులో చూడొచ్చు. ది లెజెండ్ ఈజ్ బ్యాక్ అనే అక్షరాలు మొదట స్క్రీన్ పై కనిపించిన తర్వాత టీజర్ మొదలవుతుంది.

ఇది నిజంగానే వచ్చేసింది అనే రాజ్ కుమార్ రావ్ డైలాగ్ తో హారర్ మొదలవుతుంది. తర్వాత టీజర్ అంతా కామెడీ, హారర్ తో సాగిపోతుంది. శ్రద్ధా కపూర్ ఇందులో రెండు భిన్నమైన పాత్రల్లో నటించినట్లు స్పష్టమవుతోంది. అయితే ఈ సినిమాలో తమన్నా ఓ స్పెషల్ డ్యాన్స్ చేసినట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది. ఇందులో ఆమె సెక్సీ లుక్ లో కనిపించింది.

అయితే ఇందులో ఆమె పాత్ర ఏంటన్నదానిపై స్పష్టత లేదు. జియో స్టూడియోస్, మ్యాడక్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. ఈ స్త్రీ 2 మూవీని అమర్ కౌశిక్ డైరెక్ట్ చేశాడు. 2018లో తొలి భాగం రిలీజై మంచి హిట్ సాధించింది. ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి ఇప్పటికే స్త్రీ, రూహి, భేడియాలాంటి హారర్ మూవీస్ రాగా.. ఇప్పుడు స్త్రీ 2 కూడా రాబోతోంది.

మరోవైపు ఈ మధ్య అరణ్మనై 4 మూవీతో భయటపెట్టిన తమన్నా.. ఇప్పుడు స్త్రీ 2తో రాబోతోంది. మరోవైపు తెలుగులో ఓదెల 2 మూవీలోనూ నటిస్తోంది. డేరింగ్ పార్ట్‌నర్స్ అనే ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ లోనూ తమన్నా కనిపించనుంది.