Today OTT Movies: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 5 సినిమాలు.. 3 చాలా స్పెషల్.. అన్నీ తెలుగులోనివే.. ఇక్కడ చూసేయండి!-today ott movies streaming on netflix etv win aha nani saripodhaa sanivaaram chapra murder case rti movie ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Today Ott Movies: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 5 సినిమాలు.. 3 చాలా స్పెషల్.. అన్నీ తెలుగులోనివే.. ఇక్కడ చూసేయండి!

Today OTT Movies: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 5 సినిమాలు.. 3 చాలా స్పెషల్.. అన్నీ తెలుగులోనివే.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu
Sep 26, 2024 08:45 AM IST

Today OTT Streaming Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే (సెప్టెంబర్ 12) సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తం 5 వరకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇందులో ఏకంగా 3 చాలా స్పెషల్‌గా ఉండగా.. అవన్నీ తెలుగులో ఉండటం విశేషం. వీటిలో సరిపోదా శనివారంతోపాటు మలయాళ క్రైమ్ థ్రిల్లర్, కోర్ట్ డ్రామా సినిమాలు ఉన్నాయి.

ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 5 సినిమాలు.. 3 చాలా స్పెషల్.. అన్నీ తెలుగులోనివే.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 5 సినిమాలు.. 3 చాలా స్పెషల్.. అన్నీ తెలుగులోనివే.. ఇక్కడ చూసేయండి!

Today OTT Releases: ఈ వారం ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి 24కిపైగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అయితే, ప్రతి వారం ఓటీటీ రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీసుల్లో సాధారణంగా శుక్రవారం నాడే స్ట్రీమింగ్ అవుతుంటాయి. కానీ, ఈ మధ్య గురువారాలు కూడా చాలా వరకు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.

రెండు రోజుల్లో

అలా ఇవాళ (సెప్టెంబర్ 26) ఐదు వరకు సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇదిలా ఉంటే, ఈ వారంలో వచ్చిన సినిమాలు, వెబ్ సిరీసులు అన్ని ఎక్కువగా శుక్రవారం (సెప్టెంబర్ 27) రిలీజ్ కానుండగా.. కొన్ని స్పెషల్ సినిమాలు గురువారం ఓటీటీలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం నాడు రిలీజైన ఐదింట్లో మూడు సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. మరి వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

సరిపోదా శనివారం (తెలుగు చిత్రం)- సెప్టెంబర్ 26

నోబడీ వాంట్స్ దిస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 26

బ్యాంకాక్ బ్రేకింగ్ (థాయ్ మూవీ)- సెప్టెంబర్ 26

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

ఇన్ సైడ్ ఔట్ 2 (ఇంగ్లీష్ యానిమేషన్ మూవీ)- సెప్టెంబర్ 25

గ్రోటస్క్వైరీ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 26

ఆహా ఓటీటీ

బ్లింక్ (తమిళ చిత్రం)- సెప్టెంబర్ 25

చాప్రా మర్డర్ కేస్ (మలయాళ మిస్టరీ థ్రిల్లర్ అంచక్కల్లకొక్కన్ తెలుగు వెర్షన్)- సెప్టెంబర్ 25

మిడ్ నైట్ ఫ్యామిలీ (స్పానిష్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ- సెప్టెంబర్ 25

ఆర్టీఐ (లీగల్ థ్రిల్లర్ మూవీ)- ఈటీవీ విన్ ఓటీటీ- సెప్టెంబర్ 26

బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్

ఇలా ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి ఐదు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో చాలా స్పెషల్‌గా చెప్పుకునే సినిమా సరిపోదా శనివారం. నేచురల్ స్టార్ నాని నటించిన యాక్షన్ థ్రిల్లర్ సరిపోదా శనివారం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే ఓటీటీలోకి రావడం విశేషం.

డబ్బింగ్ ఆర్టిస్ట్

ఇదే కాకుండా మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అంచకల్లకొక్కన్‌కు తెలుగు రీమేక్‌గా వచ్చిన చాప్రా మర్డర్ కేస్ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉండనుంది. చాప్రా మర్డర్ కేస్ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో పాటు కోర్ట్ డ్రామా చుట్టూ నడిచే కథతో ఆర్టీఐ సినిమా స్పెషల్‌గా ఉంది. ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, డబ్బింగ్ ఆర్టిస్ట్, యాక్టర్ రవిశంకర్ ప్రధాన పాత్రలు పోషించారు.

3 చాలా స్పెషల్

ఈ మూడు అత్యంత స్పెషల్ సినిమాలతో పాటు సెప్టెంబర్ 25 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఇన్‌సైడ్ ఔట్ 2 అనే యానిమేషన్ కామెడీ మూవీ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండనుంది. ఇది పిల్లలకు చూపించేందుకు బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇలా ఇవాళ ఐదు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కాగా.. వాటిలో 3 స్పెషల్ కావడం విశేషం.